Monday, June 28, 2010

పాత ఎడిటర్ - క్రొత్త ఎడిటర్

బ్లాగులో వీడియోలు పెట్టాను..  ఇలా పెట్టడానికి నేను పాత ఎడిటర్ కి వెళ్లి అందులో వీడియో పోస్ట్ చేసేవాడిని. అలా కొన్ని వీడియోలు పెట్టాను. ఇలా వీడియోల కోసం పాత ఎడిటర్ కీ, క్రొత్త ఎడిటర్ కీ తిరగలేక ఆపాత ఎడిటర్ లోనికి వెళ్ళటం మానేసాను. అలా ఆగిపోయిందే నయం అయింది.. అసలు ఈ గూగుల్ వాడిదే కొంత పొరబాటు.

ఎలా అంటే.. అలా పాత ఎడిటర్ లోకి వెళ్లి నా వీడియోని పోస్ట్ చేసి, మళ్ళీ నా క్రొత్త ఎడిటర్ లోకి రావటం వలన (ఇలా ఎందుకు రావటం అంటే ఈ క్రొత్త ఎడిటర్ లో వీడియో అప్లోడ్ ఉపకరణం లేదు. ఈ వీడియో పోస్టింగ్ కోసమా పాత ఎడిటర్ కి వెళ్ళక తప్పదు. ) నా బ్లాగు పాత పోస్టులన్నీ - వేరు వేరు పారాగ్రాఫుల్లాగా కాకుండా, అంతా ఒకే పారాగ్రాఫుల్లా మారిపోయింది. మొన్న ఒక పాట లిరిక్ కోసమని నా బ్లాగులో వెదుకుతుంటుంటే అప్పుడు గమనించాను. నా పాత టపాలన్నీ అలా మారాయని.

ఖర్మరా బాబూ అనుకుంటూ.. ఇప్పుడు ఆ పాత టపాన్నింటినీ చూస్తూ, ప్యారాగ్రాఫుల్లోకి మారుస్తూ, రోజుకిన్ని టపాలు అన్నట్లుగా మార్చాల్సి వస్తున్నది. ఈ గూగుల్ వాడు కొత్త ఎడిటర్ లో కూడా వీడియో ఆప్షన్ ఇస్తే ఎంతో బాగుందేడిది. నాకూ ఈ తలనొప్పి పోయేది. మీలో ఎవరైనా పాత ఎడిటర్ ని వాడి, క్రొత్త ఎడిటర్ లోనికి మారుతున్నట్లయితే - కాసింత జాగ్రత్తగా ఉండండి.

No comments:

Related Posts with Thumbnails