మీరు సిస్టం మానిటర్ మీద ఎన్నో థీమ్స్ పెట్టుకుంటున్నారా? మీకున్న రామ్ తక్కువగా ఉన్నప్పుడు అలా పెట్టుకోకండి. అలా కలలు చెదిరే థీమ్స్ పెట్టుకొని ర్యాం మీద, మీ మానిటర్ మీద భారం పడనిస్తున్నారా? అలా మీరు విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా చేస్తున్నారు. నిజానికి మీకు అలా డెస్క్ టాప్ థీం అవసరమనుకుంటే పెట్టేసుకోండి. అలా అవసరం లేని వాళ్లకి, థీమ్స్ పెట్టుకొని బోరుగా ఉన్నవాళ్ళకి, కళ్ళకి ఏమాత్రం శ్రమ కలిగించని థీం గురించి ఇప్పుడు చెబుతాను. ఒకసారి ట్రై చేసి చూడండి.
1. ముందుగా మీరు MS PAINT కి వెళ్ళండి. పైంట్ ని ఓపెన్ చేశారా?
2. ఇలా వస్తే పెయింట్ చేసే భాగాన్ని పెద్దగా చేయుటకి ఇందులో చూపినట్లుగా మూలన కర్సర్ ని పెడితే, బాణం గుర్తు కనిపిస్తుంది.
4. ఇప్పుడు పైంట్ చేసే భాగమంతా నల్లగా మారిపోతుంది (డిఫాల్ట్ కలరుగా నల్లరంగు ఉంటుంది కాబట్టి ). అంటే ఇలాగా అన్నమాట.
5. ఇప్పుడు దాన్ని Save చెయ్యండి.
6. ఇప్పుడు దాన్ని Theme గా పెట్టుకోండి. ఇలా మీకు సిస్టం మీద కనిపిస్తుంది.
బాగుంది కదూ.. ఇలా పెట్టుకోవడం వల్ల ఐదు లాభాలు ఉన్నాయి.
- మీకు విద్యుత్ ఆదా.
- సరిక్రొత్తగా లుక్ గా మీ మోనిటర్ కనిపిస్తుంది.
- మీ కంటికి ఇబ్బంది కలిగించదు.
- తేలికగా మీ సిస్టం మీదున్న ఐకాన్స్ ని గుర్తించి, వాడుకోగలుగుతారు.
- మీ మానిటర్ జీవిత కాలాన్ని పెంచిన వారూ అవుతారు..
ఇన్ని లక్షణాలు ఉన్న ఈ థీం ని వెంటనే పెట్టేసుకోండి.
ఒక చిలిపి ఆలోచన: ఈ థీం ని స్క్రీన్ సేవర్ గా వాడితే మీ మానిటర్ ఆఫ్ చేసినట్లుగా అనిపిస్తుంది. అలా చూపరులని హాశ్చర్యములో పడేయొచ్చు.
No comments:
Post a Comment