చిత్రం : ఊసరవెల్లి (2011)
రచన : రామజోగయ్య శాస్త్రి. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : అద్నాన్ సామి.
**************
పల్లవి :
నేనంటే నాకు చా లానే ఇష్టం - నువ్వంటే ఇంకా ఇష్టం
ఎచోటైనా ఉన్నా నీకోసం - నా ప్రేమ పేరు నీలాకాశం
చెక్కిళ్ళు ఎరుపయ్యే సూరీడు చూపైన - నా చేయి దాటందే నిను తాకదే చెలి
ఎక్కిళ్ళు రప్పించే ఏ చిన్ని కలతైనా - నా కన్ను తప్పించి
నను చేరదే చెలి చెలి చెలీ // నేనంటే నాకు //
చరణం 1 :
వీచే గాలీ నేను పోటీ పడుతుంటాం - పీల్చే శ్వాసై నిన్ను చేరేలా?
నేలా నేనూ రోజూ సర్డుకపోతుంటాము - రాణీ పాదాలు తలమోసేలా
పూలన్నీ నీ సొంతం - ముళ్ళన్నీ నాకోసం
ఎండల్ని దిగమింగే నీడనై ఉన్నా - ఏ రంగు నీ నేస్తం అదేగా నా నేస్తం
నీ నవ్వుకై నేను రంగు మార్చనా // నేనంటే నాకు //
చరణం 2 :
చేదు బాధలేని లోకం నేనవుతా - నీతో పాటై అందులో ఉంటా
ఆటా పాటా ఆడే బొమ్మై నేనుంటా - నీ సంతోషం పూచీ నాదంటా
చిన్నారి పాపలకూ చిన్నారి ఎవరంటే - నీవంక చూపిస్తా అదుగో అనీ
ప్రియాతి ప్రియమైన ప్రయాణం ఏదంటే - టకాలని చెప్పేస్తా నీతో - ప్రేమనీ.. // నేనంటే నాకు //
No comments:
Post a Comment