పెట్రోల్ ధర పెంచేశారు.. అని చాలామంది పెట్రోల్ బ్యాంకుల వద్ద క్యూలు కట్టారు.. నేనూ అందరిలాగా ఎందుకో క్యూలో ఉండబుద్ధి కాలేదు. ఎందుకో వైరాగ్యం వచ్చేసింది. అసలు ఎందుకు నిలబడాలి అనే ఆలోచించాను. ( నెలకు సరిపడా పెట్రోల్ ని ఒకటేసారి పోయిస్తాను. అలా ఇప్పటికీ కొనసాగిస్తున్నాను. ) ఎందుకో క్యూలో నిలబడి మనవంతు రాగానే పోయించుకొని, అదేదో సాధించాం అని తృప్తి పొంది బయట పడటం ఏమిటో నాకు మాత్రం అర్థం కాదు.
పైసా కి ఒక సెకండ్ అని ఒక మొబైల్ సంస్థ అన్నప్పుడు జనం వేలంవెర్రిగా ఎగరపడ్డారు. ఎవరినడిగినా అదే పేరు. ఇంతటి పేరు - ఇంకో సంస్థ లాండ్ ఫోన్ కి రాలేదు. ఈ లాండ్ ఫోన్ లో నెలకి తొంభై ఐదు రూపాయల బాలన్సు వేసుకుంటే ఆ సంస్థ లాండ్, విల్, మొబైల్ ఫోన్ లకి ఒక నెల పాటు రాష్ట్రమంతటా అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఎంత బాగుంది కదూ.. మొబైల్ ఫోన్ లాగా రేడియేషనూ ఉండదూ, అలాగే చెవి దగ్గర వేడి కాదు. ఇంకో ప్రముఖ మొబైల్ సంస్థ రాత్రిపూట పదకొండు నుండి తెల్లారి ఏడు గంటల వరకూ ఒక్క రూపాయికి ఇరవై నిమిషాలు మాట్లాడుకోవచ్చు. ఇలాంటిసౌకర్యాలు ఆలోచించరు జనాలు. ఇక్కడా అంతే! లీటరుకు మూడు రూపాయలు పెరుగుతున్నదంటే అప్పటికప్పుడే వెళ్లి క్యూలో నిలబడి బండి ఆన్ లోనే ఉంచి, రెండు, మూడు లీటర్లు మాత్రమే పోయించుకొని వెళతారు.
ఒకవేళ ఐదు లీటర్లు పోయించుకేల్లినా లీటరుకి మూడు రూపాయల చొప్పున పదిహేను రూపాయలు మిగులుతాయి. ఆ పదిహేను రూపాయల కోసం బండి ఆన్ లో ఉంచి, క్యూలో నిలబడి, మరీ పెట్రోల్ పోయించుకుంటే ఏమైనా ఆదా ఉంటుందా.. మన వంతు వచ్చేసరికి యే పావుగంటో, అరగంటో పడుతుంది. అప్పటిదాకా సమయం, ఆ బండి ఐడిలింగ్ లో ఉన్నప్పుడు కాలిన పెట్రోల్.. లేక్కలేస్తే మిగిలేది ఏముంటుంది. మా దగ్గర - ఇలా పెట్రోల్ రెట్లు పెరిగినప్పుడు బండ్లో పెట్రోల్ పోయించుకోవటానికి వచ్చినవారు ఒక విషయం గుర్తు చేసుకుంటారు..
అదేమిటంటే - ఒక న్యాయవాది ఇలా రేట్లు పెరిగినప్పుడల్లా నాలుగైదు కిలోమీటర్ల దూరము నుండి స్కూటర్ మీద వచ్చి పెట్రోల్ పోయిన్చుకుంటాడు. అంత దూరమూ, క్యూలో వాడిన పెట్రోల్, మళ్ళీ ఇంటికి వెళ్ళటానికి అయ్యేఖర్చూ చూస్తే పావు లీటర్ పెట్రోల్ ఫట్! అంటే పదిహేను రూపాయలు అన్నమాట. పది లీటర్లు పెట్రోల్ పోయించుకుంటే మిగిలేది మహా అంటే ముప్ఫై రూపాయలు. అందులో ఖర్చు పదిహేను పోగా మిగిలేది ఇంకో పదిహేను రూపాయలు. ఈ మాత్రం దానికి ఇంత సీను అవసరమా...
Saturday, June 26, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment