http://achampetraj.blogspot.in/2014/07/orkut-2.html తరవాయి భాగం..
తమ సోషల్ సైట్ మూసివేస్తున్నట్లు ఆర్కుట్ వారు ( గూగుల్ ) సభ్యులందరికీ మెయిల్ పెట్టారు అని విన్నాను. ఈ విషయం నా సోషల్ సైట్ మిత్రుడు మంజు చెప్పగా విన్నాను. అస్సలు మూసివేస్తున్నారు అనే విషయమూ వినడమూ కూడా అప్పుడే. వినగానే షాక్ అయ్యాను. తనే అన్నాడు - వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చనీ.. సరే చూద్దాం అన్నాను.
నా మెయిల్ బాక్స్ చెక్ చేశాను. అలాంటి మెస్సేజ్ ఏదీ లేదు. మరి కొద్దిరోజులు ఎదురు చూశా.. ఊహు. రాలేదు. ఇలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలీదు. నా స్నేహితురాలు తనకి వచ్చిన మెయిల్ ని నాకు ఫార్వర్డ్ చేస్తే, అది చూసి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకొని, అలా నా ప్రొఫైల్ అంతా డౌన్లోడ్ చేసుకున్నాను. తనకి ధన్యవాదములు.
ఇప్పుడు మీకు - మీరు కూడా మీ మీ ఆర్కుట్ అకౌంట్ ని ఎలా ఆర్కైవ్ గా మార్చుకొని, ఒక ఫోల్డర్ లా మీ కంప్యూటర్ లోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చెబుతున్నాను. వాటిని మీరు శ్రద్ధగా అనుసరించండి.
ఆర్కుట్ కి వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైనదని ఆ సైట్ వారి ప్రకటన.
ఇందులో సభ్యులకి కొన్ని సూచనలు ఇంగ్లీష్ లో ఇచ్చారు.
సెప్టెంబర్ 30, 2014 న ఆ సైట్ ని మూసేస్తున్నామని చెప్పారు. అంతలోగా ఆ సైట్లోకి ప్రవేశం, అందులోని ఆటలు ఆడుకోవడం, పోస్ట్స్ వెయ్యడం... అంతా ఎప్పటిలా మామూలుగానే చేసుకోవచ్చును. గూగుల్ వారి Google+ లోకి ఈ ఆర్కుట్ లోని ఫోటో ఆల్బమ్స్ అన్నీ ఎక్స్ పోర్ట్ ( కాపీ లా ) చేసుకోవచ్చును. అలాగే మన ఆర్కుట్ ప్రొఫైల్, స్క్రాప్స్, టెస్టిమోనియాల్, కమ్యూనిటీ లలో వేసిన పోస్ట్స్ లాంటివన్నీ గూగుల్ టేక్ అవుట్ ని వాడి మన కంప్యూటర్ లలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఇలా సెప్టెంబర్ 30, 2014 వరకు మాత్రమే చేసుకో వీలు ఉంది. ఆ తరవాత ఇక వీలు కాదు. ఈ విషయాన్ని సభ్యులు బాగా గుర్తు పెట్టుకోవాలి.
30, సెప్టెంబర్ 2014 తరవాత ఏమవుతుంది ? అనే సందేహం / కుతూహలం ఉంటే దానికీ అక్కడ సమాధానం ఇచ్చారు.
ఆ రోజు తరవాత నుండీ ఆర్కుట్ లోకి లాగిన్ అవలేము. అంటే మన ప్రొఫైల్ ని మనం చేరుకోలేం.. ఆ లాగిన్ ఆప్షన్ తీసేస్తారు. మన అకౌంట్ లోకి ఇక వెళ్ళలేం. ఇక మన ప్రొఫైల్ కనిపించదన్నమాట. అలాగే మన ఫోటో ఆల్బమ్స్ ని గూగుల్+ ( గూగుల్ ప్లస్ ) లోకి మార్పిడి / కాపీ / ఎక్స్ పోర్ట్ చేసుకోలేమన్నమాట. వాటిని కాపీ చేసుకోలేక పోతే ఇక ఆ ఫొటో ఆల్బమ్స్ ని ఎన్నడూ చూడలేం. అలాగే ఆ సైట్ లోని ఆటలు గానీ, అప్లికేషన్స్ నీ ఎన్నడూ వాడుకోలేము. కమ్యూనిటీలలోని పోస్టింగ్స్ మాత్రం అలాగే కమ్యూనిటీ ఆర్కైవ్ గా ఉండిపోతాయి. కేవలం చూడగలిగేలా ఉండిపోతాయి. ఇక్కడ పబ్లిక్ కమ్యూనిటీ సెట్టింగ్స్ ఉన్నవి మాత్రమే అందరికీ కనిపిస్తాయి ఇక.
సో, మీకు ఆర్కుట్ అకౌంట్ ఉంటే ఇకనైనా త్వరపడండి.
మీరు మీ అకౌంట్ ని కాపీ చేసుకోవాలీ అంటే ఇలా చెయ్యండి.
క్రింది ఫోటోలోని 1 వద్ద చూపినట్లుగా - ముందుగా మీరు ఒక టాబ్ లో - మీ గూగుల్+ అకౌంట్ లో సైన్ ఇన్ అవ్వండి. ( మీ గూగుల్+ అకౌంట్ మెయిల్ ఐడీ & పాస్ వర్డ్ సహాయన సైన్ ఇన్ అవ్వండి ) లేదా ఈ లింక్ నొక్కండి
ఆ గూగుల్+ అకౌంట్ ఉండటం తప్పనిసరి. ఆర్కుట్ ఖాతాలోని ఫోటోలూ, ఫోటో ఆల్బమ్స్ ని కాపీ / ఎక్స్ పోర్ట్ చేసుకోవాలంటే మీకు ఖచ్చితముగా గూగుల్+ అకౌంట్ ఉండి తీరాలి. లేకుంటే డౌన్లోడ్ వీలు కాదు. గూగుల్ + అకౌంట్ మీకు గనుక లేకపోతే మీరు తగు వివరాలను ఇచ్చి, వెంటనే క్రియేట్ చేసుకోండి. ఓకే..
ఇప్పుడు మీరు మీ గూగుల్ ఖాతాని తెరచి, సైన్ ఇన్ అయ్యారు. ( ఫోటో ఆల్బమ్స్ డౌన్ అయ్యే వరకూ అలాగే సైన్ ఇన్ అయ్యి ఉండాలి )
ఇప్పుడు 2 వద్ద నున్న ఈ లింక్ ని నొక్కండి. లింక్ :
ఇది నొక్కగానే మీకు ఇలా క్రింద చూపబడిన చిత్రం లోని మాదిరిగా పేజి ఓపెన్ అవుతుంది. ఇందులో ఉన్నవన్నీ మీరు - మీ ఆర్కుట్ లో అప్లోడ్ చేసిన ఫొటోస్ ( ఫోటో ఆల్బమ్స్ ) అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కనిపించే ఆల్బమ్స్ అన్నీ నావి.
అలా ఆల్బమ్స్ అన్నీ కనిపించాక - ఈ క్రింది ఫోటోలో వృత్తాకారములో చూపినట్లుగా, Select all వద్ద మౌస్ తో క్లిక్ చెయ్యాలి.
అప్పుడు అక్కడ ఉన్న ఆల్బమ్స్ అన్నీ ఎర్రని రంగులో ఉన్న చదరపు బార్డర్ గల గడులుతో కనిపిస్తాయి. ( క్రింది ఫోటో చూడండి ) అలా ఎర్రని డబ్బాలతో మీ ఆల్బమ్స్ కనిపిస్తే అవి అన్నీ సెలెక్ట్ అయినట్లు గా అనుకోవాలి.
ఇక్కడ అన్నీ కాకుండా కొన్ని లేదా, ఒక్కొక్క ఆల్బమ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ అన్నీ సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచి పద్ధతి. ఎలా అంటే - తరవాత తీరుబాటుగా అన్నీ చూసుకొని, పనికి రావని అనుకుంటే ఆయా ఆల్బమ్స్ ని డిలీట్ చేసుకోవచ్చు. ఇలా కాపీ చేసుకుంటే డిస్క్ స్పేస్ కీ, డౌన్ లోడ్ కీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు.. అంతా ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ. గడువు ముగిసాక ఆల్బమ్స్ కావాలంటే కుదరదు కాబట్టి ఇలా మీకు సూచన చేస్తున్నాను.
ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే : ఈ ఫోటో ఆల్బమ్స్ అన్నీ Visible to you అనే ఆల్బం సెట్టింగ్ లో గూగుల్+ లో సేవ్ అవుతాయి. అంటే మిత్రులూ, వీక్షకులకీ, ఎవరికీ కనిపించక కేవలం మనకి మాత్రమే కనిపించేలా అక్కడికి ఎక్స్ పోర్ట్ అవుతాయి. కాబట్టి, అన్నీ స్వేచ్చగా అక్కడికి అప్లోడ్ చేసుకోమని సలహా ఇస్తున్నాను.
ఇప్పుడు ఈ క్రింది చిత్రములో కుడివైపు మూలన కనిపిస్తున్న Import Selected అన్న ఎరుపు రంగులో ఉన్న బటన్ 5 ని నొక్కాలి.
అలా నొక్కిన వెంటనే మీకు ఇలా క్రిందన ఫోటోలో మాదిరిగా కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తున్న ఆల్బమ్స్ అన్నింటి మీద Waiting అని గోధుమ రంగులో కనిపిస్తుంది. అంటే అవి ఎక్స్ పోర్ట్ అవటానికి క్యూలో ఉన్నాయని అర్థం చేసుకోవాలి.
ఒక్కో ఆల్బమ్ అలా ఎక్స్ పోర్ట్ అవటానికి కొద్ది క్షణాలు మాత్రమే పడుతుంది. నాకైతే 100 ఫోటోలు ఉన్న ఆల్బమ్ ఒక్కంటికి 5 ( ఐదు ) సెకనుల సమయం పట్టింది. మొత్తం ఆల్బమ్స్ అన్నీ అవటానికి ( దాదాపు 49 ఆల్బమ్స్ ) 6 నిమిషాల సమయం తీసుకున్నది అంతే..
ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఒకటుంది. ఆ ఆల్బమ్స్ అన్నీ క్రింద నున్న ఆల్బమ్స్ నుండి అప్లోడ్ అవటం మొదలవుతాయి. అంటే చివరలో ఉన్న ఆల్బమ్ - మొదటగా గూగుల్+ కి అప్లోడ్ అవటం మొదలవుతుందన్న మాట. గూగుల్+ కి అప్లోడ్ అయిన ఆల్బమ్ మీద ఆకుపచ్చని రంగులో Uploaded అని వస్తుంది. అప్లోడ్ అవుతున్న వాటి మీద నీలిరంగులో ఆ ఆల్బం ఎంతవరకు కాపీ చెయ్యబడిందో ( అప్లోడ్ స్టేటస్ Upload Status ) చూపిస్తుంది. ఇది ఎలా అన్నది ఈ క్రింది ఫోటోలో చూడవచ్చును.
ఇలా అన్నీ అప్లోడ్ అయ్యాక - ఈ క్రింది విధముగా పసుపు రంగులో Done అని వస్తుంది. అలాగే మీ ఆల్బమ్స్ అన్నీ ఇంపోర్ట్ చెయ్యబడి, అవన్నీ మీకు మాత్రమే కనిపించేలా సెట్టింగ్స్ లో ఉన్నాయని మెస్సేజ్ కనిపిస్తుంది. అలాగే అక్కడి నుండే ఆ గూగుల్+ లోకి క్రొత్తగా అప్లోడ్ అయిన అల్బుమ్స్ ని నేరుగా చేరుకోవటానికి లింక్ కూడా అక్కడే కనిపిస్తుంది. దాన్ని నొక్కి ఒకసారి మీ అకౌంట్ లోని క్రొత్తగా అప్లోడ్ అయిన ఆల్బమ్స్ ని చెక్ చేసుకోవచ్చును.
ఆ మెసేజ్ ఇలా, ఈ క్రింది విధముగా ఉంటుంది.
ఇలా అప్లోడ్ చేసుకొనేటప్పుడు - కొన్ని ఆల్బమ్స్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అప్లోడ్ అవక, Error ని చూపిస్తాయి. ఆయా ఆల్బమ్స్ మీద ఎర్రర్ అని వస్తుంది. అప్పుడు గాభరా పడాల్సిన అవసరం లేదు. ఈ క్రింద ఒక ఆల్బమ్ అలాగే అయ్యింది చూడండి.
అప్పుడు మళ్ళీ ఆల్బమ్ ని సెలెక్ట్ చేసి, ఎరుపు రంగు బార్డర్ గడి వచ్చేలా చేసి, Import Select దాని మీద నొక్కాలి. అప్పుడు అవి మళ్ళీ అప్లోడ్ అవుతాయి.
ఇలా మీ ఆర్కుట్ లోని ఫొటోస్ ని గూగుల్+ లోకి ఎక్స్ పోర్ట్ చేసుకున్నాక, మీ ప్రొఫైల్ లోని కామెంట్స్, టెస్టిమొనియల్స్ ... అన్నీ ఎలా కాపీ చేసుకోవాలో ఇంకొక దానిలో తెలుసుకుందాం.
ఇలా చెయ్యటం అనేది - మీ స్వంత కంప్యూటర్ లోనైనా గానీ , నెట్ సెంటర్ లో ఉన్న సిస్టం లో అయినా చేసుకోవచ్చును. కాకపోతే నెట్ సెంటర్ లో ఉన్న సిస్టం లోకి డౌన్ లోడ్ చెయ్యటం మాత్రం వద్దు. అలా చేస్తే మీకే చాలా ఇబ్బంది. సో, మీ స్వంత సిస్టం లోన ఇలా చెయ్యటం చాలా మంచిది.