Thursday, March 17, 2011

Mail forwarding - Malver

చాలాసార్లు చెప్పానుగా.. ఈ మెస్సేజ్ మెయిల్ ని అందరికీ పంపండీ అని కొన్ని మెయిల్స్ వస్తుంటాయి. వాటిని ఈ చదూకున్న మూర్ఖులు వారి ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నవారందరికీ పంపిస్తూ ఉంటారు అనీ!.. అలా మెయిల్ ID వారి చేతికి చిక్కి, ఆ తరవాత వారు పంపే మెయిల్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఎన్నోసార్లు వివరముగా చెప్పాను. ఇప్పుడు మరో రెండు వివరణలతో ఈ విషయాన్ని మరింత క్లియర్ గా చెప్పాలని అనుకుంటున్నాను.

మొన్న DHL (ఫేక్) కంపనీ నుండి నాకో మెయిల్ వచ్చింది. అది చూడగానే అనుకున్నాను. అది ఫేక్ అనీ. ఎలా అంటే అందులో నేను ఏమీ పార్సెల్ వెయ్యలేదు. అలాగే, నాకు పార్సల్ అంటూ ఏమీ రాదనీ తెలుసు. చెప్పగా.. ఈ మెయిల్ మీ ఫ్రెండ్స్ కి అందరికీ పంపండీ.. అనే మెయిల్స్ ని అందరికీ పంపిస్తే అందులో బలయిన వాళ్ళల్లో నేనూ ఒకడిని. మళ్ళీ దాన్ని ఇతరులకు ఎవరో పంపారు. అందులో నా మెయిల్ ID  ఉన్నట్లుంది. అందుకే ఇలా అనేక బాధలకి గురి అవుతున్నాను. అలా రాగానే దాన్ని వెంటనే ఓపెన్ చెయ్యలేదు. కావాలని అలాగే కొద్దిరోజులు ఉంచేశాను. ఒక ఆటాచ్మెంట్ ఫైల్ ఉంది చూడండి అనీ.. అది ఓపెన్ చేస్తే ఏమవుతుందో నాకు తెలుసు అందుకే ఆగాను.

ఇలా వచ్చినదాన్ని కొన్ని రోజులతర్వాత ఓపెన్ చేసి చూశాను.. అలా ఎందుకూ అంటే - ఆంటీ వైరస్ సాఫ్ట్వేర్ అప్దేటేడ్ అవుతుంది అని. ఏదో ఒక మాల్వేర్ నా సిస్టం లో తిష్ట వెయ్యటానికి రెడీగా ఉందన్న మాట. ఈ ఫార్వర్డ్ మెస్సేజెస్ వల్ల ఎంత ప్రమాదం జరిగేదో..


ఈ చదూకున్న మూర్ఖులు తెలివే ఉండదు.. నిజమా కాదా? అని అర్థం చేసుకోరు. ఇక దాన్ని ఏదో మహాద్భాగ్యముగా ఫీలయ్యి, అందరికీ పంపిస్తూ ఉంటారు. అందుకే వారూ అనేక చిక్కులకు గురి అవుతూ ఉంటారు. వారి సిస్టమ్స్ స్లో గా నడవటం.. తరచూ హాంగ్ అవటం, డాటా వాడకం ఎక్కువగా ఉంటుంది కూడా (ఎలా అంటే మీ సిస్టం నుండి ఈ నెట్ కనెక్షన్ ద్వారా డాటా దొంగిలించటం జరుగుతుంది కదా).. ఇక ఇంతే కాదు.. ఇంకో విషయం కూడా చెబుతున్నాను.. అది వింటే - అర్థం అయితే మీ వంట్లో వణుకు రావటం ఖాయం. 

నేను ఆన్ లైన్లో బాగా ఉంటున్నాను, ఎప్పుడు చూసినా ఆన్ లైన్ లోనే ఉంటున్నాను - అని కంప్లైంట్స్ వస్తుంటే ఏమో అనుకున్నాను. నేను తప్ప ఎవరైనా నా సిస్టం నుండి ఎవరైనా లాగిన్ అవుతున్నారా అంటే ఎవరూ లేరు. నేను నెట్ కి దూరం ఉన్న సమయాల్లో కూడా నా పేజీలోకి ఎవరో వచ్చేస్తున్నారు అని అనుమానం వేసింది. ఇలా కాదని అనుకోని నిఘా పెట్టాను. నేను నా మెయిల్స్ చెక్ చేస్తుండగానే - ఎక్కడి నుండో ఒకరు నా మెయిల్ ID తో నా మెయిల్ బాక్స్ లోకి లాగిన్ అయ్యారు. అప్పుడు తెలిసింది.. వీరి వల్ల నేను ఎల్లప్పుడూ నేను ఆన్లైన్ లో కనిపిస్తున్నానని. ఇక చూడండి.. నా టెన్షన్.. ఇది మీరు నమ్మలేకున్నారా? నిజం. చూడండి మీరే.. నావి ఫైర్వాల్, అన్ని రకాల అప్డేట్స్ ఉన్నా తప్పలేదు.
ఆ పసుపు వర్ణములో హైలైట్ చేసి ఉంది చూడండి. అలాగే కనిపిస్తుంది అక్కడ. కనిపించకపోతే పెద్దగా చూడండి. మన మిత్రులు అనబడేవారు అలా ఫార్వార్డ్ చేస్తూ - ఇలా మనల్ని చిత్రహింసల పాలు చేస్తుంటారు. ఆ మెయిల్ ID కి ఉన్న పాస్ వర్డ్ ని బ్రేక్ చేసి ఇలా లాగిన్ అవుతూ ఉంటారు. దాని వల్ల నేను ఎప్పుడూ అలా ఆన్లైన్ లో ఉంటున్నానని నా మిత్రులు అనుకుంటున్నారన్నమాట. అందుకే

మీరు నిర్ధారించుకోకుండా ఏదీ / ఏ మెయిల్ కూడా ఫార్వార్డ్ చెయ్యకండి ప్లీజ్!.. 

2 comments:

Indian Minerva said...

ఈ mails లో చాలావరకు 1977 లో తప్పి పోయిన ఓ చిన్నపిల్ల తన తల్లుదండ్రులను చేరుకోవడానికి సహాయం చెయ్యమనో, ఈ mail ఫార్వార్డ్ చెయ్యకపోతే వాడెవడో దేవుడికి కోపం వస్తుందని చెప్పే బ్లాక్mails, లేదూ ప్రతి mail కూ మైక్రోసాఫ్టోడు $877878 ఇసాడంటూ వచ్చే మైల్సో వుంటాయి. ఇదిలా వుంటే కొందరు మహానుభావులు ఆ forward కి reply all కొడుతుంటారు. అప్పుడు మాత్రం వాడికి reply ఇచ్చి కడిగేస్తుంటాను.

Raj said...

మంచి పని చేస్తున్నారు. నా వైపు నుండి కొన్ని తిట్లు జత చేసి, బాగా కడిగిపారేయ్యండి.

Related Posts with Thumbnails