[తెలుగుబ్లా గు:22250] naa telugu dhira niti satakanni pettali ella - ఈ ప్రశ్నకి నేను ఇచ్చిన జవాబు.
మీ తెలుగు ధీర నీతి శతకాన్ని పెట్టాలీ అన్నారు కదా.. అది ఎక్కడనో మీరు తెలియచెయ్యలేదు. బహుశా మీ బ్లాగులో అనుకుంటాను. ఒకవేళ మీ బ్లాగులో అయితే మీరు మీ శతకాన్ని ఈ క్రింది పద్ధతుల్లో పెట్టవచ్చును..
1. మీ బ్లాగులో నేరుగా లేదా తెలుగు టైపింగ్ ఉపకరణాలను వాడి, తెలుగులో టైపు చేసి, పబ్లిష్ చెయ్యటం.
2. మీ శతక అచ్చు ప్రతిని స్కాన్ చేసి, ఫోటోల రూపముగా మీ బ్లాగులోకి అప్లోడ్ చేసి, పబ్లిష్ చేసుకోవడం.
3. మీ శతకాన్ని మీ గొంతుతో లేదా వేరొకరి స్వరాన MP3 ఫార్మేట్ లో రికార్డ్ చేసి, Divishare లాంటి ప్లేయర్ల ద్వారా వినిపించడం.
4. మీరు ఆ శతకాన్ని చెబుతున్నప్పుడు వీడియో తీసి, దాన్ని youtube లోకి అప్లోడ్ చేసి, ఆ వీడియో లింక్ ని మీ బ్లాగ్ లో ఇచ్చి, ఆ వీడియోని అక్కడ ప్రదర్శించటం.
5. అలా కాకుంటే నేరుగా మీ వీడియోని బ్లాగ్ లోకి అప్లోడ్ చేసి, ప్రదర్శించడం.
6. PDF రూపములో మీ శతకాన్ని తయారుచేసి, దాన్ని ఏదైనా షేరింగ్ సైట్ లోకి ఎక్కించి, ఆ పోస్ట్ లింక్ ని మీ బ్లాగ్ లో పబ్లిష్ చేసుకోవడం.
7. మీ Google drive గూగుల్ డ్రైవ్ లోకి ఆ శతకాన్ని ( MP3, ఆడియో, వీడియో, PDF, ఫోటోలు.. ) ఎక్కించి, ఆ లింక్ ని మీ సైట్ లో పోస్ట్ చెయ్యడం వల్ల మీ శతకాన్ని నలుగురికీ అందేలా చేసుకోవచ్చును.
2 comments:
మీరు టైపు చేసిన పద్యాలను ఇక్కడ సరిచూసుకోండి
http://chandam.apphb.com
మీరు టైపు చేసిన పద్యాలను
ఇక్కడ సరిచూసుకోండి.
ఛందం-http://chandam.apphb.com
Post a Comment