Friday, January 13, 2012

No visibility comments option.

మొన్న ఒకరు ఒక సోషల్ సైట్ లో అడ్డ్ద్ రిక్వెస్ట్ పెడితే - ఓకే చేశాను. చాలా పెద్ద పదవిలో ఉన్నవారు వారు. మ్యూచువల్ గా కూడా ఎవరూ లేరు. కనీసం మ్యూచువల్ గా ఉండే అంశాలు కూడా ఏమీ లేవు. అయినా ఓకే చేశాను. కానీ నా బిజీ పనుల్లో ఉండి, మాట్లాడలేదు, కామెంట్స్ పెట్టలేదు నేను. లైక్స్ మాత్రం కొట్టేస్తూ పోయాను.

ఈ రోజు చూస్తే - సంక్రాంతి విషెస్ చెబుదామని కామెంట్స్ బాక్స్ కోసం చూస్తే - ఆ బాక్స్ లేదు.. అసలు ఆ ఆప్షన్ అసలే లేదు. మిగతావారు అందరూ వ్రాస్తున్నారు. నాకు మాత్రమే ఆ కామెంట్స్ లైన్ ఆప్షన్ కనిపించటం లేదు. పోనీ సెట్టింగ్స్ చూస్తే పబ్లిక్ అనే ఉంది. షాక్ అయ్యాను. మళ్ళీ ఇందాక మళ్ళీ చూశాను. మళ్ళీ అలాగే కనిపిస్తూనే ఉంది. ఆ ఆప్షన్ మాత్రం నాకు కనిపించటం లేదు. ఆ ఒక్క పోస్ట్ కేనా? అని చూశా.. అన్ని పోస్ట్ లూ అంతే!. నేను కామెంట్స్ వ్రాయటానికి అవకాశం లేదు కానీ, వేరేవారు వ్రాసేలా ఉన్నాయి. వారు వ్రాస్తున్నారు కూడా.

కాసింత ఆలోచిస్తే - నేను ఏమీ కామెంట్స్ పెట్టకుండా ఇలా సెట్టింగ్స్ పెట్టారేమో అనిపించింది. అసలు ఆ ఊహ వచ్చాక, ఏదోలా అనిపించింది. ఇక అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇంకో వారం రోజులు చూశాక ఇంకా అలాగే - కామెంట్స్ వ్రాసే అవకాశం లేకుంటే - వారిని రిమూవ్ చెయ్యటమే మంచిది అనీ. మిగతా మిత్రులెవరూ అలా చెయ్యలేదు. ఉండేవారు అలా ఓ మూలగా ఉండిపోయేవారు. లేకుంటే వెళ్ళిపోయేవారు. ఇలా అవటం ఇదే మొదలు, సరిక్రొత్త అనుభవం కూడా.

అవతలివారు ఎంత పెద్ద హోదాలో ఉన్నా, మనం వ్రాసే పోస్ట్స్ కోసమే అన్నట్లు మిత్రులుగా ఆడ్ అయ్యి, మనం ఏమీ వ్రాయనీయకుండా సెట్టింగ్ పెట్టినప్పుడు, అవమానంలా అనిపిస్తున్నది. నాకైతే ఏదోలా ఉంది కూడా.. ఇది సెట్టింగా?. సర్వర్ ప్రాబ్లేమా అనేది ఈ వారం రోజుల్లో తెలుస్తుంది. లేక వారే అలా పెట్టారా? అనేది కూడా తెలుస్తుంది.

పోనీ నేను ఏదో అసభ్యముగా, చెడుగా ఏదో వ్రాశాను అంటే - అందువల్లే అలా చేశారు అనుకుందాం. కానీ - ఇంతవరకూ వారికి యే కామెంట్ కూడా చేసినట్లు, కనీసం రోజువారి విషెస్ చెప్పినట్లుగా కూడా గుర్తులేదు. ఎందుకైనా మంచిది అని ఈ రోజు నుండి వారం రోజులు విండో పీరియడ్ గా చూడబోతున్నాను. ఆ తరవాత ఇక రిమూవ్ చేద్దామని నిర్ణయించుకున్నాను. ఈ క్రింది ఫోటో చూడండి. ?????? దగ్గర నేను చెప్పే ఆప్షన్ లేదు.


ఇది ఏదో సంచనాల కోసం అనో, ఎవరిమీదో దుష్ప్రచారం చేద్దామని చెప్పటం లేదు. అలా మాట రావొద్దని - ఆ ఫోటో బాగా ఎడిట్ చేశాను. కేవలం - సోషల్ సైట్స్ సీరిస్ లో భాగముగా - "నాకు ఇలా ఎదురయ్యింది.. మీకూ ఎదురు కావచ్చును.." అనే ముందు జాగ్రత్తగా చెప్పటం అంతే!.

Related Posts with Thumbnails