బ్లాగ్ లో ఫొటోస్ పెట్టి వాటికి ఎలా లింక్ పెట్టాలో అడిగారు కదా.. ఇలా నేనెప్పుడూ ప్రయత్నించలేదు కనుక తెలీదు. మీరు అడిగారని సెట్టింగ్స్ చూసి, అలా ఏమీ లేవు అనుకొని, అలా ఏమీ లేవంటూ, సాధారణ లింక్ ఎలా పెట్టాలో తెలియచేస్తూ Photo / word links పెట్టొచ్చా ? అనే పోస్ట్ వ్రాశాను. తోటి బ్లాగర్ అయిన రాజాచంద్ర గారు అలా - ఫొటోస్ లింక్ పెట్టొచ్చు అని కామెంట్ పెట్టారు. వారికి కృతజ్ఞతలు. వారి కామెంట్ వలన నేనొక క్రొత్త విషయాన్ని శోధించి, తెలుసుకున్నాను.
సాధారణముగా నేను వ్రాస్తున్న పోస్ట్స్ అన్నీ నా అనుభవాలు. నా అంతట నేనుగా నేర్చుకొన్న విషయాలు. ఎవరివద్దా, ఏదైనా సైట్ చూసి నేర్చుకొన్నవి కావు కనుక ఇందులో - ఈ బ్లాగులో - పెట్టే టపాలు అన్నీ నేను స్వయానా నేర్చుకొని, మీకోసం చెబుతున్నవే.. అందువలన అలా చెప్పాల్సివచ్చింది. ఇప్పుడు కూడా తన కామెంట్ చూశాక ఎలా ఫోటో లింక్స్ పెట్టాలో స్వయంగా నేర్చుకొని, ఆ పద్ధతిని మీకు ఇప్పుడు తెలియచేస్తున్నాను. ఇది స్వోత్కర్షలా ఉన్నా నిజమే.
బ్లాగులో క్రొత్తగా టపా వ్రాస్తున్నప్పుడు గానీ, లేదా పాత టపాని మళ్ళీ ఎడిట్ చేసి, ఏదైనా ఒక ఫోటోకి లింక్ ఇచ్చి, ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే నేరుగా - ఏదైనా సైట్ / పేజీ / పోస్ట్ / ఫోటో... కి వెళ్ళేలా చెయ్యవచ్చును.
అలా చెయ్యాలీ అంటే మీరు - మీ పోస్ట్ లో ఏదైనా ఫోటోని ఎన్నుకోవాలి లేదా క్రొత్తగా ఒక ఫోటో అప్లోడ్ చెయ్యాలి. ఇప్పుడు మీకు తేలికగా అర్థం కావటానికి - మీ బ్లాగ్ ప్రొఫైల్ ఫోటో ( చేగోవేరా ) ఫోటోని ఇక్కడ ఉపయోగించుకుంటున్నాను. అన్యదా భావించరని అనుకుంటున్నాను.
1. టపాలోని టూల్ బార్ లోని - ఫొటోస్ ని అప్లోడ్ చేసే - Insert image - అనే పనిముట్టుని వాడి, చేగోవేరా ఫోటోని అప్లోడ్ చెయ్యాలి. అప్పుడు మీకు ఇలా - ఈ క్రింది ఫోటోలో మాదిరిగా కనిపిస్తుంది.
2. అలా అప్లోడ్ అయ్యాక ఇప్పుడు ఆ ఫోటో మీద - మౌస్ కర్సర్ ని ఉంచి, మౌస్ లోని ఓకే మీటని - అంటే ఎడమ క్లిక్ ని ఒకసారి నొక్కి, ఆ ఫోటోని సెలెక్ట్ చెయ్యాలి. అందాకా మామూలుగా కనిపించిన ఆ ఫోటో - ఆ ఫోటో మీద నీలంరంగు పులిమినట్లు అగుపిస్తుంది. అలా నీలిరంగు ఆ ఫోటో మీద కనిపించినట్లయితే - లింక్ ఇవ్వటానికి సిద్ధముగా ఉందన్నమాట. అప్పుడు ఈ క్రింద విధముగా ఉంటుంది.
3. ఇప్పుడు టపా టూల్ బార్ లోని Link అనే Add or remove link అనే పనిముట్టుని ఒకసారి నొక్కాలి. ఈ Add or remove link అనేది - ఆ టూల్ మీద కర్సర్ ఉంచినప్పుడు కనిపిస్తుంది.
4. అప్పుడు Edit link అనే చిన్న విండో వస్తుంది. అందులోని Web address వద్ద మీ బ్లాగ్ అడ్రెస్స్ ఇచ్చాను. ( క్రింద ఫోటోని చూడండి ) ఇక్కడ ఆ లింక్ అనే కాకుండా చేగోవేరా కి సంబంధించిన ఏదైనా పోస్ట్ లింక్ ని కాపీ, పేస్ట్ పద్ధతిలో ఇచ్చేసి, క్రింద ఎడమ మూలన ఉన్న OK ని నొక్కాలి. ఇక అంతే.!! ఆ పోస్ట్ ని పబ్లిష్ చేసినప్పుడు - ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే నేరుగా ఏదైతే లింక్ ఇచ్చామో అక్కడికే చేరుకుంటాం.
ఇలా పనిచేస్తుందో, లేదో పరీక్షించి చూద్దాం.
ఇప్పుడు మీ బ్లాగ్ ప్రొఫైల్ ఫోటో అయిన చే గెవారా ఫోటోని అప్లోడ్ చేసి, దానికి వికీపిడియా లోని చే గెవారా వ్యాసం లింక్ ఇస్తున్నాను. మీరు ఈ క్రింది ఫోటోని నొక్కితే - ఆ వ్యాసం వద్దకు నేరుగా వెళ్ళగలుగుతున్నారో లేదో మీరే చెక్ చెయ్యండి.
3 comments:
చాల ధన్యవాదాలు రాజా గారు.. మీ పోస్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంధి..
చాల ధన్యవాదాలు రాజా గారు.. మీ పోస్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంధి..
కృతజ్ఞతలు ప్రవీణ్ గారూ..
Post a Comment