ఈ ప్రపంచములో వ్యక్తులకీ, వృత్తులవారికీ, కళాకారులకీ ఎన్నో సంఘాలు, ఫోరమ్స్ ఉన్నాయి. మరి బ్లాగింగ్ చేసేవారికి? అలాంటివి ఉన్నాయా? లేవా?? అని ఆలోచిస్తున్నారా?..
లేకేం! భేషుగ్గా ఉంది. తెలుగు బ్లాగర్స్ (Telugu bloggers) గ్రూప్. ఇది గూగుల్ గ్రూప్స్ వారిలోని భాగము. క్రొత్తగా బ్లాగ్ మొదలెట్టినవారికి, బ్లాగ్ నడిపిస్తున్నవారికి - బ్లాగ్ నిర్వహణలో ఏమైనా సందేహాలు వస్తే - ఎవరిని అడగాలి? ఎలా అడగాలి..? ఎవరు తీర్చగలరు? అన్న ప్రశ్నకి సమాధానం ఇక్కడ దొరుకుతుంది. మీకు ఏమైనా సమాచారం కావాలన్నా, ఏదైనా బ్లాగ్ నిర్వహణా ఇబ్బందులు, సందేహాలు ఉంటే, ఇక్కడ ఉన్న సభ్యుల గ్రూప్ లో అడిగితే (పోస్ట్ చేస్తే), అందులో సభ్యుల వద్ద నుండి మీకు సమాధానాలు వస్తాయి.
చాలామంది పాత బ్లాగర్స్ కి ఈ విషయం తెలిసియున్నా, క్రొత్తగా బ్లాగింగ్ మొదలెడినవారికీ, తెలీనివారికీ తెలియచెప్పటానికే ఈ టపా.
ఈ గ్రూప్ లో మొదట్లో అనుకోకుండా ఏదో లింక్ పట్టుకొని, ఆ గ్రూప్ లో చేరాను. అప్పుడు ఆ గ్రూప్ లో 13,000+ సీరియల్ పోస్ట్ జరుగుతున్నది. (మనకి వచ్చే మెయిల్స్ కి ఆ సీరియల్ నంబర్ ఉంటుంది. ఏమైనా మెయిల్స్ అందకుంటే ఆ వరుస తప్పామా, లేదా అని అలా చెక్ చేసుకోవచ్చును.) ఈ గ్రూప్ అవసరమా అనుకున్నాను. కానీ చాలా ఉపయోగపడే గ్రూప్ తెలుసుకొని కొనసాగుతున్నాను. నేను అందులో అడిగిన సందేహాలకన్నా - నేను ఇచ్చిన జవాబులే ఎక్కువ. ఇలా చెప్పుకోవటం గొప్పగా ఫీలవటం లేదు. నాకు తోచినంతలో ఏదో ఉడుతాభక్తిగా బ్లాగర్స్ కి సేవ చేస్తున్నాను అని అనుకుంటున్నాను. అక్కడ ఎంతోమంది లబ్ధ ప్రతిష్టులూ మీ సందేహాలకి సమాధానాలు అందచేస్తారు.
గూగుల్ వారి గ్రూప్ అయిన ఇక్కడ మీకు ప్రస్తుతం 4825+ టాపిక్ / సందేహాల మీద సభ్యులు ఇచ్చిన సమాధానాలు ఇక్కడ లభిస్తాయి. మీరు ఇక్కడ సభ్యులయితే - మీ మెయిల్ ID కి మెయిల్స్ వస్తుంటాయి.
4 comments:
great job
Raj garu "telugu lo type cheyadam yela " chala use full information. mari dotcom lo posting ki lekhini ,barha kante manchi version yedaina vundaa? daya chesi thelupa galaru.
Raj garu "telugu lo type cheyadam yela " chala use full information. mari dotcom lo posting ki lekhini ,barha kante manchi version yedaina vundaa? daya chesi thelupa galaru.
ధన్యవాదములు KN మూర్తి గారూ.. లేఖిని, బరహ కూడా చాలా బాగా ఉంటాయి. తెలుగు టైపింగ్ చేయుటకి చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఎందులో సౌలభ్యం కనిపిస్తే - అది వాడుకుంటున్నారు. ఫలానా మంచిది, అది వాడంటూ అని ఏమీ చెప్పలేను. మీ సౌలభ్యం చూసుకొని వాడవలసినది.
Post a Comment