రాజ్ గారూ నమస్కారం,
నా బ్లాగ్ లో నేను పోస్టు చేసిన టఫా లు ఒక సైటులో అప్ డేట్ కావటం లేదు. దానికోసం ఆ సైటు వారిని సంప్రదించగా వారు క్రింది సమాధానం ఇవ్వటం జరిగినది.
" సమస్యను మా దృష్టికి తీసుకువచ్చినందుకు చాలా ధన్యవాదములు.
మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము.
మీ బ్లాగును పలుమార్లు పలు జాబితాలకు జోడించాము కానీ మీ ఫీడు చిరునామా వేరుగా ఉండటం వలన మా సైటులో టపాలు నవీకరించబడుటలేదు.
దయచేసి మీ బ్లాగు ఫీడు చిరునామాను మార్చే అవకాశం ఉంటే మార్చి తెలియజేయగలరు.
దయచేసి మీ బ్లాగు ఫీడు చిరునామా డీఫాల్టుకు మార్చితెలియజేయగలరు."
పై విధంగా వారి వద్ద నుండి సమాధానం రావటం జరిగినది. దయచేసి మీకూ పై సమస్య యందు అవగాహన అంటే బ్లాగు ఫీడు చిరునామా డీఫాల్టుకు మార్చే విధానం తెలిసి ఉంటే సహాయం చేయగలరు .
- శ్రీనివాస్
*************
ఇక్కడ బ్లాగ్ ఫీడు చిరునామా అంటే బ్లాగ్ అడ్రెస్ అన్నమాట. అంటే http://www. అని మొదలయ్యే మా బ్లాగ్ చిరుమానా కాదండీ.. అక్కడ - http:// అని కాకుండా www. తో మీ బ్లాగ్ అడ్రెస్ ని పూర్తి చెయ్యాలి. అంతే. మీకు మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.
ఈ క్రింది ఫోటోలో నా బ్లాగ్ స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను.
ఇందులో బ్లాగ్ అడ్రెస్ గా achampetraj.blogspot.in గా ఉంది. దీన్నే బ్లాగ్ అడ్రెస్ అని పిలుస్తారు. ఆ అడ్రెస్ ఉన్న డబ్బాని - అడ్రెస్ బార్ address bar అని పిలుస్తారు. ఎవరికైనా బ్లాగ్ అడ్రెస్ ఇవ్వాలన్నా, బ్లాగ్ అగ్రిగేటర్స్ కి మన బ్లాగ్ అడ్రెస్స్ పంపాలన్నా ఆ అడ్రెస్ ముందు www. ని జత చెయ్యాలి. అంటే ఇప్పుడు బ్లాగ్ అడ్రెస్ - www.achampetraj.blogspot.in అవుతుంది. ఇలా లింక్ ని ఎవరికైనా పంపిస్తే - అందుకున్నవారు ఆ అడ్రెస్ మీద క్లిక్ చేస్తే - నేరుగా మన బ్లాగ్ కి వస్తారు. కావాలంటే ఈ నీలిరంగులో ఉన్న నా బ్లాగ్ అడ్రెస్ ని నొక్కి చూడండి. నేరుగా నా బ్లాగ్ లోనికే వస్తారు.
కొన్ని అగ్రిగేటర్ల సర్వర్స్ - బ్లాగ్ ని వాటికి జత చేసేముందు - పంపే అభ్యర్థన ఫారంలో మన బ్లాగ్ అడ్రెస్ ని http:// అని జత చేస్తే అవి అంగీకరించవు. వాటికి www. తో మాత్రమే పంపాల్సి ఉంటుంది. ఇది కొద్దిగా టెక్నికల్ ఇబ్బంది. మొదట్లో నాకూ అలాగే జరిగింది. పైన చెప్పినట్లు మార్చి పంపిస్తే అప్పుడు అంగీకరించింది ఆ అగ్రిగేటర్ సర్వర్.
ఇక్కడ మీరు మరో రెండు ముఖ్య విషయాలనీ గుర్తు పెట్టుకోవాలి. అవి ::
1. సైటు అడ్రెస్ అంతా చిన్న అక్షరాలలో అంటే English భాషలోని Lower case letters లలో ఉండాలి.
2. సైట్ అడ్రెస్ లో ఎక్కడా ఖాళీ ఉండకూడదు. అంటే పదాల మధ్య స్పేస్ రాకూడదు. ఒకే ముక్కలా అడ్రెస్ ఉండాలి.

3 comments:
నా బ్లాగ్ లో కొంత మంది ప్రముఖుల ఫోటొస్ పెట్టి ఆ ఫోటోస్ క్లిక్ చేస్తే వారికి సంబంధించిన విషయాలు, వారికి సంబంధించిన మరిన్ని ఫోటోస్ వచ్చేలా చేయడం ఎలా?

ఈ క్రింది లింక్ పోస్ట్ ని చూడండి. అందులో వివరముగా చెప్పాను. లింక్ : http://achampetraj.blogspot.in/2014/04/photo-word-links.html
Post a Comment