Wednesday, May 14, 2014

Messages Delete in Facebook

ఫేస్ బుక్ లో అప్పుడప్పుడు ఎవరెవరో మనకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తులు - మనకేమి సంబంధం లేని విషయాల్ని మనకి మెసేజ్ చేస్తుంటారు. సాధారణముగా అవి చాట్ కి రమ్మనో, లేదా డబ్బుకి సంబంధించినవో అయి ఉంటాయి. ఇలాంటివి లెక్కలేని మందికి పంపించటముతో - ఫేస్ బుక్ సర్వర్స్ వాటన్నింటినీ స్పాం లోకి పంపిస్తాయి. మనం వాటికి రెస్పాన్స్ ఇస్తే, ఇక అలాంటివి మరిన్ని వస్తుంటాయి. చాటింగ్ కి వెళితే, ఏవేవో బాధలు చెప్పి, డబ్బు సాయం చెయ్యమనే వాళ్ళు ఎక్కువ. సో, వాటికి రెస్పాన్స్ ఇచ్చి, బాధలు తెచ్చుకోకండి. 

ఇలాంటివాటిని ఎలా డిలీట్ చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇలాంటి మెస్సేజులు రాగానే - ఆ మెస్సేజెస్ పంపిన ప్రొఫైల్ ని బ్లాక్ చెయ్యండి. ఆ తరవాత ఆ మెస్సేజెస్ ని డిలీట్ చెయ్యండి. 

ముందుగా ఒక సాంపిల్ మెస్సేజ్ ని ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ తను చెప్పిన విషయాన్ని ఎడిట్ చేశాను. ఆ మెస్సేజ్ ని పంపిన వారిని బ్లాక్ చేస్తే  లేదా ఫేస్ బుక్ వారే ఆ అకౌంట్ ని బ్లాక్ చేస్తే వారి ప్రొఫైల్ పేరు వద్ద Facebook User అని వస్తుంది. అలా వస్తే వారు బ్లాక్ లో ఉన్నట్లే. మీకు వారు మెస్సేజ్ పంపాలన్నా లేదా మీరే వారికి మెస్సేజ్ పంపాలన్నా పంపలేకపోతారు. 


ఇలాంటి మెస్సేజ్ లని మీ చాట్ లోంచి తీసేయ్యాలీ అనుకుంటున్నారా ? అలా అయితే చాట్ లోన లేదా మెస్సేజ్  బాక్స్ ఓపెన్ చెయ్యండి. ఓపెన్ చేశాక ఆ మెస్సేజ్ ని తెరవండి. అలా ఆ మెస్సేజ్ ని తెరిచాక, మీకు ఇలా మెస్సేజ్ బాడీ కనిపిస్తుంది. అప్పుడు మీరు పైన ఉన్న New Message, Actions లలో Action ని దాని ప్రక్కన ఉన్న చిన్న త్రికోణాన్ని నొక్కి, తెరవండి. ఇప్పుడు మీకు ఒక డ్రాప్ మెనూ కనిపిస్తుంది. అందులో ఉన్న Delete Messages ని సెలెక్ట్ చెయ్యండి. 


ఇప్పుడు చాట్ / మెస్సేజ్ బాడీలోని మెస్సేజెస్ ప్రక్కన ఒక చిన్న డబ్బా కనిపిస్తుంది. ఎన్ని మెస్సేజెస్ ఉంటే అన్నింటి ప్రక్కనా అలా కనిపిస్తుంది. మనకి ఏ ఏ మెస్సేజెస్ ని డిలీట్ చెయ్యాలనుకుంటున్నామో వాటిలో కర్సర్ ద్వారా నొక్కి, టిక్ చెయ్యాలి. ఇప్పుడు క్రింద ఉన్న   Delete  ని నొక్కాలి. మనం ఏవైతే ఎంచుకున్నామో ఆయా మెస్సేజులన్నీ డిలీట్ అయిపోతాయి. 


No comments:

Related Posts with Thumbnails