" వెయ్యోవసారి విజయం సాధించిన నేను, తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు చేసిన ప్రయోగాల్లో - నేను ఏమి చెయ్యకూడదో తెలుసుకున్నాను.." థామస్ అల్వా ఎడిసన్
ఒకటి క్రొత్తగా అన్వేషించి, కనుగొనే ప్రయత్నాలలో - మనం ఎన్నెన్నో దారుల్లో ప్రయాణించాల్సివస్తుంది. చేసిన ప్రతి విఫలయత్నం వెళ్ళిన దారి మన లక్ష్యాన్ని చేరుకుంటుందో లేదో తెలిసిపోతుంది. అలాని ఆ దారుల్లో వెళ్లకూడదని కాదు. ఆ దారి గుండా వెళ్ళితే - ఏమి వస్తుందో ఖచ్చితముగా తెలుస్తుంది. అది మిగిలిన వారికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది. అలా ఎన్నెన్నో దారుల్లో వెళ్ళితే - కొన్ని దారులు కాసింత దగ్గరగా మన లక్ష్యాన్ని చేరుకుంటాం. మన ప్రయత్నాలని సరిగ్గా విశ్లేషించుకుంటూ వెళితే - లక్ష్యాన్ని చేరుకుంటాం.
ఈ విషయం ఒక్క ప్రయోగాలలోనే కాదు.. జీవితములో అనేకానేక సందర్భాలల్లో ఉపయోగపడుతుంది.
No comments:
Post a Comment