నిజమే కదూ! నిజమైన మిత్రులు ఎంత పోట్లాడుకున్నా, తిట్టుకున్నా, ఒకరి మీద ఒకరు ఎంత ఫిర్యాదులు చేసుకున్నా, కొద్దిరోజులు మాట్లాడుకోకుండా మౌనముగా ఉన్నా, అవతలివారు ఏమి చేస్తున్నారో, వారు ఎలా ఉన్నారో, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటారు. అవతలివారు తమకి దూరమైనా, వారు బాగుండాలని పదే పదే కోరుకుంటారు. వారిని తలుచుకుంటారు. వారితో గడిపిన సాన్నిహిత్యాన్ని మరువలేకపోతారు. తన నేస్తం బాగుండాలని కోరుకోని క్షణం ఉండదు.
చాలాసార్లు ఎదుటివారికోసం చెప్పలేనన్ని త్యాగాలు కూడా చేస్తారు. వారి ఆనందం కోసం తమ జీవితాన్నే నిర్లక్ష్యం చేసుకొని, మరీ వారి బాగు కోసం పాటుపడతారు. వారి ముఖారవిందాల్లో నవ్వు కోసం తాము పడరాని పాట్లు పడతారు. అవసరం అనుకుంటే - తనని అవతలి వారి మిత్రులు గేలిచేస్తున్నా, తన ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తున్నా, తనని ఎన్నెన్నో అవమానాలకి గురి చేస్తున్నా - తనని కాదు అనుకొని మరీ అవతలి వారి శ్రేయస్సు కోసం పాటు పడతారు. దేహాలు రెండు వేరైనా ఒకే మనసు అన్నట్లు మెలుగుతారు. అలాంటివారే "ప్రాణ స్నేహితులు" అన్నమాట (Soul mate friend).
No comments:
Post a Comment