తులసీకోట, ఇంటికి ఉన్న ఏకైక గడపలకి రంగులు వేశాక ఇంకొద్దిగా రంగులూ, లప్పం మిగిలాయి. ఏమి చెయ్యాలో తెలీలేదు. అవి ఆలాగే ఉంచేస్తే ఎలాగూ పాడవుతాయి. వాటికి స్థలం కేటాయించాలి. ఇక వాటిని ముట్టేది ఎప్పుడో, వాటిని వాడేది ఎప్పుడో - ఇక మనకి తీరిక ఎప్పుడో.. ఇక లాభం లేదని, దేనికైనా వెతికి వెయ్యాలీ ఆని ఆలోచిస్తే - ఒక స్టాండ్ కనిపించింది. ఇంకా పెద్ద వాటికి వేయ్యొచ్చును కానీ సరిపోకుంటే - మళ్ళీ కొనాలి, అవి మిగిలితే కథ మళ్ళీ మొదటికి వస్తుంది.
ఇక ఆ స్టాండ్ కి లప్పం వేశాను. పాతగా తుప్పు పట్టి ఉన్న ఆ స్టాండ్ ని మిగిలిన ఎమేరీ పేపర్ తో బాగా రుద్దాను. అప్పుడు పైన ఉన్న తుప్పు, ప్లాస్టిక్ పేపర్లూ వదిలిపోయాయి. ఆ తరవాత బాగా తుడిచేసి, లప్పం పూసాను. అది ఆరాక ఎమేరీ పేపర్ ని నీటిలో ముంచేసి, తీసి రుద్దుతూ నునుపు చేశాను. అలా కాసింత బాగా చేసి, అప్పుడు బేస్ కోటింగ్ చేశాను. అలా రెండు సార్లు బేస్ కోటింగ్, అయ్యాక, ఎర్రని రంగుని ఆ పైపులకి రెండు కోటింగులు గా వేశాను. ఇప్పుడు ఆ స్టాండ్ బాగా క్రొత్తదానిలా, ఇంకొద్ది సంవత్సరాలు మన్నిక వచ్చేలా తయారయ్యింది. పై ఫోటోలో అక్కడక్కడా తెల్లగా మెరిసేది పెయింట్ తాలూకు మెరుపు.
ఈ స్టాండ్ మీద వేసిన ఎర్ర రంగు మీద డిజైన్స్ వేస్తే చాలా బాగుంటుంది అన్న ఆలోచన వచ్చినా, అది ఒక మూలాన ఉంటుంది అనే ఫీలింగ్ వల్ల ఏమీ డిజైన్స్ వెయ్యలేదు.
ఈ స్టాండ్ మీద వేసిన ఎర్ర రంగు మీద డిజైన్స్ వేస్తే చాలా బాగుంటుంది అన్న ఆలోచన వచ్చినా, అది ఒక మూలాన ఉంటుంది అనే ఫీలింగ్ వల్ల ఏమీ డిజైన్స్ వెయ్యలేదు.
ఈ పని అయ్యాక సగం రంగులూ, ఎమేరీ పేపర్, లప్పం పూర్తిగా అయిపోయాయి. హమ్మయ్య!. ఇక కొద్ది నెలల వరకూ ఇక ఏమీ పెయింట్ పని పెట్టుకోకుండా అయ్యాను.
No comments:
Post a Comment