మా ఇంటి తులసి కోట పూర్తి చేశాను కదా.. ఇక పేపర్ స్టెన్సిల్స్, రంగులూ, చమ్కీ పౌడర్ మిగిలాయి. వాటిని అలాగే ఉంచేద్దామని అంటే - సమీప కాలములో రంగులు వేసే కార్యక్రమం ఏమీ లేదు. వాటిని అలాగే ఉంచేస్తే పాడవుతాయి లేదా ఎక్కడో పడిపోతాయి. వాటిని అలా వృధా చెయ్యబుద్ధి కాక మా ఇంటి గడపకి వేసేద్దామని నిర్ణయించుకొని, మొదలెట్టాను.
ముందుగా పసుపురంగు పెయింట్ పూశాను. నిజానికి ఆ రంగు పూర్తిగా సరిపోలేదు. అయినా అడ్జస్ట్ చేసి పూశాను. ఆ తరవాత ఆ తులసి కోటకి వాడిన పేపర్ స్టెన్సిల్స్, రంగులు, చమ్కీ పౌడర్ వాడాను. నిజానికి ఇంకా బాగా వేయ్యొచ్చును. ఈ చమ్కీ పౌడర్ వాడి అలా డిజైన్స్ చెయ్యటం కాసింత థ్రిల్ గా ఉండి, నాకున్న అప్పటి పరిమితుల మేరకు వేశాను. అవి ఇప్పుడు మీకోసం.
క్లారిటీ బాగా ఉండేందుకై - బాగా డెవలప్ చేసి పెట్టాను. డబల్ క్లిక్ చేసి చూడండి.
|
Front side. |
|
Upper side. |
|
Upper side. |
ఈ పూల డిజైన్స్ ని చూస్తే, మామూలుగా కనిపించినా, బయట వెలుతురుకు - ఒక యాంగిల్ నుండి చూస్తే ఆ పూల డిజైన్స్ బాగా మెరిసినట్లు కనిపిస్తాయి. అది ఎలాగో ఈ క్రింది ఫోటోని చూడండి.
|
Shining Flowers design. లోపలి నుండి చూస్తే - ఒక యాంగిల్ లో అలా మెరుస్తూ కనిపిస్తాయి.
|
6 comments:
కళాత్మకతకి బాగా పదును పెట్టారనమాట! బాగుందండీ!
ఇంకా రంగు మిగిలి ఉంటె బాగుండేది. .. ఇంకొక కళాత్మకం వచ్చి ఉండేది. సమయం లేదు లేదు అంటూనే... ఇన్ని ..!?..
అవునండీ.. కృతజ్ఞతలు.
అవునండీ వనజ గారూ!. సమయం లేదండీ.. కాస్త 'కలాపోసన' ఉంటే ఇంకా మనసు తృప్తిగా ఉంటుందని అప్పుడప్పుడు అలా చెయ్యటం. అలా చేసుకున్నాక వచ్చే ఆనందమే నన్ను రీచార్జ్ చేస్తున్నది అనిపిస్తుంది.. ఒక్కోసారి. మీకు ధన్యవాదములు.
మీకు చాలా ఓపికండీ . అన్నీ బాగా చేస్తున్నారు . శబాష్ .
:) ఏదో అలా కాసింత ఓపికండీ.. మాల గారూ!.. మీకు కృతజ్ఞతలు.
Post a Comment