బ్లాగ్ లో టపా పోస్ట్ చెయ్యగానే మీకు ఆ పోస్ట్ మీ గూగుల్ ప్లస్ లో కూడా ఆటోమేటిక్ గా కనిపించాలి అని అనుకుంటున్నారా ? అయితే మీరు ఈ క్రింది పద్ధతులను పాటించండి.
గూగుల్ ప్లస్ అకౌంట్ మీకు ఉండి, బ్లాగ్ ని మీరు నిర్వహిస్తుంటే - ఈ పద్ధతి అమలవుతుంది. ఈ పద్ధతిలో మీరు మీ బ్లాగ్ లో వేసిన పోస్ట్ - వెనువెంటనే మీ గూగుల్+ లో కనిపిస్తుంది. Google+ సోషల్ అకౌంట్ లోని మీ మిత్రులు మరియు మీరు ఎవరెవరి సర్కిల్ లలో ఉన్నారో వారు ఈ పోస్ట్ యొక్క నోటిఫికేషన్ / లింక్ ని చూడగలరు. దీనివలన లాభం ఏమిటీ అంటే - మీ గూగుల్+ సోషల్ అకౌంట్ లోని మీ మిత్రులు ఆ పోస్ట్ ని చూస్తే మీ బ్లాగ్ వ్యూయర్ షిప్ పెరుగుతుంది. మీ బ్లాగ్ ర్యాంక్ కూడా పెరుగుతుంది. అలా మీ బ్లాగ్ పాపులారిటీ ని పెంచుకోవచ్చును.
ఇంతకు ముందు ఇలా లేకుండెను.. మనమే మాన్యువల్ గా అలా షేర్ చెయ్యాల్సి ఉండేది. కొద్దికాలం క్రిందట ఇలా సెట్టింగ్ వచ్చింది. మన ప్రమేయం లేకుండా, ప్రతిసారీ అలా మాన్యువల్ గా చెయ్యకుండా - మనం నిర్ణయించుకున్న సెట్టింగ్స్ వల్ల - ఇలా పోస్ట్ కాగానే షేర్ లింక్ మన Google+ టైం లైన్ మీద కనిపిస్తుంది. ఆ లింక్ ని చూసిన మిత్రులు - ఆ లింక్ ద్వారా మన బ్లాగ్ లోని పోస్ట్ ని నేరుగా చేరుకుంటారు. ఇప్పుడు ఆ సెట్టింగ్స్ ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ముందుగా మీ బ్లాగ్ హోం పేజీ ఓపెన్ చెయ్యండి. అంటే www.blogger.com ని ఓపెన్ చెయ్యాలి. అప్పుడు మీకు బ్లాగ్ ఉంటే ఆ బ్లాగ్ తెరచుకుంటుంది. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. ఈ క్రింది ఫోటోలోని Click here వద్ద ఉన్న చిన్న చదరపు గడిలో ఉన్న త్రికోణాకారాన్ని నొక్కాలి.
ఇప్పుడు మీరు ఇలా 1 వద్ద నొక్కాక, ఒక డ్రాప్ మెనూ వస్తుంది. అందులో ఉన్న Google+ ( 5 వ ఆప్షన్ ) ని 2 వద్ద డబల్ క్లిక్ చెయ్యండి.
ఇప్పుడు ఆ Google+ సెట్టింగ్స్ ఇలా మీ గూగుల్+ ప్రొఫైల్ ఫోటోతో తెరుచుకుంటుంది. ఇందులో 3 వద్ద ఉన్న మూడు ఆప్షన్స్ లలో మొదటి రెండింటినీ టిక్ చెయ్యండి. ఇలా చెయ్యడం వలన మీరు మీ బ్లాగ్ లో ఇలా పోస్ట్ చెయ్యగానే, అలా మీ గూగుల్+ అకౌంట్లో ఆ పోస్ట్ లింక్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ప్రత్యేకించి మళ్ళీ చెయ్యాల్సిన అవసరం లేదు.
4 వద్ద టిక్ చెయ్యడం అనేది అది మీ ఇష్టం. నా సలహా అయితే మీరు టిక్ చెయ్యకుండా ఉండటమే మేలు.
అలా చెయ్యకుండా ఉంటే - మీ బ్లాగ్ ని నేరుగా దర్శించేవారు ఏదైనా అభినందనో, విమర్శనో, సూచననో కామెంట్ పెట్టడానికి Post a comment అనే ఆప్షన్ / లింక్ కనిపిస్తుంది. దాన్ని వాడి - మీరు చేసిన పోస్ట్ గురించి కామెంట్ పెడతారు. కానీ గూగుల్+ వారి మితృల కామెంట్స్ మీ బ్లాగ్ పోస్ట్ లో కనిపించే అవకాశం లేదు.
అక్కడ టిక్ చేసి ఉంటే - మీ గూగుల్+ మిత్రులు మాత్రమే కామెంట్స్ చెయ్యగలరు. వారికి మాత్రమే కామెంట్ పోస్ట్ చెయ్యడానికి లింక్ వస్తుంది. బయట నుండి / నేరుగా మీ బ్లాగ్ ని సందర్శించే వారికి మాత్రం ఆ ఆప్షన్ ఉండదు. కొద్దిరోజులు ఈ ఆప్షన్ ని కొన్ని కారణాల వల్ల వాడాల్సి వచ్చింది.
No comments:
Post a Comment