బ్లాగుల లోని టపాలు చదివాక, మనం అభినందిస్తూనో, విమర్శిస్తూనో లేక సూచనలు చెయ్యాలనుకోనో - కామెంట్స్ పెడుతుంటాం. అట్టి కామెంట్స్ పెట్టాక, మనకి తిరుగుసమాధానం / లేక ఆ బ్లాగర్ చూశాడా - ఏమైనా రిప్లై Reply ఇచ్చారా అంటూ ఆ బ్లాగ్ పోస్ట్ కి రావటం జరుగుతూ ఉంటుంది.( ఇలా వస్తుంటే ఆ పోస్ట్ కి వీక్షకులు viewers పెరుగుతూనే ఉన్నట్లు ఆ బ్లాగ్ వీక్షకుల కౌంటర్ పెరిగిపోతూనే ఉంటుంది. అది వేరే సంగతి )
తిరుగు సమాధానం ఇచ్చారేమోనని - ఆ బ్లాగ్ పోస్ట్ ని మాటిమాటికీ చూడటం, రిప్లై లేకుంటే ఉస్సూరుమనుకుంటూ ఆ పేజీ క్లోజ్ చెయ్యాల్సి రావటం మనకందరికీ అనుభవమే. అలాకాకుండా - ఆ బ్లాగ్ ని నిర్వహిస్తున్నవారు జవాబు ఇచ్చినప్పుడే మనకి తెలిసేలా ఏర్పాటు ఉంటే - అప్పుడే ఆ బ్లాగ్ పోస్ట్ కి వెళ్ళి, ఏమిటా ప్రతి సమాధానం ఇచ్చారు అని చూసుకోనేలా ఉంటే బాగుండును అని అనుకుంటున్నారా ? అయితేనేం.. అలాంటి ఏర్పాటు ఉండనే ఉంది. దీన్ని చాలామంది ( తెలీక ) పాటించరు. ఇలా తెలుసుకోవడం చాలా సింపుల్.
బ్లాగ్ పోస్ట్ చూశాక, ఆ పోస్ట్ క్రిందన ఉండే టూల్స్ లలో ఉండే Post a comment ని నొక్కి, ఆ పోస్ట్ మీద ఏర్పడ్డ మన అనుభూతి / భావాన్ని / సూచన / విమర్శని పెడతాం. అలా పెట్టాక ఈ క్రింది ఫోటోలో చూపెట్టినట్లుగా - ఎర్రని బాణం గుర్తు వద్ద చూపెట్టినట్లుగా ఉండే - Notify me ప్రక్కన ఉండే చిన్నగడిలో టిక్ చేస్తే చాలు. ఆ కామెంట్ బాక్స్ పైన మనకి యే మెయిల్ అడ్రస్ కి రిప్లై నోటిఫికేషన్ Reply notification వస్తుందో ఆ మెయిల్ అడ్రస్ కనిపిస్తుంది. ఇక అంతే. ఆ కామెంట్ ని పోస్ట్ చేశాక, అవతలి బ్లాగర్ దాన్ని చూసి, మనకి రిప్లై ఇచ్చాక - వెంటనే ఆ మెయిల్ ఐడీకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. అక్కడ ఇచ్చిన లింక్ ద్వారా నేరుగా ఆ బ్లాగ్ పోస్ట్ కామెంట్స్ బాక్స్ కి వచ్చి, రిప్లై చూసుకోవచ్చును.
ఇదే కాకుండా ఆ పోస్ట్ కి వచ్చే ఇతరులు పెట్టే కామెంట్స్ కీ, వాటికి ఆ బ్లాగర్ ఇచ్చే సమాధానాలకి కూడా ఇలాగే మన మెయిల్ ఐడీకి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి.
Notify me |
No comments:
Post a Comment