చిత్రం : మనుషులు మారాలి (1969)
రచన : శ్రీ శ్రీ
సంగీతం : కె. వి. మహాదేవన్.
గానం : ఘంటసాల
***********************
పల్లవి :
చీకటిలో కారు చీకటిలో - కాలమనే కడలిలో
శోకమనే పడవలో - ఏ దరికో.. ఏ దెసకో
చీకటిలో కారు చీకటిలో - కాలమనే కడలిలో
శోకమనే పడవలో - ఏ దరికో.. ఏ దెసకో
చరణం 1:
మనసున పెంచిన మమతలు పోయే
మమతలు పంచిన మనిషే పోయే
మనసున పెంచిన మమతలు పోయే
మమతలు పంచిన మనిషే పోయే
మనిషేలేని మౌనములోనా
మనుగడ చీకటి మయమైపోయే
లేరెవరూ.. నీకెవరూ.. || చీకటిలో ||
చరణం 2:
జాలరి వలలో చేపావు నీవే
గానుగ మరలో చేరకువు నీవే
జాలరి వలలో చేపావు నీవే
గానుగ మరలో చేరకువు నీవే
జాలే లేని లోకంలోన
దారిలేని మనిషివి నీవే
లేరెవరూ.. నీకెవరూ.. || చీకటిలో ||
Wednesday, June 16, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment