నిజమే కదూ!.. నాకైతే ఇది నిజమే అని అనుభవంలో తెలిసింది. ఒక్కోసారి ఏదో అహంకారాలకి లోనై, కొన్నింటిని వదిలేసుకుంటాం లేదా అంతగా పట్టించుకోము. అవి దూరమయ్యాక అప్పుడు వాటిని తిరిగి పొందాలనుకొని, తెగ తాపత్రయ పడతాం. ఇది వస్తువులకే కాదు, మనుష్యుల బంధాలు కూడా.
వస్తువులోనైతే చిన్నప్పటి నేస్తాలు ఇచ్చిన ఆటోగ్రాఫ్, నెమలీక, సగం వాడిన పెన్సిల్ ముక్క, వారి తాలూకు ఫొటోస్.. ఇలా చాంతాడంత లిస్టు ఉంటుంది. ఎప్పుడో గానీ మళ్ళీ చూసుకోం.. చూసుకోవాలనుకున్నప్పుడు పాడయిపోయి ఉంటాయి లేదా పోగొట్టుకుంటాము.
అలాగే మనుష్యులతో బంధాలు కూడా. గుండె గడిదాకా వచ్చిన మిత్రులని తీలీక దూరం చేసుకున్నాక, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారితో గల సాన్నిహిత్యం గుర్తుకువచ్చినప్పుడు మనస్సు చివుక్కుమంటుంది. ఎవరివైపుకి వారు గల కారణాలు సబబే అనిపిస్తాయి. మళ్ళీ దగ్గరవ్వాలని ఉంటుంది.. కానీ ఆ ప్రయత్నాలు ఏమీ చెయ్యం. మనసు ఇంకా ఒంటరి అవుతూ ఉంటుంది కూడా. ఒక మెట్టు దిగి ప్రయత్నాలు చేస్తుంటే ఖచ్చితముగా సఫలీకృతం అవుతాం.
దగ్గరగా ఉన్నప్పుడు వారు మనకి చేసే మేలు అసలు తెలుసుకోం.. ఉన్నవారిని దూరం చేసుకున్నాకనే - ఏదో ఒక లోటు కనిపిస్తుంది. అప్పుడే వారి దగ్గరి తనం ఏమిటో, అప్పుడు వారు తమ సామీప్యములో ఉంటే ఎంత బాగుంటుందో అప్పటికి గానీ అనుభవంలోకి రాదు.
2 comments:
Raj ..gaaru..very nice post.
baagaa cheppaaru. nijangaa nijam.
ధన్యవాదములు వనజ గారూ..
Post a Comment