Saturday, September 15, 2012

మీ మెయిల్ బాక్స్ లో స్టార్ Star గుర్తులు

జిమెయిల్ లో ఒక క్రొత్త సౌకర్యాన్ని కలిపించారు. మనకి వచ్చిన మెయిల్స్ లలో ఏది ముఖ్యమైనదో తేలికగా గుర్తుపెట్టుకోవటానికి స్టార్ Star గుర్తులని ఇచ్చారు. మనకి వచ్చిన మెయిల్స్ ప్రక్కన ఒక నలుచదరపు గడి, దాని ప్రక్కన స్టార్ గుర్తు ఉంటుంది. ఈ స్టార్ గుర్తుని వెంటవెంటనే నొక్కుతూ పోతూ గనుక ఉంటే, వివిధ రంగుల్లో స్టార్ గుర్తులు వస్తాయి. 

తెలుపు రంగు తార నుండి ఆకుపచ్చరంగు తార గుర్తులు మరియు ఇంకొన్ని గుర్తులు వస్తాయి. ఇవి వాడి మన మెయిల్ బాక్స్ లలోని ఏయే మెయిల్స్ ప్రాధాన్యతవో, వాటికి ఆ రంగుల స్టార్స్ పెడుతూ తేలికగా మీ మెయిల్స్ ని వెదుకోవచ్చును. 


No comments:

Related Posts with Thumbnails