Wednesday, September 19, 2012

Blog new look

బ్లాగర్ స్వరూపం పూర్తిగా మారింది. ఎప్పటినుండో మారుస్తాము.. మారుస్తున్నాము అంటూ ప్రకటించిన బ్లాగర్ వారు ఈరోజు వినాయక చవితి మంచిరోజు అన్నట్లు, మంచిగా, విఘ్నాలన్నీ తొలగి, ఆటంకాలు రాకుండా, బ్లాగర్లకి ఉపయోగకముగా ఉండాలని.. బ్లాగర్ల అభిమానం చూరగొనాలని ఈరోజే ప్రవేశ పెట్టారులా ఉంది.

నిజానికి ఇలా మార్చి చాలా రోజులయ్యింది. నాకు తెలిసీ ఆరు నెలలకి పైగానే ఉండొచ్చు. కానీ అప్పుడు అది ఐచ్చికం (Optional) ఇప్పుడు మాత్రం తప్పనిసరి చేశారు. ఇలా మార్చడం కూడా మీ హోం పేజీ వరకే. మీ బ్లాగ్ టెంప్లేట్ గానీ, డిజైన్ గానీ, అందులోని విడ్జెట్స్ (Widgets) గానీ ఏమీ మార్చలేదు. కేవలం మీ హోం పేజీ మార్చారు. కనుక మీరు ఏమీ కోల్పోరు.

ఈ క్రొత్త హోం డిజైన్ ని చూస్తే - కొద్దిగా అలవాటు చేసుకోవాలి. పాత వాటిలో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. కాకపోతే ఒకేఒక ఇబ్బంది ఏమిటంటే - అవన్నీ ఎక్కడక్కడ ఏమి ఉన్నాయి, అందులో ఏమేమి ఉంటాయో, వాటిని నొక్కితే ఏమేమి టూల్స్ వస్తాయో.. అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతే! ఒకరకముగా చెప్పాలీ అంటే ఈ క్రొత్త డిజైన్ - పాత డిజైన్ కన్నా కాసింత ఉపయోగకరముగానే ఉంది కూడా. కాలం మారినట్లు మనమూ మారాలి కదా..

మన బ్లాగులకి ఈ క్రోత్త రూపు రావటానికి మీరేమీ చెయ్యాల్సిన అవసరం లేదు. ఆ బ్లాగర్ వారే మారుస్తారు. ఇలా చేస్తే - వారికేమి లాభం అంటే - చాలా సింపుల్. హోం పేజీలో ఉన్న డిజైన్ వల్ల మారి సర్వర్ లలో కాసింత జాగా Space మిగులుతుంది. అది కాసింత KB లలో ఉన్నా, అన్ని బ్లాగుల్నీ కలిపితే GB లలోకి మారుతుంది.

మరోవిషయం ఏమిటంటే - ఇప్పుడు బ్లాగులు మొబైల్స్ లలో, టాబ్ లలో ఓపెన్ చేసి, బ్లాగులని నిర్వహించేవారికి ఇది చాలా ఉపయోగకరముగా ఉంటుంది. ఇప్పుడు తక్కువగా ఉన్న ఈ వాడకం రాను రానూ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు నా బ్లాగ్ 1% లోపలే అలా ట్యాబ్స్, మొబైల్స్ లలో చూస్తున్నట్లు గణాంకాలు Statistics చెబుతున్నాయి. ఇంగ్లీష్ మాధ్యమం ఉన్న బ్లాగుల్లో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది కూడా. మొబైల్స్ లలో, ట్యాబు లలో తెలుగు భాష కనిపించేలా మార్పులు కంపనీ వాళ్ళు ముందే ఇన్స్టాల్ చేసి ఇవ్వటం లేదు. ఎవరికీ వారు అలా మార్చుకొని వాడుకుంటున్నారు. ఇలా మార్చటం అనేది ఆయా మొబైల్స్ కంపనీ వారు, ట్యాబ్ కంపనీ వారు ముందే ప్రీ లోడెడ్ గా చేసిస్తే, అప్పుడు ఈ బ్లాగ్ హోం పేజీ మార్పులు చాలామందికి అనుభవములోకి  వస్తుంది.

ఇదిగో నా బ్లాగ్ హోం పేజీ మారిన తీరు. (ఇందులోని వివరాలు అన్నీ అందరికీ తెలిసినవే)


Related Posts with Thumbnails