Facebook లో ఇప్పుడు ఒక క్రొత్త అప్లికేషన్ జత చేశారు. మీరు మీ ఫేస్ బుక్ ప్రొఫైల్ లో మీరు పెట్టే ఫొటోస్ ని మీ మిత్రులు గానీ, ఇతరులు గానీ కాపీ చేసుకోకుండా, కనీసం స్క్రీన్ షాట్ ద్వారా కూడా కాపీ చేసుకో వీలులేకుండా చేసేందుకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుందని ఆ McAfee సంస్థ వారు చెబుతున్నారు. మీకు ఫేస్ బుక్ ప్రొఫైల్ గనుక ఉంటే - ఈ అప్లికేషన్ ని వాడి, మీరు అప్లోడ్ చేసే మీ ఫొటోస్ ని ఎవరూ కాపీ చేసుకోకుండా చూసుకోగలరు.
ఈ అప్లికేషన్ కేవలం - Internet Explorer 8 ఆ తరవాత బ్రోజర్ మరియు Mozilla Firefox నందు మాత్రమే పనిచేస్తుంది. కనుక మీరు ఆయా బ్రౌజర్స్ ని ఓపెన్ చేసి, అందులో ఈ అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన మరొక ముఖ్య అంశం - మీ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ - Windows 7 ఉండాలి. XP ఉన్నా ఏమీ కాదు కానీ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ ని అప్డేట్ వెర్షన్ (సర్వీస్ ప్యాక్ 3) ఉండాలి.
ముందుగా మీరు మీ ఫేస్ బుక్ అకౌంట్ ని పై రెండింటిలో ఏదైనా ఒక బ్రౌజర్ లో ఓపెన్ చెయ్యండి. ఇక్కడ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ ని ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నాను.
1. మీ ఫేస్ బుక్ అకౌంట్ ఒపేన్ చెయ్యండి.
2. సర్చ్ బార్ నందు Social Protection అని టైప్ చేసి, సర్చ్ నొక్కండి.
3. అందులో వచ్చే McAfee Social Protection ని ఎన్నుకోండి.
అప్పుడు ఇలా ఆ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు ఆ 4 వద్ద Download Now ని నొక్కాలి.
డౌన్లోడ్ అయ్యాక ఆ వచ్చే డైలాగ్ బాక్స్ లో Run 5 ని నొక్కి ఆ అప్లికేషన్ ప్రోగ్రాం ని రన్ చెయ్యాలి.
అలా ఓపెన్ అయ్యాక ఇప్పుడు 6 వద్ద నున్న Install ని నొక్కాలి.
ఇప్పుడు ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ అవుతుంది.
అప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు Agree వద్ద ఓకే చేసి, Next 7 నొక్కండి.
ఇప్పుడు ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ అవుతుంది.
ఇలా ఇన్స్టాల్ అయినట్లు విండో వస్తుంది.
ఇప్పుడు మీ బ్రౌజర్ మళ్ళీ ఓపెన్ చెయ్యండి. అంతే!
No comments:
Post a Comment