ఫేస్ బుక్ లో మనకి వచ్చిన మెస్సేజెస్ నీ, చాట్ నీ పూర్తిగా తొలగించాలని అనుకుంటున్నారా ? ఆ చాట్ లోని మొత్తం మెస్సేజెస్ నీ, ఫొటోస్, లింక్స్... ఇక మనకి భవిష్యత్తులో ఎప్పుడూ ఉపయోగపడదు అనుకుంటే - అన్నింటినీ శాశ్వతంగా తొలగించాలీ అనుకుంటే ఇలా చెయ్యండి.
ముందుగా మీ ప్రొఫైల్ లోని చాట్స్ ని ఓపెన్ చెయ్యండి. అందులో యే మెస్సేజెస్ / చాట్ ని తొలగించాలి అని అనుకుంటున్నారో దాన్ని తెరవండి.
ఇప్పుడు ఆ చాట్ కి పైన కుడి మూలన ఉన్న New Messages, My Actions లలో My Actions ని ఎన్నుకోండి.
దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే, మీకు ఈ క్రింద ఫోటోలో చూపించిన విధముగా ఒక డ్రాప్ మెనూ వస్తుంది.
అందులో మీరు Delete Conversation ని ఎన్నుకోండి.
ఇప్పుడు మనకి Delete This Entire Conversation? అనే ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
అందులో Delete Conversation, Cancel అనే ఆప్షన్స్ కనిపిస్తాయి.
అందులో Delete Conversation ని నొక్కితే సరి.
ఆ చాట్ / మెస్సేజెస్ మొత్తం డిలీట్ అయిపోతాయి.
No comments:
Post a Comment