Friday, May 16, 2014

ఫేస్ బుక్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఫేస్ బుక్ లో - మీ జన్మదినాన మీ మిత్రులు శుభాకాంక్షలు చెబుతుంటారు. అవన్నీ మీ టైం లైన్ మీద కనిపిస్తాయి. సర్వర్ బీజీ వల్ల - ఒక్కోసారి కొన్ని కొన్ని కారణాల వల్ల కొందరి విషెస్ కనిపించవు. ఆలాంటి గ్రీటింగ్స్ చూడకపోయేసరికి - వారు మనకి విషెస్ చెప్పలేదేమో అని అనుకుంటాం. కానీ వారు ఆపాటికే చెప్పే ఉంటారు. అలాంటి వాటిని ఫేస్ బుక్ సర్వర్ - వాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి, వరుసగా చూపిస్తుంది. ఇలా చూపెట్టడం ఫేస్ బుక్ ప్రత్యేకత. 

ఈ క్రింది ఎడిట్ చేసిన స్క్రీన్ షాట్ భాగాన్ని చూడండి. నా పుట్టిన రోజున అప్పటికే 43 మంది స్నేహితులు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇక్కడ ఒకటే మీకు కనిపిస్తున్నది. దాని క్రిందన ఎరుపు రంగు బాణం గుర్తు వద్ద మీకు మిగిలినవి ఉన్నాయని చూపిస్తున్నది. దాని ప్రక్కన ఉన్న చిన్న త్రికోణాన్ని కర్సర్ తో నొక్కితే, మిగిలినవన్నీ కనిపిస్తాయి. 

మీకొచ్చే ప్రతి శుభాకాంక్షలకి ధన్యవాదములు చెప్పడం మరచిపోకండి. అలా చెప్పడం కనీస సంస్కారం. అలా చెయ్యకుంటే మీరు స్నేహితుడిగా ఉండే అవకాశాలను కోల్పోయినట్లే లెక్క. 


No comments:

Related Posts with Thumbnails