Thursday, January 12, 2012

కలర్ ల్యాబ్ - ఫోటో ఎడిటింగ్

మొన్న ఫొటోస్ పని మీద ఒక కలర్ ల్యాబ్ కి వెళ్లాను. అక్కడ ఒక అబ్బాయి సిస్టం మీద ఫొటోస్ ని ఎడిట్ చేసి, ఎన్ని కాపీలు కావాలో అన్ని, ఎడిట్ చేసి ప్రింటింగ్ చేస్తున్నాడు. అది ఓకే.. కాని అతను చేసే విధానమే నాకు నచ్చలేదు. ఇప్పుడు ఈ టపా ఆ విషయం మీద వ్రాస్తున్నాను.

అతను వాడేది విండోస్ XP ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ వాడి, LCD ఎక్స్ ట్రా వైడ్ మానిటర్ మీద వర్క్ చేస్తున్నాడు. నిజానికి ఆ మానిటర్ ఆ ఫోటోగ్రఫీ వారికి, డెస్క్టాప్ పబ్లిషింగ్ వారికీ చాలా ఉపయోగకరం. మానిటర్ మీద రెండు పనులు చేసుకుంటూ మాటిమాటికి టాస్క్ బార్ మీద ఆధారపడకుండా తేలికగా వాడుకోవచ్చును. ఆ అబ్బాయి అలా కాకుండా చాలా కష్టపడుతూ, మాటిమాటికీ టాస్క్ బార్ మీద ఓపెన్ చేసినవాటిని, మళ్ళీ ఓపెన్ చేసుకుంటూ పని చేస్తున్నాడు. అతను చేస్తున్న పనుల్లో కొన్ని పొరబాట్లు మీకు ఇప్పుడు చెబుతాను. నేను ఎదుటివాటి తప్పులు చెప్పటానికి ఈ పోస్ట్ వ్రాయటం లేదు.. జస్ట్ ఈ క్రింది సూచనలు వాడి, ఇంకా బాగా తన పనిని, తక్కువ కాలములో చేసుకోవచ్చును అని చెప్పటం. 

1. అతను వాడేది LCD మానిటర్ అయినా మానిటర్ ని తనకి అనుకూలముమైన కోణములో పెట్టలేదు. 

2. క్రొత్తగా ఓపెన్ చేసిన పేజీ ప్రతిదీ ఆ పేజీ మాక్జిమం లో - అంటే ఆ మానిటర్ నిండుగా ఓపెన్ అవుతున్నది. అన్నీ మినిమైజ్ లో ఓపెన్ అవుతే, ఆ స్క్రీన్ మీద ఈజీగా ఇంకొకటి కూడా చూసుకోవచ్చును. 

3. ఓపెన్ చేసిన ఫొటోస్ అన్నీ బాగా స్ట్రెచ్ అయి వస్తున్నాయి. అలా కొద్దిగా ఎక్కువ సమయం అవుతున్నది. వెనక ఉండి చూసేవారికీ ఆ ఫోటో ఎలా ప్రింట్ అయ్యి వస్తుందో తెలీకుండా ఉండే అంతగా స్ట్రెచ్ గా కనిపిస్తున్నది. 

No comments:

Related Posts with Thumbnails