Monday, January 16, 2012

మానసిక వికలాంగుల సేవలో

మొన్న నా ఆన్లైన్ మిత్రులు ఒక ఈవెంట్ పెట్టాం అని చెప్పారు. వివరాలు చెప్పారు. ఒక మానసిక వికలాంగుల ఆశ్రమములో అన్నదాన కార్యక్రమం ఈ ఆదివారం రోజున మధ్యాహ్నం పెట్టాం అని చెప్పారు. సరే! వస్తాను అని చెప్పాను.

ఈ ఆన్ లైన్ మిత్రులందరూ నాకు ఒక సోషల్ సైట్లో పరిచయం. అందులో ఒక కమ్యూనిటీ ఓపెన్ చేశారు. మొదటి ఈవెంట్ చేశారు. చాలా బాగా చేశారు. ఒక అనాధ బాలల కేంద్రానికి వెళ్ళి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కొంతమంది వికలాంగులకి దగ్గరుండి తినిపించారు కూడా. అప్పుడు చాలా మంది విచ్చేశారు. కానీ నేనే ఒక పెళ్ళికి వెళ్ళాల్సివచ్చినందువల్ల పోలేకపోయాను. అప్పటి కార్యక్రమాల విశేషాలు చూశాక, నేను మిస్ అయ్యాను అనుకున్నాను. ఈసారి మిస్ అవద్దోని అనుకొన్నాను. అలాని డిసైడ్ అయ్యాను కూడా.

ఇక ఈ కమ్యూనిటీ గురించి చెప్పాలీ అంటే - ఫండ్స్ అన్నీ ఎవరి జేబుల్లోనుండి వారు వేసుకోవాల్సిందే. అంటే పాకెట్ మనీ అన్నమాట. నెలకో యాభై రూపాయలు ఇవ్వండి వారి నినాదం. (నెలకు INR50 * 12 నెలలు =  INR600 అవుతుంది. అలా వంద మంది అనుకుంటే INR600 * 100 = INR60,000 అవుతుంది. కానీ వాస్తవముగా అంత నిధులు సమకూరలేదు. పావు కూడా కాలేదు.) దాదాపు అందరూ గ్రాడ్యుయేట్ దాటిన వారే!. MBA, M Tech. చేస్తున్నవారే. ఇంకా స్టూడెంట్స్ అన్నమాట. ఆ కమ్యూనిటీలో చాలామంది (360+) ఉన్నా, చందాల విషయం లో తోచినంత ఇవ్వోచ్చును.. లేదా వచ్చి సేవ చేయ్యచ్చును. బలవంతం, ఇబ్బంది అంటూ ఏమీ లేదు.

ఆ రోజు వచ్చేసింది. నేను బయలుదేరాను. నిజానికి ఇలాంటివాటికి నేను ఒక్కసారి వెళ్ళలేదు. గుప్తముగా సేవ చేస్తూ వన్ మ్యాన్ ఆర్మీ లా చేసుకుంటూ వెళ్లాను కానీ ఇలా గుంపుగా చెయ్యలేదు. నా లైఫ్ లో ఈ అధ్యాయపు రుచిని ఎందుకు మిస్ చేసుకోవాలి.. అనిపించింది. ఒకసారి వెళితేనే కదా తెలిసేది.. అనుకున్నాను.

వారు చెప్పిన అడ్రస్ కి ఒంటరిగా వెళ్లాను.. దారి అంతా క్రొత్త. ఎప్పుడూ వెళ్ళని చోటు. పికప్ కోసం అడుగుదామని అనుకున్నా.. కానీ కాసింత కష్టపడి, ఆ మధురిమ ఏమిటో చవి చూడాలని అనుకున్నాను. అలా దారి తెలుసుకుంటూ గమ్యం దగ్గరి వరకూ నడకని ఆశ్రయించాను. అప్పటికే దాదాపు సగం దూరం నడిచాను. ఇక దాదాపు నిర్మానుష్య స్థలానికి చేరుకున్నాను. ఎందుకైనా మంచిది అని నా ఆన్లైన్ మితృలకి ఫోన్ చేస్తే - కాసేపట్లో వచ్చి, పికప్ చేసుకున్నారు. అలా వారి వెంట ఆ అనాధ ఆశ్రమం కి వెళ్ళాను.

అక్కడికి వెళ్ళాక, వారితో చర్చలు జరిగాయి. అందులో ఇరవై వరకూ మానసిక వికలాంగులు అయిన అనాధలు ఉన్నారు. "వారికి అన్నదానం చేస్తామని.." వీరు అంటే - "ఆ సోర్సెస్ మాకు ఉన్నాయండి.. ఎలుకలు వల్ల బట్టలు పాడవుతున్నాయి. మీరు ఒక కప్ బోర్డ్ ఇప్పిస్తే బాగుంటుంది.." అంటే - ఇదేదో బాగుంది. లైఫ్ లాంగ్ ఉంటుంది కదా, ఇచ్చినదానికీ చాలా రోజులు ఉపయోగం లోకి వస్తుంది. అలా కమ్యూనిటీ పేరు కలకాలం ఉంటుంది అని దీనికి ఓకే అన్నారు.

మొదటి ఈవెంట్ కి అయిన ఖర్చు పోగా ఇంకా INR8,500 ఉన్నాయంట. అందులోంచి చేద్దాం అని నిర్ణయించారు. సరే అని స్టీల్ వార్డ్ రోబ్ అమ్మే షాప్ కి వెళ్ళేసి, కాసింత హెవీ గేజ్ బీరువా ఖరీదు చేశారు. మొదట INR4,800 అని చెప్పిన ఆ షాప్ అతను, అనాధ ఆశ్రమం కి అనేసరికి - INR3,800 కి ఇచ్చాడు. అది రిక్షా ద్వారా ఆ అనాధ ఆశ్రమం కి తెచ్చేశాం. ఆ స్టీల్ వార్డ్ రోబ్ ని ఆ ఆశ్రమం వారికి అందజేశారు. ఆ తరవాత ఆ వికలాంగులకి చిన్నగా ట్రీట్ మెంట్ వారికి అరటి గెల ఇప్పించారు. ఆ తరవాత మేమూ బయట చిన్నగా ట్రీట్ చేసుకొని, వచ్చేశాం.

నిజానికి ఇలా ఒక సంస్థ తరపున నేను పాల్గోవటం చాలా క్రొత్తగా ఉంది. ఇదొక సరి క్రొత్త అనుభూతి. గుంపుగా / ఒక సంఘం లా ఏర్పడి చేస్తే, ఒత్తిడీ, శ్రమ, ఆర్ధిక ఇబ్బందీ తగ్గుతాయి. చాలా ఈజీగా శ్రమ లేకుండా ఈజీగా చేయవచ్చును. నేను వీరు మొదట చేసిన ఈవెంట్ కి వెళ్ళలేకపోయాను. కనుక ఈసారి వెళ్లాను. కాసింత సమాచార లోపం వల్ల ఎక్కువ సభ్యులు పాల్గోనలేకపోయినా, ఉన్నంతలో చాలా బాగా జరిగింది. కేవలం పాకెట్ మనీ లతో ఇతరులకు సాయం చెయ్యటం నాకు చాలా బాగా నచ్చేసింది. ఒకరికి సహాయం చేశాం అన్న తృప్తితో ఇళ్ళకి చేరాం..

నేను వీరు ఎలా ఈవెంట్ చేస్తారు అని చూడటానికే సరిపోయింది. కేమరామన్ అవతారం ఎత్తాను. చాలా ఫొటోస్ తీశాను. కొన్ని నైతిక కారణాల వలన ఎక్కువ ఫొటోస్ షేర్ చెయ్యలేకపోతున్నాను.. ఏమీ అనుకోవద్దు. My photography 8  మరియు My Photography - 9 లలోని ఫొటోస్ కూడా అక్కడే తీసినవి..

ఆశ్రమ బోర్డు.

ఇదే ఆ ఆశ్రమం.

ఆశ్రమం వారి పశు సంపద.

ఒక మానసిక వికలాంగురాలు 

ఇచ్చిన స్టీల్ వార్డ్ రోబ్.

మా కోసం అనీ, మెంబర్స్ కి కనీస ట్రీట్ మెంట్ ఇవ్వటానికి ఇందులోంచి కొన్ని తీసుకున్నాము. 

ఇవి ఆ మానసిక వికలాంగులకోసం. 

ఆశ్రమం వారి బాతు.

మేము ఇచ్చిన స్టాల్ వార్డ్ రోబ్ 

ఆ ఆశ్రమం లోని నీటి హౌస్ లో గణేష్ మూర్తి, తామర ఆకులు. 

ఆ ఆశ్రమం లోని నీటి హౌస్ లో గణేష్ మూర్తి, తామర ఆకులు. 

ఇప్పుడు వీడియో కూడా చూడండి. ఈ వీడియో లోని వారి మోహం కనిపించకుండా చేసే నైపుణ్యం నాకు ఇంకా రాలేదు. కనుక చెయ్యలేకపోయాను. అప్పటికీ పెద్ద వీడియో నుండి కట్ చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో లోని ఆమె ప్రార్థనా గీతం పాడింది. ఆమెది బీహార్ అంట. 



9 comments:

voleti said...

If you don't mind, please inform the details of that ASRAMA" (Address)..
Any way you done very good job..Keep it up..

voleti said...

If you don't mind, please inform the details of that ASRAMA" (Address)..
Any way you done very good job..Keep it up..

Anonymous said...

మీలా పదిమంది ఆ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఈ వ్యాసం మీరు రాసివుంటే మీరు సఫలం కానట్టే. ఎందుకంటే ఫోటోలు ప్రచురించకపోవడం అర్థం చేసుకోవచ్చు, ఆ ఆశ్రమ వివరాలు గోప్యంగా వుంచడంలో వుద్దేశ్యం అర్థం కాలేదు. మంచిపని చేశారు.

David said...

u done a good job....can u give your community address or blog...can i join ..

Raj said...

కృతజ్ఞతలండీ..

andhrapradeshstudentfederation said...

VERY NICE ANDI GREAT JOB...MEERU ADARSAM ANDARIKI

Raj said...

మీ కామెంట్ కి ధన్యవాదములు.. నేను ఆదర్శముగా ఉండాల్సినంతగా పని ఇంకా చెయ్యలేదు అని అనుకుంటున్నాను.

nikhi said...



కృతజ్ఞతలండీ..మీరు మంచిపని చేశారు
మీలా పదిమంది ఆ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఈ వ్యాసం మీరు రాసివుంటే మీరు సఫలం
VERY NICE ANDI GREAT JOB...MEERU ADARSAM ANDARIKI avuthaaru.
Nenu maa voorlo MR People ku sambandhinchi oka organisation pette panilone vunnaanu.
meeku thelisina samaacharam pampaNDI. MEE SUCHANALU TAPPAKA AACHARANALO PETTUTHAANU......

SATYANARAYANA YADAV g


E-mail;shnr2009@gmail.com

Raj said...

Naa daggara paina post lo cheppina daanikannaa inkaa emee ledandee..

Related Posts with Thumbnails