మీరు ఫేస్ బుక్ అకౌంట్ లోకి ఫొటోస్ అప్లోడ్ చేస్తారు కదా.. మీరు వాటిని అన్నింటినీ ఒకే దగ్గర పోస్ట్ చెయ్యవచ్చు. లేదా తెలీక అన్నింటినీ కలగలిపి ఉండవచ్చును. మీరు వేటికి అవి, విడివిడిగా ఒక్కో ఆల్బమ్ లో ఉండాలని అనుకుంటున్నారా?. అంటే పర్యటనకి సంబంధించినవి ఒకదగ్గర, పూల ఫొటోస్ ఇంకోచోట, ఆసక్తికర ఫోటో మరోచోట ఆల్బమ్ లో ఉండాలని అనుకుంటున్నారా?.
ఇలా చెయ్యాలీ అంటే - అన్నింటినీ మళ్ళీ సిస్టం లోకి కాపీ చేసుకొని, ఫేస్ బుక్ లో క్రొత్తగా ఒక ఫోల్డర్ తయారుచేసుకొని, అందులోకి మళ్ళీ అప్లోడ్ చెయ్యాలని అనుకుంటున్నారా? అలా చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఆ పాత ఫొటోస్ కి వచ్చిన కామెంట్స్, లైక్స్ అన్నీ పోతాయి. అలా పోకుండా ఎలా చెయ్యాలో, మీరు అప్లోడ్ చేసిన ఫొటోస్ వేరు వేరు ఆల్బమ్స్ లలోకి ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చెబుతాను.
ముందుగా మీ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి, అందులోని మీ ఫొటోస్ ఆల్బమ్స్ ని ఓపెన్ చెయ్యండి. అప్పుడు ఇలా 1 వద్ద నొక్కితే మీరు అప్లోడ్ చేసిన ఆల్బమ్స్ ఫొటోస్ వస్తాయి. ఇక్కడ మీరు కొన్ని ఫొటోస్ ని Mobile uploads అనే ఆల్బం లోకి అప్లోడ్ చేశారు అనుకుందాం. వీటిని మీరు Mobile camera photos అనే ఆల్బం లోకి మార్చాలీ అనుకుందాం. ముందుగా ఆ Mobile camera photos అనే ఆల్బం ని మీ ఆల్బమ్స్ లలో సృష్టించుకొని ఉండాలి.
ఇప్పుడు మీరు Albums అని ఉన్నచోట 2 ని నొక్కితే, వచ్చిన అల్బమ్స్ లలో - మీరు ఇందాక అప్లోడ్ చేసిన ఆల్బం ( Ex : Mobile uploads ) 3 ని ఓపెన్ చెయ్యండి. అలా చేశాక కుడి మూలన ఉన్న Edit ని నొక్కండి.
అప్పుడు ఆ Mobile Uploads అనే ఆల్బం ఇలా ఓపెన్ అవుతుంది.
ఇలా ఓపెన్ అయిన ఆ ఆల్బం లోని - ఏ ఫోటో ని అయితే వేరే ఆల్బం లోకి మార్చాలీ అనుకుంటున్నారో ఆ ఫోటో కుడి మూల మీద క్లిక్ 4 చెయ్యండి. అప్పుడు మీకు ఒక డ్రాప్ మెనూ వస్తుంది. అందులో ఉన్న Move to other album ని 5 ఎన్నుకోండి.
ఇలా వచ్చాక ఇలా ఒక పాపప్ విండో వస్తుంది. దానిలోన ఉన్న (మీ ఫోటో ఆల్బమ్స్ పేర్లు) ఇంకొక డ్రాప్ మేనూ ప్రక్కన ఉన్న త్రికోణాన్ని 6 నొక్కండి.
అప్పుడు మీకు మీరు ఫేస్ బుక్ లోకి అప్లోడ్ చేసిన ఆల్బమ్స్ పేర్లు వస్తాయి. అందులో మీరు ఆ ఫోటోని మార్చాల్సిన ఆల్బం పేరుని 7 ఎంచుకోండి. 8 (Ex : Mobile camera photos)
8 వద్ద అలా అలా ఎంచుకున్నాక, 9 వద్ద నున్న Move photo ని నొక్కితే సరి.
ఇప్పుడు 10 వద్ద ఉన్న Done ని నొక్కండి. ఇప్పుడు ఆ ఫోటో ఆ క్రొత్త ఆల్బం ఫోల్డర్ లోకి మారిపోయింది.
అలా నొక్కాక ఈ పాత ఆల్బం లోన ఉన్న ఫొటోస్ అన్నీ వేరే ఆల్బమ్ ఫోల్డర్ లోకి మారిస్తే, మీరు ఆ ఫోల్డర్ ఆల్బం ని డిలీట్ చెయ్యాలీ అనుకుంటే అక్కడ 11 ఉన్న డస్ట్ బిన్ గుర్తుని నొక్కండి.
ఇప్పుడు మీకు మరొక పాపప్ విండో వస్తుంది - అందులోని 12 వద్ద నున్న Delete Album ని నొక్కితే ఆ ఖాళీ ఆల్బం పూర్తిగా అదృశ్యం అవుతుంది.
అంతే!.
No comments:
Post a Comment