Thursday, March 31, 2011

Social NW Sites - 22 - చాట్

సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఉన్న మరొక గొప్ప విషయం - చాట్స్. ఇది రెండువైపులా పదును ఉన్న కత్తి. సరిగ్గా వాడటం తెలీకపోతే అన్నింటికన్నా ప్రమాదముగా ఉంటుంది. తెలిస్తే అంతా బాగానే ఉంటుంది. మొదట్లో తెలీక ఇందులో చాలా దెబ్బలు తింటుంటారు. నాకూ మొదట్లో అలాంటి అనుభవాలు చాలా ఎదురయ్యాయి కూడా. జాగ్రత్తగా వాడటం తెలిస్తే - నిజముగా బాగా ఉపయోగకరమైనది. అది ఎలాగో ఇప్పుడు మీకు చెబుతాను.

ఈ చాట్స్ కూడా మూడు రకాలు.

ఒకటేమో అందరికీ తెలిసిన టెక్స్ట్ చాట్ - ఇందులో అక్షరాలు టైపు చేస్తూ SMS లాగా పంపిస్తూ ఉంటాము. ఏదైనా విషయం గురించి డిస్కషన్ చేస్తూ, అత్యసరముగా మాట్లాడాలి అంటే ఇది బెస్ట్.

రెండోది : వాయిస్ చాట్ : ఇందులో ఇయర్ ఫోన్స్, మైక్రో ఫోన్ సహాయముతో మాట్లాడుకోవటం. ఇందులో ఆ టెక్స్ట్ చాట్ కన్నా ఇదే ఈజీగా అనిపిస్తుంది. అక్షరాలు టైపు చెయ్యలేని వారికి, బాగా త్వరత్వరగా మాట్లాడేవారికి ఇది అద్భుత అవకాశం.

మూడోది అయిన చాట్ - వీడియో చాట్ : ఇందులో అవతలి వ్యక్తిని చూస్తూ, మాట్లాడుకోవచ్చును. ఇది అన్నింటికన్నా బెస్ట్ చాయిస్. కాని ఇది బాగా తెలిసిన వ్యక్తుల కోసమే వాడాలి. లేకుంటే ఇబ్బంది పడతారు.

సాధారణముగా యాహూలోనో, జిమెయిల్ లోనో మెయిల్ ID ద్వారా అక్కౌంట్ ఓపెన్ చేసుకొని, అందులో చాట్ చేస్తుంటారు. నిజానికి ఈ చాట్ ని సోషల్ సైట్లలో ఓపెన్ చేసుకొని కూడా చాట్ చెయ్యొచ్చు. ఈ విషయం చాలా మందికి తెలీదు కూడా. ఆర్కుట్ లోని మిత్రులతో జిమెయిల్ ఒపెన్చేసి, అందులో చాట్ చేస్తూ ఉంటారు. నేను అలాగే ఈ చాట్ ని మొదట్లో చేసేవాడిని. ఆతరవాత సౌలభ్యం తెలిశాక ఆర్కుట్ లోనే ఓపెన్ చేసుకొని చాట్ చేస్తూ, ఇటు స్క్రాప్స్ వ్రాస్తూ ఫోటో కామెంట్స్, అప్డేట్స్ అన్నీ చూసుకుంటూ చేస్తుంటాను. ఇలా చేయ్యనివారు ఆ చాట్ అయ్యేవరకూ ఆగి, అప్పుడు సోషల్ సైట్ లోకి వచ్చి అప్పుడు తమకి వచ్చిన స్క్రాప్స్ కి జవాబులు ఇస్తుంటారు. ఇలా చెయ్యటం వల్ల మనం ఇచ్చిన జవాబులు అలా ఆలస్యముగా వారికి అంది, వీరికి కాస్త నిర్లక్ష్యమో అని అనుకునేలా ఉంటుంది. ఈ సెట్టింగ్ కూడా చాలా చిన్నదే.. అప్లికేషన్స్ లలోకి వెళ్లి చాట్ అనే అప్లికేషన్ ని ఆడ్ చేసుకుంటే సరి. క్రొత్తగా ఓపెన్ చేసిన ప్రోఫైల్స్ లలో అటోమేటిక్ గా ఓపెన్ అవుతుందని విన్నాను. ఇలా క్రింది దానిలాగా ఇటు స్క్రాప్స్ కి రిప్లై ఇస్తూ, చాట్ చేస్తూ పోవచ్చును.

కొన్ని అవసరాలకి ఈ చాట్స్ ఉపయోగం చాలా బాగా ఉంటాయి. ఒక విషయములో పర్సనల్ గా మాట్లాడుకోవటానికీ, త్వరత్వరగా మాట్లాడుకోవటానికీ, సహాయం కోరటానికీ, సహాయం చెయ్యటానికీ, హెచ్చరించటానికీ, ఏదైనా నేర్చుకోవటానికీ, ఏదైనా ఫైల్ పంపించుకోవటానికీ.. అలాగే ఎదుటివ్యక్తి ఎలాంటివాడో తెలుసుకోవటానికి ఈ చాట్స్ బాగా ఉపయోగపడతాయి. కనుక బాగా ఇరువురూ జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా - దెబ్బ తింటాము.

ఈ చాటింగ్ లు అతిగా చెయ్యటం కూడా అంత మంచిది కాదు.. చాటింగ్స్ లలో వెంట వెంటనే జవాబులు వ్రాస్తూ రావలసి ఉండటం వల్ల ఆలోచించటానికి తగిన సమయం ఉండదు. కొద్దిగా టాలెంట్ ఉండి, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈజీగా చెయ్యవచ్చును. అది చేతగానివారప్పుడు ఆ జోలికి పోవటం అంత మంచిది కాదు. ఆడవారు మాత్రం ఈ చాటింగ్స్ తక్కువగా చెయ్యండి. అవతలి వ్యక్తి గురించి మీకు బాగా తెలిసి ఉంటేనే గాని దాని జోలికి వెళ్ళకండి. ఇక వాయిస్ చాట్స్, వీడియో చాట్స్ అసలే వద్దు.

ఇక టెక్స్ట్ చాట్స్ ని ఇంగ్లీష్ లో గాని, రోమన్ తెల్గీష్ లో కానీ, మరే ఇతర భాషల్లో గానీ, తెలుగులో చాట్స్ చెయ్యవచ్చును. అది మీమీ ఆసక్తిని బట్టి ఉంటుంది. మనం ఎక్కువగా ఇంగ్లీష్ లో, మన తెలుగువారు అయితే తెల్గీష్ లో (రోమన్ ఇంగ్లీష్ లో వ్రాయటం), టైపింగ్ మీద బాగా ప్రాక్టీస్ ఉన్నవారు తెలుగులోనే చాట్ చేస్తారు. తెలుగులో చాట్ చెయ్యటం కూడా ఈజీనే. కాకపోతే ఎలా వ్రాయాలో తెలిసి ఉండాలి. ఫోనెటిక్ పద్ధతి తెలిస్తే అందులో కూడా బాగా తేలికగా చెయ్యగలుగుతారు.

చాట్లలో అవతలి వారి నైజం ఎలాంటిదో చాలా ఈజీగా పసిగట్టేయవచ్చును. మొదట్లో మీకు ఆడ్ అవగానే అవతలి వారు మీకు చాట్ అవైలబుల్ లోక్ వచ్చినప్పుడు చాట్ కి రమ్మని పింగ్ (అంటే - ఆ అవతలివారిని చాట్ లో మాట్లాడుకుందాం అని మీ ఇద్దరి మధ్య చాట్ ఓపెన్ చెయ్యటం అన్నమాట) చెయ్యండి. అప్పుడు తీరికగా ఎదుటివారితో మాట్లాడవచ్చును.

ఒకప్పుడు చాట్ లలో కేవలం టెక్స్ట్ చాట్ తప్ప మరేమీ ఇతర సౌకర్యాలు ఉండేవి కావు. ఈ మధ్య చాలా సదుపాయాలూ కలిపించారు. వాయిస్ చాట్, వీడియో చాట్, గ్రూప్ చాట్, చాట్ లోనే ఏవైనా ఫైల్స్ పంపుకోవటం, అవతలివారు హద్దులు దాటితే వారిని ఇక చాట్ చెయ్యకుండా బ్లాక్ చెయ్యటం, చాట్ బాక్స్ పెద్దగా చెయ్యటం.. ఉన్నాయి. ఈ క్రింది ఫోటో చూడండి. ఇందులో ఎర్ర రంగులో నంబర్లు ఉన్నాయిగా.. అక్కడ


1 వద్ద నొక్కితే అది వీడియో చాట్,

2 వద్ద నొక్కితే వాయిస్ చాట్,

3 వద్ద అయితే గ్రూప్ చాట్ చేసుకోవచ్చును. అది ఇలా ఉంటుంది.  ఈ క్రింద ఫోటోలో చూపినట్లుగా 1 వద్ద నొక్కితే క్రింద బాక్స్ ఓపెన్ అవుతుంది.  2 వద్ద ఆ గ్రూప్ చాట్ చేసే ఫ్రెండ్ అకౌంట్ పేరు గానీ, మెయిల్ ID గానీ అక్కడ కాపీ, పేస్ట్ చెయ్యాలి. 3 వద్ద నొక్కి వారిని అందులోకి వచ్చేలా చేయవచ్చును.


4 actions వద్ద ఉన్న త్రికోణాన్ని నొక్కితే చిన్న మెనూ వస్తుంది.

5 వద్ద Block నొక్కితే - మనం ఎవరితో చాట్ చేస్తున్నామో వారు మనల్ని బాధిస్తే / ఇబ్బంది పెట్టితే, ఇక వారితో చాట్ చెయ్యాల్సిన పని అంటూ మనకి లేకుంటే దాన్ని నొక్కితే - ఆ అవతలి వ్యక్తి ఇక మనకి చాట్ పింగ్ చెయ్యలేడు. ఇక మళ్ళీ మనం అక్సేప్ట్ చేసేదాకా మనతో చాట్ ఇబ్బంది పెట్టలేరు. ఈ విషయం చాలామందికి తెలీకపోవచ్చును. ఇబ్బంది పడుతున్న ఆడవారు ఈ సౌకర్యాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి.

6 వద్ద అయితే ఒక ఫైల్ ఇటునుండి అటు - వారికీ పంపించుకోవచ్చు. ఇలా చెయ్యాలీ అంటే ఇద్దరూ చాట్ అవైలబుల్ లో ఉండాలి. అలా పంపించుకున్న ఫైల్స్ - "మై డాక్యుమెంట్స్" లో కనిపిస్తాయి.

7 వద్ద మనం టెక్స్ట్ చాట్ చేసుకుంటాము. 

8 వద్ద నొక్కితే చాట్ ని ఇక అందముగా చెప్పటానికి మన భావ వ్యక్తీకరణ ఎలా ఉందో అలాగే అక్కడ ఈ స్మైలీ ల సహాయముతో అక్కడ చూపవచ్చును.

9 వద్ద బాణం గుర్తుని నొక్కితే చాట్ బాక్స్ పెద్దగా అవుతుంది.


10 అవతలి వ్యక్తి చాట్ కి అవైలబుల్ లో ఉన్నాడా, బీజీ లో ఉన్నాడా, ఇన్విజిబుల్ లో ఉన్నాడా? అని తెలుస్తుంది. ఎలా అంటే పచ్చ లైట్ లో ఉంటే చాట్ కి అవైలబుల్ అనీ, ఎర్రని రంగులో ఉంటే బీజీ అనీ, బూడిద రంగులో ఉంటే ఇన్విజిబుల్ / లేదా ఆఫ్ లైన్ / చాట్ కి అవైలబుల్ లో లేరు అని అర్థం.

గ్రూప్ చాట్ లో ఒకటి వద్ద నొక్కితే, క్రింద Add people to this chat ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లో అవతలివారు కాకుండా - ఇంకో మూడో వ్యక్తి ఎవరితోనైనా  చాట్  చేయ్యదలిచామో  వారి మెయిల్ ID లేదా వారి ప్రొఫైల్ పేరు అక్కడ పేస్ట్ చేసి, క్రిందన ఉన్న Invite ని నొక్కాలి. ఆ మూడో వ్యక్తి అందుబాటులో ఉంటే వారూ ఆన్ లైన్ లోకి వస్తారు. ఇలా ఇంకొందరినీ చాట్ కి ఆహ్వానించవచ్చును.

ఈ క్రిందన మూలన ఉన్న ఎర్రని రంగులో ఉన్న వృత్తం లోని మూల వద్దకి కర్సర్ ని ఉంచితే - అలా బాణం గుర్తు వస్తుంది. అలాగే నొక్కి పట్టి పెద్దగా డ్రాగ్ చేస్తే ఆ చాట్ బాక్స్ పెద్దగా అవుతుంది. ఇది జిమెయిల్ లో రాదు. కేవలం ఆర్కుట్ లో మాత్రమే వస్తుంది.


ఇక విజువల్ చాట్స్ అంటే ఇలా వస్తుంది.. ఇటుస్క్రాప్స్ వ్రాస్తూ చాట్ చేసుకోవచ్చును. స్క్రీన్ మీద ఏదైనా అర్థం కాకున్నా, ఎదుటివారిని చూపిస్తూ అడగటానికి, బంధుమిత్రులతో చాట్ చెయ్యటానికి దీన్ని వాడుకోవచ్చును. ఎప్పుడో ఒకసారి వాడుకుంటే చాలా మంచిది అని నా అభిప్రాయం. దీన్ని వాడేటప్పుడు మీ బ్యాక్ గ్రౌండ్ మీద, మీ మీద కాస్త దృష్టి సారించాలి. లేకుంటే అన్నీ ఇతరులకి కనిపిస్తాయి. ఈ క్రింది ఫోటో వేరేవారి సహాయముతో పెడుతున్నాను. ఇలా వీడియో చాట్ కూడా చేసుకోవచ్చును. అప్పుడు ఇలా కనిపిస్తుంది.

అక్కడ పైన వారిని చూస్తూ చాట్ చేసుకోవచ్చును. కాకపోతే బాగా తెలిశాక చాలా అరుదుగా ఇలా వీడియో చాట్ చేసుకోండి. కాస్త సెక్యూర్ గా ఉంటారు.

First : updated on 31-March-2011

3 comments:

funnyguy said...

Hello Raaj Gaaru
మొన్న కొంచం ఫ్రీ గా ఉంది .. గూగుల్ లో సెర్చ్ చేస్తూ ఉంటే మీ Google profile అలానే మీ బ్లాగ్ నాకు తారసపడినవి..,

మీ బ్లాగ్ ., మీ Google profile లో విషయాలు చాలా చాలా ఉపయోగకరం గా ఉన్నవి అండి...
మా లాంటి వాళ్ళకి ఏవైనా సందేహాలు వస్తే మీ బ్లాగ్ మాకు ఒక రెఫెరెన్సు లా ఉపయోగపడుతుందండి ....

అందరికి ఉపయోగపడేలా బ్లాగ్ ని తీర్చిదిద్దినందులకు మీకు కృతజ్ఞతలు.. అండి

Raj said...

చాలా ధన్యవాదములు.. మీరు చేసిన ఈ కామెంట్ వల్ల - నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది అని చాలా సంతోషముగా ఉంది. ఇంకా కృషి చేస్తాను. ఇంకా బాగా చెప్పటానికి ప్రయత్నిస్తాను.

వీలు చూసుకొని నా బ్లాగ్ చదివినందులకు కృతజ్ఞతలు.

Anonymous said...

రోజు చాట్ చేసేటప్పుడు ప్రతీ ఒక్కరికి వచ్చే doubts ని ఎదురయ్యే ఇబ్బందులని మీరు చాట్ లో ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. మొదలగున్నవి.:: చాలా చక్కగా వివరించారు .., నేను కూడా కొన్ని సందర్భాల్లో నా మిత్రులతో chat చేసేటప్పుడు " Bye " అని చెప్పకుండా signout చేసేవాడిని .., దీనివల్ల వాళ్ళ మనసు ఎంతలా నొచ్చు కుంటుందో ఇప్పుడే తెలుసుకున్నాను .., ఇక నుంచి అలా ప్రవర్తించకుండా జాగ్రత్త పడతాను ...
ఇంకా మీకు ఎదురైన కొన్ని ఇబ్బందులని తలుచుకుంటే మొదట నవ్వు వచ్చింది కానీ , ఇబ్బందులు ఎదురైనా చక్కగా ఎదుర్కొని మళ్లీ ఇంకొకళ్ళకి అలాంటివి జరగకూడదని వాటిని నలుగురికి చెప్పే మీ కృషి శ్లాగనీయం .

Related Posts with Thumbnails