ఈమధ్య నాకు జరిగిన సరిక్రొత్త అనుభవం.
ఒక సోషల్ సైట్లో నాకు కొందరు ఆడ్ రిక్వెస్ట్ పెట్టారు. వారందరూ అబ్బాయిలే.. వారు అందరూ వారి వారి ఫొటోస్ డీపీ లు గా ( DP = Display Picture ) పెట్టుకొని, ఉన్నవారే. ఒకరి వయసు ఇరవై ఐదు లోపలే ఉంటుంది.. మిగతా అందరి వయస్సు ముప్ఫై మీదే ఉండొచ్చును. వారి వారి డీపీలు చూస్తే అలాగే అనిపిస్తుంది.. వారి డిటైల్స్ చూశాను. ఓకే.. వారిలో ముగ్గురువి భారతదేశములో వేరే రాష్ట్రాలు. అందరూ ఒక్కసారిగా ఆడ్ రిక్వెస్ట్ పెట్టారని కాదు.. కాస్త గ్యాప్ ఉంది లెండి.
వీరి డిటైల్స్ చూసే ఆడ్ చేశాను. వారి ప్రోఫైల్స్, లోపల వారు పోస్ట్స్ వ్రాసే పద్ధతులూ.. వారి వారి ఫొటోస్.. అన్నీచూశాకే ఆడ్ చేసుకున్నాను.
వీరందరిలో కామన్ విషయం ఏమిటంటే - వారి వారి ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నవారు అందరూ మొగవారే.. అమ్మాయిలు చాలా అరుదు. వారి డిటైల్స్ కూడా ఏమీ లేవు. వారి డీపీ కూడా సినిమా తారలవే!. అవీ అబ్బాయిలవే కావచ్చును కూడా. ఇంతగా అందరూ అబ్బాయిలనే ఆడ్ చేసుకున్నారు.. అమ్మాయిలు అంటే వీరికి పడదేమో అని అనుకున్నాను. ఈ అబ్బాయిల డీపీలు వారివారివే ఉన్నాయి కూడా. మరీ రంధ్రాన్వేషణ చెయ్యలేదు. మీద మీద చూసేసి, అలా నమ్మకముతో వారిని నా స్నేహితుల గుంపులో చేర్చుకున్నాను.
కొద్దిరోజుల వరకూ మామూలు ముచ్చట్లు జరిగాయి. రెగ్యులర్ గా మాటలు నడిచాయి. ఓకే.. ఆ తరవాత ఒకతను నాకు కాల్ చేశాడు. తనని తాను పరిచయం చేసుకున్నాడు. నెమ్మదిగా, బాగా సమయం తీసుకుంటూ ఆలోచించి మాట్లాడుతున్నాడు. కొద్దిసేపు ఇలాగే మాట్లాడి, ఏదో అడగాలి అన్నట్లుగా ఉన్నాడు. ఏమి అడుగుతాడబ్బా!.. అనుకుంటూ ఎదురుచూశాను. ఒక పావుగంట మాట్లాడాక అప్పుడు అడిగాడు..
చాలా నెమ్మదిగా మాట్లాడుతున్న తను, కాస్త బెరకుగా అడిగాడు.. " వాట్ ఈజ్ ఒపీనియన్ ఆన్ _క్స్. " అనీ. నేను షాక్ అయ్యాను. విన్నది కరెక్టేనా అనుకున్నాను. మళ్ళీ ఏమిటన్నట్లు అడిగాను.. ఈసారి కాస్త ఒక్కో పదాన్ని ఒత్తిపట్టి మాట్లాడాడు. ఒక్కసారిగా చిన్న వణుకు.. ఏమిటీ.. పరిచయం అయ్యి కొద్ది రోజులూ కాలేదు.. ఇలా అంటున్నాడు ఏమిటీ అని షాక్.
ఇక ఇలా కాదు. నేను విన్నది సరిగా అదేనా? లేక వేరే ఏదైనా చెప్పబోతూ తప్పుగా చెప్పాడా అని - ఎక్స్క్యూజ్ చెప్పేసి.. నాకు వినిపించటం లేదు అని చెప్పాను.. కాసింత సిగ్నలింగ్ ప్రాబ్లం అన్నాను. మూడోసారి కాస్త విడమరిచి చెప్పాడు.. "ఆర్ యూ ఇంట్రెస్టేడ్ ఇన్ _క్స్ విత్ మ్యాన్ టు మ్యాన్..". అప్పుడు కానీ నా చెవుల్లో మరిగే సీసం పోసినట్లు అనిపించింది. నాకు చెవుడు ఎందుకురాలేదా అని అనిపించింది.
కాస్త గ్యాప్ ఇచ్చాను.. నాకు ఒక పని ఉంది అని చెప్పేసి, ఆఫ్ చేశాను. ఆ తరవాత అతన్ని నా లిస్టు నుండి తీసేశాను. మా ఇద్దరి మధ్య మ్యూచువల్ గా ఉన్న అతన్ని చాట్ లో అడిగా.. అతనేమిటీ?.. ఇలా అన్నాడు.. అనీ. అతను "నన్నూ అడిగారు.. దానికి మీరేం అన్నారు.." అని ఎదురుప్రశ్న. " నేనేమీ అనలేదు.. మీరేం చెప్పార.."నీ అడిగా. " నేను ఒప్పుకున్నాను.." అన్నాడు అతను. వార్నీ! దొందూ దొందేనా.. ఇక ఆలస్యం చెయ్యలేదు.. అతన్నీ నా ఫ్రెండ్స్ లిస్టు నుండి తీసేశా..
అలాంటివారు ఇంకెవరైనా ఉన్నారా అని వెదికితే - వీరికి మ్యూచువల్ గా కొందరున్నారు. వారికీ మొదట్లో చెప్పినట్లుగా అంతా మొగస్నేహితులే.. (ఇలా ఉన్నవారందరూ అలాంటివారు కాకపోవచ్చును కూడా. ఇలా వారి అకౌంట్స్ లలో కామన్ గా అలా కనిపించింది.) వారినీ తీసేశాను.. మొత్తం లెక్కపెడితే ఆరుగురు.. వామ్మో!..
అందులో ఒకరిని ఒకసారి ఒక మార్కెట్లో కలిశాను.. కలిశాను అంటే - "ఆ కలిశాను" కాదండోయ్.. మీరు అందాక వెళ్ళి, ఏదేదో ఊహించేసుకోకండి. జస్ట్ అలా.. అంతే! ఆ అబ్బాయి - పాతిక లోపే ఉంటాడు. బక్కగా, పీలగా ఉన్నాడు. నేట్టేస్తే పడిపోయేలా ఉన్నాడు. తనని చూసినప్పుడు ఏదో తెలీని అనుమానం, నాకు ఫ్రెండ్ గా కాదు.. నా లిస్టు లో ఉంచుకోదగ్గ వ్యక్తి కానే కాదు అని నా సిక్స్త్ సెన్స్ చెప్పింది కూడా..
కాసేపు మాట్లాడాక.. అతని మాటలు వేరేగా ఉన్నాయి. అప్పట్లో ఆ మాటలకి అర్థం తెలీదు. ఎలా మాట్లాడాలో తెలీక అలా అన్నాడేమో అనుకున్నాను.. మా ఇద్దరిమధ్య మాటలు మీరే వినండి / చదవండి..
" మీతో కాస్త మాట్లాడాలి.. మా రూం కి వెళదాం.." అన్నాడు అతను.
" రూం కా? ఇప్పుడా..? ఏం ఎందుకూ.. " అన్నాను నేను.
" కాసింత ప్రైవేట్ గా మాట్లాడాలి. ఆ రూం లో మీరూ, నేనూ తప్ప ఎవరూ ఉండరు.. అమ్మా, చెల్లీ క్రిందనే ఉంటారు.."
" అవునా.. సారీ..! కాదు బాస్!. అయినా నేను కాసేపట్లో ఊరికి వెళ్ళాలి.. వీలు కాదు. " అన్నాను.
" ఈరోజు ఇక్కడే ఉండి, రేపు మార్నింగ్ వెలుదురు గానీ.. రేపు మార్నింగ్ పంపిస్తాను మిమ్మల్ని." అన్నాడు.
" అంతగా ఉండి, మాట్లాడేది ఏముంది బాస్!. ఏదైనా ఉంటే ఇక్కడే ఈ మార్కెట్ లోనే ఇలాగే నిలబడి మాట్లాడుకుందామ్.. కావాలంటే ఒక గంట సమయం కేటాయిస్తాను.. " అన్నాను.
దానికి అతను ఒప్పుకోలేదు. " ఈరోజు నీవు రాత్రికి నాతో ఉండాల్సిందే.. నీతో నేను మాట్లాదాల్సిందే.. "
" అరె! ఏమి మాట్లాడుతావు.. అదేదో ఇక్కడే నాతో మాట్లాడవచ్చును కదా.. నాకు సమయం లేదు. చెప్పు ఇక్కడే.." అన్నాను.
తను వింటేనా?. రూం కి రావాల్సిందే అని తెగ ఒత్తిడి. ఎందుకూ అంటే చాలా మాట్లాడాలి అంటాడు. మెల్లమెల్లగా ఆ మాటల్లో వేరే అనుమానం కనిపించసాగింది. అది నిజమా కాదా అని తేల్చుకోవటానికి సిద్ధపడ్డాను. కాసేపు ఆగితే - ఆ విషయం తెలుస్తుంది. అప్పుడు అతనికి దూరం జరగొచ్చును. లేకుంటే అనుమానం వల్ల ఒకతన్ని దూరం చేసుకున్నవాడినే అవుతాను. కాసేపట్లో ఆ విషయం ఏమిటో తెల్చేసుకోవాలని డిసైడ్ అయ్యాను.
అతన్ని ఆ విషయమై బాగా రెట్టించాను. కానీ అతను మాత్రం నీవు రావాల్సిందే.. నీతో చాలా విషయాలు పర్సనల్ గా మాట్లాడాలి.. అంటాడు. మనీ విషయాలా? అంటే కాదు అంటాడు.. " మరి.. ఇంకా " అని అంటే - ఏమీ చెప్పడు. పోనీ డైరెక్ట్ గా ఇలా.. దీనికోసమా అని అడగానిపిస్తుంది. అలాని కాకపోతే నేనే హర్ట్ చేసినవాడిని అయ్యి, చెడుగా నా మీద ఇంప్రెషన్ తెచ్చేసుకొని, లోకువ అవుతానేమో అనిపించి ఆగాను.
అప్పటికే ముప్పావు గంట అయ్యింది. ఏదీ చెప్పడు తను. ఎన్నిసార్లు అడిగినా ఒకటే మాట. " మా ఇంటికి వచ్చి, నా రూం లో ఈ రాత్రి ఉండు. చికెన్ బిర్యానీ పెడతా, నీతో నా పర్సనల్స్ చెప్పుకోవాలి.. నీ సమాధానం కావాలి.. రేపు మార్నింగ్ పంపిస్తాను.నా రూం లోకి ఎవరూ రారు.. " - ఇవే మాటలు.. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా అవే మాటలు. ఇక్కడే చెప్పు అంటే కుదరదు అంట..
మాటల్లో అర్థం అదే కనిపిస్తున్నది.. కాదేమో అనవసరముగా అనుమానం పడుతున్నానేమో అని ఇంకోవైపు సందేహం. పోనీ ఆ రూం కి వెళితే - నా అనుమానం నిజమై - నా శీలం పోతే - ఏడవాల్సి వస్తుందో అని భయం. అతను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడు. నాకే విసుగు వచ్చేసి, ఒప్పుకోనేలా టెంప్ట్ చేస్తున్నాడు అనిపించింది.
ఇక లాభం లేదు. "లాస్ట్ అండ్ ఫైనల్ గా ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను. అక్కడికి వస్తే ఏమేమి నీ పర్సనల్స్ చేబుతావో ఇక్కడే అజెండాలా చెప్పు. అక్కడ డిటైల్డ్ గా మాట్లాడుకుందాం.." అని ప్రపోజల్ పెట్టాను. అయినా అదే రికార్డ్. అవే మాటలు. ఎటూ తేలలేదు. ఇక ఈ "ఫిఫ్టీ - ఫిఫ్టీ" నాకెందుకు అని గుడ్ బై చెప్పేసి, వచ్చేశాను. (అలా నా శీలం దక్కించుకున్నాను ఏమో! ఆహ హ్హా హా అ..) అతన్నీ తీసేశాను. అలా ఏడుగురిని తీసేశాను.
ఇవన్నీ చెప్పటం నా ఇమేజ్ కి బాగుండదు కానీ, ఇలా మీకు ఒకవేళ జరగబోతే - కాస్త ఆ పరిస్థితిని ఎదురుకోవటానికి ఒక పాఠoలా ఉంటుందని చెప్పటం అంతే!..
కాస్త ఆలోచిస్తే - కొందరి కన్నా వీరు గొప్పోళ్ళే.. వీరు మామూలుగా ఆడ్ అయినా ఏమీ ఇబ్బంది పెట్టలేదు. అలాని అడిగారు. కాదని నో చెప్పినా ఆ తరవాత పదే పదే ఆడ్ రిక్వెస్ట్స్ పెట్టి ఇబ్బందుల పాలు చెయ్యలేదు. ఏదేదో చెత్తగా వాగలేదు. నిర్భయముగా వారివారి ఫొటోస్ డీపీ లుగా పెట్టుకున్నారు.. (అవి వారి నిజమైన ఫొటోస్ అంటే - ఏమో.. నాకైతే తెలీదు.) కాకపోతే - ఒకటి మరిచారు. ఆ సోషల్ సైట్లో - ఫ్రెండ్ షిప్ విత్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో అలా హోమో_________ ఎన్నుకొని ఉంటే మరీ బాగుండేది. మొదట్లోనే చూసి, రిజెక్ట్ చేసేవాడిని.
ఆ ఒక్క పొరబాటు తప్ప కొద్దిమంది కన్నా గొప్పవారే!. ఆ కొద్దిమంది ఎలా ఉంటారు అంటే - ఏదేదో చెప్పేసి, అవతలివారిని ఇబ్బంది పెట్టడం, అబద్ధాలు చెప్పటం, డీపీ పెట్టకుండా, డిటైల్స్ పెట్టకుండా ఏదేదో వాగటం.. ఒకరిని హేళన చెయ్యటం, నానారకాలుగా ఇబ్బంది పెట్టడం.. కారుకూతలు కూసి, నానా బూతులు వ్రాసేవారి కన్నా వీరు చాల నయం. వచ్చారు.. అడిగారు.. కాదు అని అంటే వెళ్ళిపోయారు. ఏమీ ఇబ్బంది పెట్టలేదు..
3 comments:
మీ అనుభవం బాగుంది. :)
ఆన్లైన్ స్నేహాలుంటే అన్నీ మంచి స్నేహాలే ఎదురవ్వవు.. ఇలాంటివి కూడా ఎదురవుతాయి.. అని ఈ పోస్ట్ లో చెప్పాను.
ఆన్ లైన్ స్నేహితుల విషయం లో మనం చాల జాగ్రత్తగా ఉండలి. మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం.
Post a Comment