Saturday, November 3, 2012

Good Morning - 172


నిజమే కదూ!.. ఈ భూమ్మీద చాలా అందమైన వాటిల్లో స్నేహం కూడా ఒకటి. అలాంటి స్నేహలలో మనకి నిజమైన స్నేహం లభిస్తే - ఎంత బాగుంటుంది!! స్నేహాలలో నిజమైన స్నేహాలూ, అబద్దపు స్నేహాలు అంటూ ఉంటాయా అన్నవారికి ఇంకా స్నేహాల లోలోతులకి వెళ్ళలేదని వారంతట వారుగా తెలియ చేసుకుంటున్నారన్నమాటే! 

ఈరోజుల్లో చాలావరకు మొహమాటపు స్నేహాలు, ఏదో పరిచయం చేసుకొని వాళ్ళు నా స్నేహితులే అని చెప్పుకోవటానికీ,  అవసరార్థ స్నేహాలు.. ఇలా చాలానే ఉన్నాయి. వీటన్నింటిలో నిజమైన స్నేహం అంటూ దొరికితే - ఓహ్! మాటల్లో వర్ణించలేము. అలాంటి స్నేహం దొరికినవారు నిజముగా - వారు చాలా అదృష్టవంతులు. అలాంటి స్నేహం దొరికితే అంతకన్నా విలువైన బహుమానం ఏముంటుంది.   

2 comments:

lakshmi said...

nadi kuda sneham gurinchi same feeling.sneham kosam net lo vediki chala alisipoyanu.nijamaina sneham kosam netlo chuste yandamavula venta padinatte.

Raj said...

నిజమైన స్నేహాలు - అంత సులభముగా దొరకవు. పిసరంత అదృష్టం కూడా ఉండాలి. అది ఆన్లైన్ యే కాదు.. ఎక్కడైనా ఒకటే. శ్రమ అనుకోకుండా వెదుక్కోవాల్సిందే.. నిజమైన స్నేహాలు తప్పక దొరుకుతాయి. కానీ వాటికోసం వెళ్ళే ముందు మనలో చాలా క్వాలిటీస్ పెంచుకోక తప్పదు. మీకు త్వరలోనే నిజమైన నేస్తం దొరకాలని ఆశిస్తున్నాను..

Related Posts with Thumbnails