Friday, November 30, 2012

Facebook - Photos change into another album

మీరు ఫేస్ బుక్ అకౌంట్ లోకి ఫొటోస్ అప్లోడ్ చేస్తారు కదా.. మీరు వాటిని అన్నింటినీ ఒకే దగ్గర పోస్ట్ చెయ్యవచ్చు. లేదా తెలీక అన్నింటినీ కలగలిపి ఉండవచ్చును. మీరు వేటికి అవి, విడివిడిగా ఒక్కో ఆల్బమ్ లో ఉండాలని అనుకుంటున్నారా?. అంటే పర్యటనకి సంబంధించినవి ఒకదగ్గర, పూల ఫొటోస్ ఇంకోచోట, ఆసక్తికర ఫోటో మరోచోట ఆల్బమ్ లో ఉండాలని అనుకుంటున్నారా?. 

ఇలా చెయ్యాలీ అంటే - అన్నింటినీ మళ్ళీ సిస్టం లోకి కాపీ చేసుకొని, ఫేస్ బుక్ లో క్రొత్తగా ఒక ఫోల్డర్ తయారుచేసుకొని, అందులోకి మళ్ళీ అప్లోడ్ చెయ్యాలని అనుకుంటున్నారా? అలా చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఆ పాత ఫొటోస్ కి వచ్చిన కామెంట్స్, లైక్స్ అన్నీ పోతాయి. అలా పోకుండా ఎలా చెయ్యాలో, మీరు అప్లోడ్ చేసిన ఫొటోస్ వేరు వేరు ఆల్బమ్స్ లలోకి ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చెబుతాను. 

ముందుగా మీ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి, అందులోని మీ ఫొటోస్ ఆల్బమ్స్ ని ఓపెన్ చెయ్యండి. అప్పుడు ఇలా 1 వద్ద నొక్కితే మీరు అప్లోడ్ చేసిన ఆల్బమ్స్ ఫొటోస్ వస్తాయి. ఇక్కడ మీరు కొన్ని ఫొటోస్ ని Mobile uploads అనే ఆల్బం లోకి అప్లోడ్ చేశారు అనుకుందాం. వీటిని మీరు Mobile camera photos అనే ఆల్బం లోకి మార్చాలీ అనుకుందాం. ముందుగా ఆ Mobile camera photos అనే ఆల్బం ని మీ ఆల్బమ్స్ లలో సృష్టించుకొని ఉండాలి. 


ఇప్పుడు మీరు Albums అని ఉన్నచోట 2 ని నొక్కితే, వచ్చిన అల్బమ్స్ లలో - మీరు ఇందాక అప్లోడ్ చేసిన ఆల్బం ( Ex : Mobile uploads )  3 ని ఓపెన్ చెయ్యండి. అలా చేశాక కుడి మూలన ఉన్న Edit ని నొక్కండి. 


అప్పుడు ఆ Mobile Uploads అనే ఆల్బం ఇలా ఓపెన్ అవుతుంది. 


ఇలా ఓపెన్ అయిన ఆ ఆల్బం లోని - ఏ ఫోటో ని అయితే వేరే ఆల్బం లోకి మార్చాలీ అనుకుంటున్నారో ఆ ఫోటో కుడి మూల మీద క్లిక్ 4 చెయ్యండి. అప్పుడు మీకు ఒక డ్రాప్ మెనూ వస్తుంది. అందులో ఉన్న Move to other album ని 5 ఎన్నుకోండి. 

ఇలా వచ్చాక ఇలా ఒక పాపప్ విండో వస్తుంది. దానిలోన ఉన్న (మీ ఫోటో ఆల్బమ్స్ పేర్లు) ఇంకొక డ్రాప్ మేనూ ప్రక్కన ఉన్న త్రికోణాన్ని 6 నొక్కండి. 

అప్పుడు మీకు మీరు ఫేస్ బుక్ లోకి అప్లోడ్ చేసిన ఆల్బమ్స్ పేర్లు వస్తాయి. అందులో మీరు ఆ ఫోటోని మార్చాల్సిన ఆల్బం పేరుని 7 ఎంచుకోండి. 8 (Ex : Mobile camera photos


8 వద్ద అలా అలా ఎంచుకున్నాక, 9 వద్ద నున్న Move photo ని నొక్కితే సరి. 

ఇప్పుడు 10 వద్ద ఉన్న Done ని నొక్కండి. ఇప్పుడు ఆ ఫోటో ఆ క్రొత్త ఆల్బం ఫోల్డర్ లోకి మారిపోయింది. 


అలా నొక్కాక ఈ పాత ఆల్బం లోన ఉన్న ఫొటోస్ అన్నీ వేరే ఆల్బమ్ ఫోల్డర్ లోకి మారిస్తే, మీరు ఆ ఫోల్డర్ ఆల్బం ని డిలీట్ చెయ్యాలీ అనుకుంటే అక్కడ 11 ఉన్న డస్ట్ బిన్  గుర్తుని నొక్కండి. 


ఇప్పుడు మీకు మరొక పాపప్ విండో వస్తుంది - అందులోని 12 వద్ద నున్న Delete Album ని నొక్కితే ఆ ఖాళీ ఆల్బం పూర్తిగా అదృశ్యం అవుతుంది. 


అంతే!. 


Thursday, November 29, 2012

Good Morning - 195


Monday, November 26, 2012

Good Morning - 193


అవును.. మనకి ఎవరైతే ఇష్టమో - వారికి మనం నచ్చం. నచ్చినా అది అంతంతే! మనం ఎంతగా ఇష్టాన్ని చూపిస్తామో, అంతగా వాళ్ళు మనల్ని ఇష్టపడరు. మనం అంటే బాగా ఇష్టపడేవారిని - మనం అస్సలు పట్టించుకోము. కనీసం వారిని కలవటానికి కూడా అయిష్టత చూపిస్తుంటాము. నిజానికి వాళ్ళు చాలా దూరములో ఉన్నా, మీరంటే నాకు ఇంత ఇష్టం అని చెప్పలేం. ముందుగా ఎంత గట్టిగా అనుకుని చెప్పాలని అనుకున్నా - తీరా ఆ సమయములో నోరు పెగలదు. 

Friday, November 23, 2012

Good Morning - 191


అలాగే నాకు నచ్చిన మరో రెండు.. 




Thursday, November 22, 2012

Good Morning - 190


సృష్టిలో అత్యంత తీయనైన అనుబంధం - స్నేహం! 
తీపినే కాదు - చేదుని కూడా పంచుకునేది స్నేహం!! 
సంతోషం తో నీతో చేతులు కలిపి, 
బాధలో నిన్ను తన చేతుల్లోకి తీసుకొని, 
నిన్ను బాధ్యతల నుండి మరలిపోకుండా 
నీ వెంటే ఉంటూ, నిన్ను వెన్నుతట్టి నడిపించేది స్నేహం.. 

Good Morning - 189


Tuesday, November 20, 2012

Good Morning - 186


నిజమే కదూ! నిజమైన మిత్రులు ఎంత పోట్లాడుకున్నా, తిట్టుకున్నా, ఒకరి మీద ఒకరు ఎంత ఫిర్యాదులు చేసుకున్నా, కొద్దిరోజులు మాట్లాడుకోకుండా మౌనముగా ఉన్నా, అవతలివారు ఏమి చేస్తున్నారో, వారు ఎలా ఉన్నారో, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటారు. అవతలివారు తమకి దూరమైనా, వారు బాగుండాలని పదే పదే కోరుకుంటారు. వారిని తలుచుకుంటారు. వారితో గడిపిన సాన్నిహిత్యాన్ని మరువలేకపోతారు. తన నేస్తం బాగుండాలని కోరుకోని క్షణం ఉండదు. 

చాలాసార్లు ఎదుటివారికోసం చెప్పలేనన్ని త్యాగాలు కూడా చేస్తారు. వారి ఆనందం కోసం తమ జీవితాన్నే నిర్లక్ష్యం చేసుకొని, మరీ వారి బాగు కోసం పాటుపడతారు. వారి ముఖారవిందాల్లో నవ్వు కోసం తాము పడరాని పాట్లు పడతారు. అవసరం అనుకుంటే - తనని అవతలి వారి మిత్రులు గేలిచేస్తున్నా, తన ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తున్నా, తనని ఎన్నెన్నో అవమానాలకి గురి చేస్తున్నా - తనని కాదు అనుకొని మరీ అవతలి వారి శ్రేయస్సు కోసం పాటు పడతారు. దేహాలు రెండు వేరైనా ఒకే మనసు అన్నట్లు మెలుగుతారు. అలాంటివారే "ప్రాణ స్నేహితులు" అన్నమాట (Soul mate friend). 

Saturday, November 17, 2012

Good Morning - 183


నిజమే కదూ!.. మనం అభిమానించే వ్యక్తి తో మనం కలవటానికి, వారు మనకు తగిన సమయం కేటాయించలేదు అంటే - నిజమైన శ్రద్ధ లేదు అన్నట్లే! ఈ వాదన నమ్మలేకున్నట్లు అనిపించినా - నాకు అనుభవమే! ఒకరిని కలవాలి అని అనుకున్నప్పుడు - ఎటువంటి ఆటంకాలు రానీ, ఇబ్బందులు ఉండనీ, మార్గం లేకున్నా.. ఎలాగోలా ఖచ్చితముగా కలసి తీరుతాం. ఇలాంటి ప్రవృత్తి గాఢ ప్రేమికుల్లో చూస్తాం.

ఇంకా నిజం చెప్పాలీ అంటే - మనం ఫలానా సమయములో కలవాలీ అని అనుకున్నప్పుడే - అది వీలవుతుందో లేదో అని అప్పుడే దాదాపుగా ఖచ్చితముగా తెలిసిపోతుంది. దానిని బట్టి ఎప్పుడు వీలవుతుందో చూసి, వారికి కలుసుకొనే సమయం చెప్పొచ్చు. ఇలా చెప్పలేని వారికి తన ఆరోజు దినచర్య మీద తగిన అజమాయిషీ లేదన్న మాట.

ఏరోజుకారోజు సమయం మీద తగిన పట్టు ఉన్నవాళ్ళు వెంటనే తమ తమ ఆప్తులకి సమయం కేటాయించి, ఆ సమయములో తప్పక కలుస్తారు. నాకు మతి మరుపు అన్నవారికి - తమకి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంచక్కా వినియోగించుకోలేక పోతున్నారన్నమాట.

ఉదాహరణకి : ఈరోజు సాయంత్రం కలుద్దాం అని అనుకుని, సమయం ఇచ్చామే అనుకోండి. ఆసమయాన్ని మన ఫోన్ లో రిమైండర్ గా ఫీడ్ చేసుకొని, అలారం పెట్టేసుకుంటే, మనం ఎంత బీజీ ఉన్నా - మనకు అందుబాటులో ఒక సెక్రెటరీ ఉన్నట్లే. సమయానికి అలారం మ్రోగి, అక్కడ ఫీడ్ చేసిన విషయం చూపిస్తుంది. ఇది ప్రతీ మొబైల్ ఫోనులో ఉంటుంది. కానీ చాలామంది వాడుకోరు. ఎప్పుడూ బీజీ ఉండే వ్యక్తులు కూడా ఇది చాలా తక్కువగా వాడుకుంటారు. ఆ ఫీచర్ విలువ వారికి తెలీదు. తెలిసినట్లయితే అలా వదిలేయ్యరు. నా మటుకు మాత్రం ఆ ఫీచర్ లో పుట్టినరోజు, పెళ్లి రోజులు తేదీలు ఫీడ్ అయి ఉంటాయి. ఆరోజు వారికి శుభాకాంక్షలు చెప్పి, వారికి సర్ప్రైజ్ చేస్తుంటాను.

సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకోవచ్చును. నా మిత్రులని నేను తీరుబడిగా రాత్రి పూటే కలుస్తాను. రాత్రి భోజనాలయ్యాక (ఎవరి ఫ్యామిలీ వారికోసం ఎదురుచూస్తూ ఉండకూడదని, ఫ్యామిలీ అందరూ కలసి భోజనం చేసే మధుర క్షణాలని దూరం చేయవద్దని అలా) వచ్చి, కలసి, అర్ధరాత్రి వరకూ మా మాటలు కొనసాగుతాయి.

ఇక్కడ ఇంకో విషయం గుర్తుక వచ్చింది. సమయాన్ని హిందీ నటులు అమితాబ్ బచ్చన్ బాగా వాడుకుంటారు. ఆ ఐడియా కూడా బాగుంది. మీకు నచ్చితే మీరూ వాడండి. ఉదయాన సినిమా షూటింగ్ వెళుతున్నప్పుడు, కారులోనే టిఫిన్ కానిచ్చేస్తారు. వచ్చిన విలేకరులకి అక్కడే టిఫినీలు అయిపోతాయి. తన షూటింగ్ స్పాట్ కి వెళ్ళటానికి గంటల సమయం పడుతుంది. ఆ సమయములో ఇంటర్యూలు కూడా పూర్తవుతాయి. ఇంకా సమయం ఉంటే, తన బ్లాగు, ట్వీట్టర్.. పనులూ చక్కపెట్టేస్తారు ఆ సమయాన. ఇలాని ఆయన ఇంటర్యూలో చదివా..

ఓకే! ఫ్రెండ్స్.. ఇక మీరూ మీ ఆప్తులకి సమయం కేటాయించండి. 

Friday, November 16, 2012

Facebook Emoticons

ఫేస్ బుక్ లో చాట్ లలో, స్టేటస్ అప్డేట్స్ లలో కొన్ని గుర్తులని వాడుతాము. వీటినే స్మైలీస్ అని కూడా అంటారు. వీటిల్లో చాలా గుర్తులు ఉన్నాయి.. కొన్ని గుర్తులు క్రొత్తగా జతపరచబడ్డాయి. ఎక్కడైనా మన భావాన్ని చిన్నగా, క్లుప్తముగా, మన భావం సరిగ్గా వచ్చేలా - కొన్ని గుర్తుల కీ లని నొక్కితే చాలు. ఆ గుర్తు అక్కడ వస్తుంది. 

ఉదాహరణకు : స్మైలీ బొమ్మ రావాలంటే :) అంటే చాలు. ఆ స్మైలీ గుర్తు వచ్చేస్తుంది. ఒకప్పుడు ఇలా స్టేటస్ అప్డేట్స్ లలో మాత్రమె వచ్చేది. ఇప్పుడు మనం వ్రాసే కామెంట్స్ లలో కూడా ఇలా స్మైలీస్ పెట్టోచ్చును. 

ఇప్పుడు అలాంటి గుర్తులు అన్నీ ఒకే దగ్గర, మీకు అర్థం అయ్యేలా వీలుగా మూడు వరుసల్లో ఇస్తున్నాను. గమనించండి. ఒక గుర్తుకు ప్రక్కన ఎలా కీ బోర్డ్ మీటలు నొక్కితే ఏమి వస్తుందో, దాని పేరు ఏమిటో చెప్పడం జరిగింది. చూడండి. అవన్నీ ప్రాక్టీస్ చేసి, ఇక విరగదీయండి. 



Tuesday, November 13, 2012

దీపావళి శుభాకాంక్షలు

మీకూ, 
మీ కుటుంబ సభ్యులకూ,
మీ మిత్రులకీ, 
శ్రేయోభిలాషులకూ, 
మిగతా బ్లాగర్ లకీ - 
దీపావళి శుభాకాంక్షలు.. 

Happy Deepavali - On this auspicious festival of lights, May the glow of joys, Prosperity and Happiness your days in this year ahead.






















Related Posts with Thumbnails