Thursday, June 25, 2015

We want - Rotate keys in blog tools

బ్లాగుల్లో - టపాలు వ్రాసేటప్పుడు అవసరమున్నచోట ఆ విషయానికి సంబంధించిన ఫోటోలు కూడా అప్లోడ్ చేస్తుంటాం.. ఇది బ్లాగర్స్ అందరికీ తెలిసిన విషయమే. అయితే కొన్నిసార్లు ఆ ఫొటోస్ అప్లోడ్ చేస్తుంటే అవి ఎటువైపేనా 90 డిగ్రీల కోణంలోకి వంపు తిరిగి ఉంటాయి. పోస్ట్ చేశాక చూస్తే - ఆ ఫొటోస్ ని చూడటానికి ఎటువైపైనా తలవాల్చి, వాటిని చూడాల్సి వస్తుంది. ఇది ఇబ్బందికరముగా ఉంటుంది. 

ఇలా రావటానికి గల కారణాలు : 
  1. ఫోటోని అలా నిలువుగానో, అడ్డముగానో తీయడం. 
  2. అలా తీసిన దాన్ని తెలీకో, తెలిసో రొటేట్ Rotate చేసి, అప్లోడ్ చెయ్యడం, 
  3. ఫోటో ఎడిటింగ్ లో ( Photo editing ) వీలుకోసమని అలా మార్చి ఎడిట్ చేసి, తిరిగి మామూలుగా మార్చడం మరచి, సేవ్ Save చెయ్యటం.. 
ఇలాంటి కారణాల వల్ల జరుగుతూ ఉంటుంది. ఇలానే కాకుండా ఆటో రొటేట్ ఆప్షన్ Auto rotate option లో కెమరా సెట్ చేసి, తీస్తే - వాటిని సిస్టం లోకి ఎక్కించి, చూస్తే అలా తేడాగా కనిపించవచ్చు, లేదా మామూలుగా కనిపించవచ్చును. కానీ బ్లాగుల్లో ఆ ఫోటోని అప్లోడ్ చేసినప్పుడు మాత్రం అది ఒరిజినల్ గా ఎలా ఉందో అలాగే అప్లోడ్ అవుతుంది. అంటే ఆ ఆటో రొటేట్ అప్పుడు పనిచెయ్యదన్నమాట. 

ఇదెలా గమనించానూ అంటే - ఈమధ్యే ఒక పోస్ట్ కి నేను చేసిన టూల్ బాక్స్ ఫోటో ఒకటి అప్లోడ్ చేస్తే - ఫోటో నా ఫోటో ఆల్బమ్ లో మామూలుగానే ఉంది. సరే అని ఆ ఫోటోని ఆ టూల్ బాక్స్ పోస్ట్ వ్రాసేటప్పుడు - అక్కడ అప్లోడ్ చేశాను. కానీ ఆ ఫోటో కుడివైపుకి వాలినట్లు ఉంది. ఆ టపా ప్రివ్యూ Preview చూస్తే ఆ ఫోటో కుడివైపుకి వాలినట్లు ఉంది. నమ్మలేకపోయా.. దాన్ని డిలీట్ చేసి, మళ్ళీ క్రొత్తగా ఎన్నిసార్లు అప్లోడ్ చేసినా అంతే. ఇలా ఎందుకు వస్తుందీ అని అన్నీ చెక్ చేసి, చూశా.. లాభం లేకపోయింది. ఏదైనా తెలీని సమస్యనేమో అనుకొని ఆగిపోయాను. 


కొద్దిరోజుల తరవాత మళ్ళీ ఆ ఫోటోని ఆ పోస్ట్ లోకి ఎక్కించా.. ఆశ్చర్యం.. మళ్ళీ అదే రిజల్ట్. ఇలా కాదనుకొని మళ్ళీ పోస్ట్ ఎడిట్ లోకి వెళ్ళి, Insert image టూల్ ని నొక్కి, వచ్చిన మెనూలో Upload క్రిందన ఉన్న Choose files బటన్ ని నొక్కి, ఆ ఫోటో ఉన్న పేజీ తెరిచా. ( నిజానికి అన్ని ఫొటోస్ ఇలాగే అప్లోడ్ చేస్తాం.. తెలీని వారికి చెప్పాను ) ఆ పేజీలోని ఆ ఫోటోని OK చేసి, మౌస్ మీదున్న కుడి బటన్ ని నొక్కితే - మెనూ వచ్చింది. అందులో ఉన్న Rotate counter clockwise లేదా Rotate clockwise ని ఎన్నుకొని, ఆ ఫోటో యాంగిల్ మార్చాను. ( క్రింద ఫోటోలో ఎర్రని బాణం గుర్తు వద్ద ) అలా మార్చటం ఎక్కువై, ఈసారి ఎడమవైపునకు వాలినట్లు వచ్చింది. మళ్ళీ ప్రివ్యూ చూస్తే అలాగే ఉంది. ఓహో!.. ఇక్కడ అప్లోడ్ బాక్స్ లో మనం అప్లోడ్ చేసే ఫోటో ఎలా కనిపిస్తుందో, దాన్ని పోస్ట్ చేస్తే మన బ్లాగ్ లో అదే యాంగిల్ లో అప్లోడ్ అయ్యి, కనిపిస్తుందన్నమాట. 




అసలు విషయం అర్థమయ్యాక - ఇక ఇమేజ్ లని ఎలా అప్లోడ్ చెయ్యాలో తెలిసింది. మళ్ళీ ఆ ఫోటో సరిచేసి, అప్లోడ్ చేశా.. ఈసారి సరిగ్గా సెట్ అయ్యింది. పోస్ట్ లో సరిగ్గా వచ్చిందా ఫోటో. ( లింక్ : http://achampetraj.blogspot.in/2015/06/my-creativity-tool-box.html

ఇదంతా చెప్పటానికి గల కారణం ఏమిటంటే : బ్లాగుల్లో ఒక ఫోటో అప్లోడ్ చేశాక, అది తలవాల్చి చూసేలా కనపడితే దాన్ని సరి చెయ్యటానికి ఫోటో రొటేట్ కీస్ Photo rotate keys లేకపోవడం. చాలా సైట్స్ లలో ఈ సదుపాయం ఉంటుంది. కానీ బ్లాగ్ లలో ఈ సదుపాయం నాకు కనిపించలేదు. ఈ మీటల్ని బ్లాగర్ వారు - బ్లాగర్స్ కి అందిస్తే ఎంతో బాగుంటుందని చెప్పటానికి ఈ పోస్ట్. 


No comments:

Related Posts with Thumbnails