Saturday, November 17, 2012

Good Morning - 183


నిజమే కదూ!.. మనం అభిమానించే వ్యక్తి తో మనం కలవటానికి, వారు మనకు తగిన సమయం కేటాయించలేదు అంటే - నిజమైన శ్రద్ధ లేదు అన్నట్లే! ఈ వాదన నమ్మలేకున్నట్లు అనిపించినా - నాకు అనుభవమే! ఒకరిని కలవాలి అని అనుకున్నప్పుడు - ఎటువంటి ఆటంకాలు రానీ, ఇబ్బందులు ఉండనీ, మార్గం లేకున్నా.. ఎలాగోలా ఖచ్చితముగా కలసి తీరుతాం. ఇలాంటి ప్రవృత్తి గాఢ ప్రేమికుల్లో చూస్తాం.

ఇంకా నిజం చెప్పాలీ అంటే - మనం ఫలానా సమయములో కలవాలీ అని అనుకున్నప్పుడే - అది వీలవుతుందో లేదో అని అప్పుడే దాదాపుగా ఖచ్చితముగా తెలిసిపోతుంది. దానిని బట్టి ఎప్పుడు వీలవుతుందో చూసి, వారికి కలుసుకొనే సమయం చెప్పొచ్చు. ఇలా చెప్పలేని వారికి తన ఆరోజు దినచర్య మీద తగిన అజమాయిషీ లేదన్న మాట.

ఏరోజుకారోజు సమయం మీద తగిన పట్టు ఉన్నవాళ్ళు వెంటనే తమ తమ ఆప్తులకి సమయం కేటాయించి, ఆ సమయములో తప్పక కలుస్తారు. నాకు మతి మరుపు అన్నవారికి - తమకి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంచక్కా వినియోగించుకోలేక పోతున్నారన్నమాట.

ఉదాహరణకి : ఈరోజు సాయంత్రం కలుద్దాం అని అనుకుని, సమయం ఇచ్చామే అనుకోండి. ఆసమయాన్ని మన ఫోన్ లో రిమైండర్ గా ఫీడ్ చేసుకొని, అలారం పెట్టేసుకుంటే, మనం ఎంత బీజీ ఉన్నా - మనకు అందుబాటులో ఒక సెక్రెటరీ ఉన్నట్లే. సమయానికి అలారం మ్రోగి, అక్కడ ఫీడ్ చేసిన విషయం చూపిస్తుంది. ఇది ప్రతీ మొబైల్ ఫోనులో ఉంటుంది. కానీ చాలామంది వాడుకోరు. ఎప్పుడూ బీజీ ఉండే వ్యక్తులు కూడా ఇది చాలా తక్కువగా వాడుకుంటారు. ఆ ఫీచర్ విలువ వారికి తెలీదు. తెలిసినట్లయితే అలా వదిలేయ్యరు. నా మటుకు మాత్రం ఆ ఫీచర్ లో పుట్టినరోజు, పెళ్లి రోజులు తేదీలు ఫీడ్ అయి ఉంటాయి. ఆరోజు వారికి శుభాకాంక్షలు చెప్పి, వారికి సర్ప్రైజ్ చేస్తుంటాను.

సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకోవచ్చును. నా మిత్రులని నేను తీరుబడిగా రాత్రి పూటే కలుస్తాను. రాత్రి భోజనాలయ్యాక (ఎవరి ఫ్యామిలీ వారికోసం ఎదురుచూస్తూ ఉండకూడదని, ఫ్యామిలీ అందరూ కలసి భోజనం చేసే మధుర క్షణాలని దూరం చేయవద్దని అలా) వచ్చి, కలసి, అర్ధరాత్రి వరకూ మా మాటలు కొనసాగుతాయి.

ఇక్కడ ఇంకో విషయం గుర్తుక వచ్చింది. సమయాన్ని హిందీ నటులు అమితాబ్ బచ్చన్ బాగా వాడుకుంటారు. ఆ ఐడియా కూడా బాగుంది. మీకు నచ్చితే మీరూ వాడండి. ఉదయాన సినిమా షూటింగ్ వెళుతున్నప్పుడు, కారులోనే టిఫిన్ కానిచ్చేస్తారు. వచ్చిన విలేకరులకి అక్కడే టిఫినీలు అయిపోతాయి. తన షూటింగ్ స్పాట్ కి వెళ్ళటానికి గంటల సమయం పడుతుంది. ఆ సమయములో ఇంటర్యూలు కూడా పూర్తవుతాయి. ఇంకా సమయం ఉంటే, తన బ్లాగు, ట్వీట్టర్.. పనులూ చక్కపెట్టేస్తారు ఆ సమయాన. ఇలాని ఆయన ఇంటర్యూలో చదివా..

ఓకే! ఫ్రెండ్స్.. ఇక మీరూ మీ ఆప్తులకి సమయం కేటాయించండి. 

No comments:

Related Posts with Thumbnails