Thursday, June 24, 2010

Nenu puttaanu ee lokam - Premnagar

చిత్రం : ప్రేమనగర్ (1971)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి. మహదేవన్
గానం : ఘంటసాల
*********************
పల్లవి:
నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది - డోన్ట్ కేర్..
నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింకా లోకంతో పని ఏముంది - డోన్ట్ కేర్..

చరణం 1 :
నేనుతాగితే కొందరి కలలు గిరగిర తిరిగాయి
నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి
నేనుతాగితే కొందరి కలలు గిరగిర తిరిగాయి
నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి
నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిసాయి
నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిసాయి
తెల్లవారితే వెనకన చేరి నవ్వుకుంటాయి
హా.. డోన్ట్ కేర్.. || నేను పుట్టాను ||

చరణం 2 :
మనసులు దాచేతందుకే పై పై నవ్వులు ఉన్నాయి.
మనిషిక్ లేని అందం కోసమే రంగులు ఉన్నాయి
ఎరగక నమ్మిన వారి నెత్తికే చేతులు వస్తాయి
ఎరగక నమ్మిన వారి నెత్తికే చేతులు వస్తాయి
ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి
డోన్ట్ కేర్.. || నేను పుట్టాను ||

చరణం 3 :
మనిషిని మనిషిని కలిపేటందుకే పెదవులు ఉన్నాయి
పెదవులు మధురం చేసేటందుకే మధువులు ఉన్నాయి
బాధలన్నీ బాటిల్లో నేడే దింపేసేయ్
బాధలన్నీ బాటిల్లో నేడే దింపేసేయ్
అగ్గిపుల్ల గీసేసేయ్ నీలో సైతాన్ తరిమేసేయ్
డ్రైవ్ ది డెవిల్ ఆవుట్.. ఆ.. హ హ్హ హ్హా || నేను పుట్టాను ||

No comments:

Related Posts with Thumbnails