ఇప్పుడు వారు వారి మిత్రులతో ఎలా ఉన్నారో / ఉంటున్నారో తెలుసుకుందాం. ఇది తెలుసుకోవటానికి కొంత సమయం పడుతుంది. ఇందులో కూడా మళ్ళీ స్క్రాప్ బుక్ చూడకతప్పదు. మిత్రులతో ఎలా ఉంటున్నారనేది - కాలక్రమంలో తెలుస్తూనే ఉంటుంది. మొదట్లో తెలుసుకోవటం కొద్దిగా కష్టమే!. కాని కొంత అనుభవం ఉంటే తెలుసుకోవచ్చును. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది. నీ స్నేహితులు ఎవరో చెప్పు - నీ గురించి చెబుతాను అని ఒక మహానుభావుడు అన్నారు. ఇది నిజమే!. వారికి వచ్చే స్క్రాప్స్ చూస్తేనే వారు ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నారో తెలిసిపోతూనే ఉంటుంది. దాన్ని బట్టే ఒక అంచనాకి రావచ్చును. వారు ఇతరులతో ఎలా ఉంటున్నారనేది. ముందే చెప్పానుగా - అలా స్క్రాప్స్ చూడటం మొదట్లోనే చెయ్యండి. ఆ తరవాత వద్దు. అందులోని విషయాలు మనకి తెలీకుండానే అవతలివారికి చెప్పేస్తుంటాము. మన బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే మారిపోతుంది కూడా. కనుక తస్మాత్ జాగ్రత్త.
Sunday, March 13, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment