Tuesday, June 29, 2010

Guppedu manasu - Mouname nee bhasha

చిత్రం పేరు : గుప్పెడు మనసు (1979)
గాయకుడు : M బాలమురళీకృష్ణ 
సంగీతం : MS విశ్వనాథన్ 
గేయరచన : ఆత్రేయ
సంవత్సరం : 1979
డైరెక్టర్ : K బాలచందర్ 
నటీనటులు : నారాయణ రావు, శరత్ బాబు, సరిత, సుజాత  
**************
పల్లవి :
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరవుతావు. || మౌనమే నీ భాష ||
 
చరణం 1:
చీకటి గుహ నీవు - చింతల చెలి నీవు
నాటకరంగానివే... మనసా
తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో - ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో - ఏమి మిగిలేవో
ఎందుకు వలచేవో - ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో - ఏమి మిగిలేవో   || మౌనమే నీ భాష ||

చరణం  2:
కోర్కెల సెల నీవు - కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే... మనసా
మాయల దయ్యానివే
లేనిది కోరేవు - ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు - యుగములు పొగిలేవు
లేనిది కోరేవు - ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు - యుగములు పొగిలేవు || మౌనమే నీ భాష ||

2 comments:

Aravind Putrevu said...

anna song kavali....

Raj said...

మీకు ఈ పాట కావాలంటే కాపీ చేసుకోండి.
ఒకవేళ వేరేది కావాలంటే చెప్పండి. ట్రై చేస్తాను..

Related Posts with Thumbnails