Friday, May 2, 2014

Facebook fallowers

ఫేస్ బుక్ లో - కొన్ని ప్రొఫైల్స్ కి కొన్ని వందల మంది ఫాలోవర్స్ ఉంటారు. ఇలా వారి ప్రొఫైల్స్ ని చూసినప్పుడు వారి ప్రొఫైల్ ఫోటో క్రింద అబౌట్ మీ - దిగువగా కనిపిస్తుంది. ఫాలోవర్స్ అంటే - వారి స్టేటస్ మెస్సేజెస్, ఫొటోస్, వీడియోస్... నచ్చి, ఇకనుండీ వారు చేసే పోస్ట్స్ అన్నీ తమకీ వెంటనే తమ హోం పేజీలో కనిపించేలా చేసుకోవడం అన్నమాట. అంటే వారు ఏదైనా పోస్ట్స్ చెయ్యగానే, మనకీ ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే - ఆ పోస్ట్ వద్దకి నేరుగా వెళతాం. ఇలా ఫాలోవర్ గా ఉంటే - వారు పబ్లిక్ ఆప్షన్ లో పెట్టే పోస్ట్స్ ని మాత్రమే మనం చూడగలం. ఫ్రెండ్స్, ప్రైవేట్, సెలెక్టెడ్ పర్సన్స్ ఆప్షన్స్ లలో పెట్టే పోస్ట్స్ కనిపించవు. ఒకరకముగా చెప్పాలీ అంటే - వారికి స్నేహితులం కాకున్నా, పబ్లిక్ ఆప్షన్ లో పెట్టే పోస్ట్స్ ని మాత్రమే మనం చూడగలుగుతాం. మనం వీటికి లైక్, కామెంట్, షేర్... చెయ్యొచ్చు. 

ఫాలోవర్ లిస్టు చూస్తే - కొన్ని వందలూ, వేల మంది ఉంటారు. ఆహా..! ఎంత గొప్పవారు.. వీరికి ఫాలోవింగ్ బాగుంది అని అనుకుంటాం. నిజానికి అందులో నిజమైన ఫాలోవర్స్ చాలా తక్కువమంది. ఆ ఆప్షన్ తెలుసుకొని, ఫాలో అయ్యేవారు చాలా కొద్దిమందే. మరి ఆ సంఖ్యలు నిజం కాదంటారా ? అని అడిగితే - అందులో ఫ్రెండ్ రిక్వెస్ట్స్ ఎక్కువ. వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్స్ ని - అంగీకరించకుండా అలానే ప్రక్కన అట్టిపెడితే - అలా ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతుంది. అదీ సంగతి. 

ఇప్పుడు మీరు పెట్టే ఫ్రెండ్ రిక్వెస్ట్ తను చూడాలంటే - ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతూ, అలాగే వారికి ఒక మెస్సేజ్ కూడా పెట్టాలి. ఈ మెసేజ్ ఆప్షన్ ( తెరచిఉంటే ) ఎనేబుల్ చేసి ఉంటే అలా పెట్టండి. లేకుంటే గుంపులో గోవిందలా ఉండిపోతారు. 




No comments:

Related Posts with Thumbnails