Saturday, May 31, 2014
Friday, May 30, 2014
Wednesday, May 28, 2014
difference between the app and mobile website
difference between the app and mobile website pl
మొబైల్ ఆప్ కీ, మొబైల్ వెబ్సైట్ కీ మధ్య చాలా తేడా ఉంది. వెబ్సైట్ అనేది ఒక కంపనీ యొక్క వివరాలు, అది అందిస్తున్న అన్నిరకాల సేవలూ, ఏవైతే అందరికీ తెలియాలని అనుకుంటున్నారో అవన్నీ తెలియ చెయ్యటానికి ఏర్పరిచేదే వెబ్సైటు. ఉదాహరణకి : నోకియా, సాంసంగ్ కంపనీల వెబ్సైట్స్.
ఆప్ అంటే అప్లికేషన్ కి సంక్షిప్త రూపం. అప్లికేషన్ వలన ఒక నిర్దిష్టమైన పనిని / సేవలని మనం పొందవచ్చును. అది ఒక విషయం మీద అపరిమిత సేవని పొందేందుకై ఏర్పరిచిన సాఫ్ట్వేర్ ప్రోగ్రాం. దీనివలన మనం ఆ ఆప్ ని ఏ పనికోసం తయారు చేశారో, ఆ పనిని సులభముగా ఆ ఆప్ ని వాడి పొందుతాం. ఉదాహరణగా : వీడియో ప్లేయర్ ఆప్. దీనివలన వీడియోలని మనం ప్లే చేసుకొని చూడగలుతాం. కానీ వేరేవాటికోసం వాడలేము.
Monday, May 26, 2014
Sunday, May 25, 2014
Saturday, May 24, 2014
Thursday, May 22, 2014
Quiz
ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి.
మీరొక బస్ లోకి ఎక్కగానే - ఆ బస్ లో 7 ( ఏడుగురు ) అమ్మాయిలు ఉన్నారు. వారి చేతుల్లో ఉన్న సంచీలలో 7 ( ఏడు ) తల్లి పిల్లులు ఉన్నాయి. ఒక్కో తల్లి పిల్లికి 7 ( ఏడు )పిల్ల పిల్లులు ఉన్నాయి. ప్రతి పిల్లికీ నాలుగు (4) కాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆ బస్ లో ఉన్న మొత్తం కాళ్ళు ఎన్నో లెక్కించండి.
.
.
.
.
.
.
బస్ లో ఉన్న అమ్మాయిలు 7 x 2 కాళ్ళు = 14
(+) తల్లి పిల్లులు 7 x 4 కాళ్ళు = 28
(+) 7 పిల్లి పిల్లలు x 7 గురి వద్ద x 7 కాళ్ళు = 196
-------------------------------------------------
మొత్తం కాళ్ళు = 238
(+) ఆ బస్ లో అడుగుపెట్టిన మీ కాళ్ళు = 2
-------------------------------------------------
ఇప్పుడు బస్ లో ఉన్న మొత్తం కాళ్ళు = 240
Sunday, May 18, 2014
Delete conversation in Facebook
ఫేస్ బుక్ లో మనకి వచ్చిన మెస్సేజెస్ నీ, చాట్ నీ పూర్తిగా తొలగించాలని అనుకుంటున్నారా ? ఆ చాట్ లోని మొత్తం మెస్సేజెస్ నీ, ఫొటోస్, లింక్స్... ఇక మనకి భవిష్యత్తులో ఎప్పుడూ ఉపయోగపడదు అనుకుంటే - అన్నింటినీ శాశ్వతంగా తొలగించాలీ అనుకుంటే ఇలా చెయ్యండి.
ముందుగా మీ ప్రొఫైల్ లోని చాట్స్ ని ఓపెన్ చెయ్యండి. అందులో యే మెస్సేజెస్ / చాట్ ని తొలగించాలి అని అనుకుంటున్నారో దాన్ని తెరవండి.
ఇప్పుడు ఆ చాట్ కి పైన కుడి మూలన ఉన్న New Messages, My Actions లలో My Actions ని ఎన్నుకోండి.
దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే, మీకు ఈ క్రింద ఫోటోలో చూపించిన విధముగా ఒక డ్రాప్ మెనూ వస్తుంది.
అందులో మీరు Delete Conversation ని ఎన్నుకోండి.
ఇప్పుడు మనకి Delete This Entire Conversation? అనే ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
అందులో Delete Conversation, Cancel అనే ఆప్షన్స్ కనిపిస్తాయి.
అందులో Delete Conversation ని నొక్కితే సరి.
ఆ చాట్ / మెస్సేజెస్ మొత్తం డిలీట్ అయిపోతాయి.
Friday, May 16, 2014
ఫేస్ బుక్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఫేస్ బుక్ లో - మీ జన్మదినాన మీ మిత్రులు శుభాకాంక్షలు చెబుతుంటారు. అవన్నీ మీ టైం లైన్ మీద కనిపిస్తాయి. సర్వర్ బీజీ వల్ల - ఒక్కోసారి కొన్ని కొన్ని కారణాల వల్ల కొందరి విషెస్ కనిపించవు. ఆలాంటి గ్రీటింగ్స్ చూడకపోయేసరికి - వారు మనకి విషెస్ చెప్పలేదేమో అని అనుకుంటాం. కానీ వారు ఆపాటికే చెప్పే ఉంటారు. అలాంటి వాటిని ఫేస్ బుక్ సర్వర్ - వాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి, వరుసగా చూపిస్తుంది. ఇలా చూపెట్టడం ఫేస్ బుక్ ప్రత్యేకత.
ఈ క్రింది ఎడిట్ చేసిన స్క్రీన్ షాట్ భాగాన్ని చూడండి. నా పుట్టిన రోజున అప్పటికే 43 మంది స్నేహితులు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇక్కడ ఒకటే మీకు కనిపిస్తున్నది. దాని క్రిందన ఎరుపు రంగు బాణం గుర్తు వద్ద మీకు మిగిలినవి ఉన్నాయని చూపిస్తున్నది. దాని ప్రక్కన ఉన్న చిన్న త్రికోణాన్ని కర్సర్ తో నొక్కితే, మిగిలినవన్నీ కనిపిస్తాయి.
మీకొచ్చే ప్రతి శుభాకాంక్షలకి ధన్యవాదములు చెప్పడం మరచిపోకండి. అలా చెప్పడం కనీస సంస్కారం. అలా చెయ్యకుంటే మీరు స్నేహితుడిగా ఉండే అవకాశాలను కోల్పోయినట్లే లెక్క.
Thursday, May 15, 2014
Wednesday, May 14, 2014
Messages Delete in Facebook
ఫేస్ బుక్ లో అప్పుడప్పుడు ఎవరెవరో మనకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తులు - మనకేమి సంబంధం లేని విషయాల్ని మనకి మెసేజ్ చేస్తుంటారు. సాధారణముగా అవి చాట్ కి రమ్మనో, లేదా డబ్బుకి సంబంధించినవో అయి ఉంటాయి. ఇలాంటివి లెక్కలేని మందికి పంపించటముతో - ఫేస్ బుక్ సర్వర్స్ వాటన్నింటినీ స్పాం లోకి పంపిస్తాయి. మనం వాటికి రెస్పాన్స్ ఇస్తే, ఇక అలాంటివి మరిన్ని వస్తుంటాయి. చాటింగ్ కి వెళితే, ఏవేవో బాధలు చెప్పి, డబ్బు సాయం చెయ్యమనే వాళ్ళు ఎక్కువ. సో, వాటికి రెస్పాన్స్ ఇచ్చి, బాధలు తెచ్చుకోకండి.
ఇలాంటివాటిని ఎలా డిలీట్ చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇలాంటి మెస్సేజులు రాగానే - ఆ మెస్సేజెస్ పంపిన ప్రొఫైల్ ని బ్లాక్ చెయ్యండి. ఆ తరవాత ఆ మెస్సేజెస్ ని డిలీట్ చెయ్యండి.
ముందుగా ఒక సాంపిల్ మెస్సేజ్ ని ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ తను చెప్పిన విషయాన్ని ఎడిట్ చేశాను. ఆ మెస్సేజ్ ని పంపిన వారిని బ్లాక్ చేస్తే లేదా ఫేస్ బుక్ వారే ఆ అకౌంట్ ని బ్లాక్ చేస్తే వారి ప్రొఫైల్ పేరు వద్ద Facebook User అని వస్తుంది. అలా వస్తే వారు బ్లాక్ లో ఉన్నట్లే. మీకు వారు మెస్సేజ్ పంపాలన్నా లేదా మీరే వారికి మెస్సేజ్ పంపాలన్నా పంపలేకపోతారు.
ఇలాంటి మెస్సేజ్ లని మీ చాట్ లోంచి తీసేయ్యాలీ అనుకుంటున్నారా ? అలా అయితే చాట్ లోన లేదా మెస్సేజ్ బాక్స్ ఓపెన్ చెయ్యండి. ఓపెన్ చేశాక ఆ మెస్సేజ్ ని తెరవండి. అలా ఆ మెస్సేజ్ ని తెరిచాక, మీకు ఇలా మెస్సేజ్ బాడీ కనిపిస్తుంది. అప్పుడు మీరు పైన ఉన్న New Message, Actions లలో Action ని దాని ప్రక్కన ఉన్న చిన్న త్రికోణాన్ని నొక్కి, తెరవండి. ఇప్పుడు మీకు ఒక డ్రాప్ మెనూ కనిపిస్తుంది. అందులో ఉన్న Delete Messages ని సెలెక్ట్ చెయ్యండి.
ఇప్పుడు చాట్ / మెస్సేజ్ బాడీలోని మెస్సేజెస్ ప్రక్కన ఒక చిన్న డబ్బా కనిపిస్తుంది. ఎన్ని మెస్సేజెస్ ఉంటే అన్నింటి ప్రక్కనా అలా కనిపిస్తుంది. మనకి ఏ ఏ మెస్సేజెస్ ని డిలీట్ చెయ్యాలనుకుంటున్నామో వాటిలో కర్సర్ ద్వారా నొక్కి, టిక్ చెయ్యాలి. ఇప్పుడు క్రింద ఉన్న Delete ని నొక్కాలి. మనం ఏవైతే ఎంచుకున్నామో ఆయా మెస్సేజులన్నీ డిలీట్ అయిపోతాయి.
Tuesday, May 13, 2014
Sunday, May 11, 2014
Saturday, May 10, 2014
Thursday, May 8, 2014
Good Morning - 563
ఈ ప్రపంచం - మనం పోరాటంలో ఓడినా భరిస్తుంది కానీ, అస్సలు పోరాటమే చెయ్యకుండా గెలవాలని చూసేవాడిని క్షమించదు.
నిత్యజీవితములో అనేకానేక సమస్యలతో పోరాడాల్సి ఉంటుంది. ఆ పోరాటములో చాలాసార్లు ఓడిపోతూనే ఉంటాం. ఇలా ఓడిపోవటం అందరికీ అనుభవమే. పోరాడిన ఓడిన వారిని ఈ లోకం ఒప్పుకుంటుంది. కొండకచోట హర్షిస్తుంది కూడా. కానీ పోరాటమే చెయ్యకుండా ఎలాగైనా గెలవాలని చూసేవాడిని క్షమించలేదు.. క్షమించదు కూడా.
Wednesday, May 7, 2014
Tuesday, May 6, 2014
Good Morning - 562
సమస్యలు అందరికీ ఉంటాయి.
వాటికి పరిష్కారం చూపడం విజేతల లక్ష్యం.
సాకులు వెదకడం సరికాదు.
పైగా సమస్యలు ఇంకా పెరుగుతాయి.
సమస్యలు అనేవి ఈ ప్రపంచములో అందరికీ, అన్ని ప్రాణులకీ ఉంటాయి.. కాదు కాదు ఉన్నాయి కూడా. అవి తప్పనిసరి. వాటినుండి ఎవరూ మినహాయింపు కాదు. అన్నీ వదిలేసి, హిమాలయాల్లో ముక్కుమూసుకొని, తపస్సు చేసుకొనే మునులకు కూడా తప్పదు. పుట్టిన క్షణం నుండీ ప్రారంభం అయ్యి, మరణించేవరకూ - ఒకదానివెంట మరొకటి వరుసపెట్టి ప్రతివాటికీ వస్తూనే ఉంటాయి. కాకపోతే సమస్యల్లో హెచ్చు తగ్గులు అనేవి వారి వారి స్థాయిని బట్టి ఉంటాయి. ఈ స్థాయి అనేది అనేకానేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
ప్రతి సమస్యకీ ఒక పరిష్కారం అంటూ ఒకటి ఉంటుంది. ఈ పరిష్కారం అనేది చప్పున కనిపించదు. సమస్య ఎదురవగానే బిత్తరపోయి, బెంబేలెత్తుతాం. ఈ పరిష్కారం కోసం ఎన్నెన్నో ఆలోచనలు చేస్తాం. కానీ కొన్నింటికి చప్పున సమాధానాలు దొరకవు. చదువుకునే రోజుల్లో ఎలా అయితే లెక్కల్లో లాగా ఆ సమస్యని అర్థం చేసుకొని, విడమర్చి, ఆలోచించి, ఆ లెక్క యొక్క సమాధానాన్ని సాధిస్తామో - ఇక్కడ కూడా అలాగే సాధించవచ్చు. వినటానికి తేలికగా ఉన్నా - ఈ పాఠం చిన్నప్పుడే మనకి అవగతం అయినా, అదేమిటోగానీ పెద్దయ్యాక ఎందువల్లనో ఉపయోగించుకోం. ఇంకా సూక్ష్మంగా, ఖచ్చితముగా చెప్పాలంటే -
అసలు సమస్యలోనే ఖచ్చితముగా జవాబు ఉంటుంది.
దీన్ని దొరకబుచ్చుకుంటే - మనకో దారి కనిపిస్తుంది. దానివెంటే మన ఆలోచనలు సాగిస్తే - పరిష్కారం దిశగా వెళతాం.
చాలామంది సమస్యలకు సాకులు వెదుకుతారు. కానీ అవేవీ సమస్యకి పరిష్కారం చూపవు. సమస్యకి దూరముగా తీసుకవెళుతాయి. సమస్యనీ ఇంకా పెద్దగా చేస్తాయి కూడా. అప్పుడు సమస్య పీటముడిలా పడిపోతుంది. సాకులు చూపడం వల్ల తాత్కాలికముగా సమస్య తీవ్రత తగ్గవచ్చునేమో గానీ, సమస్య మాత్రం ఇంకా సమస్యలా మారి, కొండగా కనిపిస్తుంది. అప్పుడు దానికి పరిష్కారం వెదకడం కష్టమవుతుంది. అంతలోగా ఇంకో సమస్య వస్తుంది. అప్పుడు ఈ రెండింటినీ పరిష్కరించలేక సతమతమవుతాం. అప్పుడే " ఏమిట్రా ఈ జీవితం.. నాకే ఇలా ఎందుకవుతున్నది..? " అనే డైలమాలో పడిపోతాం. ఒకదానివెంట వచ్చే మరొకటి వచ్చే సమస్యలు ఇంకా మనల్ని బాధిస్తూనే ఉంటాయి.
సమస్యలు చిన్నగా ఉన్నప్పుడే వాటిని క్షుణంగా అర్థం చేసుకోండి. వాటిని చక్కగా విడదీయండి. ఒక్కో పొరనీ విడదీసి, నిశితముగా ఆలోచించండి. అప్పుడు అసలు సమస్య ఎక్కడుందో, దాన్ని ఎలా దిద్దుకోవాలో చక్కగా బోధపడుతుంది. చక్కని సింబాలిక్ గా చెప్పాలంటే ఉల్లిగడ్డ మాదిరిలా సమస్య ఉంటుంది. అసలు పాయ లోన ఎక్కడో ఉంటుంది. పైనవన్నీ పొరలు ఊడదీస్తే అసలు సమస్య కనిపిస్తుంది.
Monday, May 5, 2014
Saturday, May 3, 2014
Friday, May 2, 2014
Facebook fallowers
ఫేస్ బుక్ లో - కొన్ని ప్రొఫైల్స్ కి కొన్ని వందల మంది ఫాలోవర్స్ ఉంటారు. ఇలా వారి ప్రొఫైల్స్ ని చూసినప్పుడు వారి ప్రొఫైల్ ఫోటో క్రింద అబౌట్ మీ - దిగువగా కనిపిస్తుంది. ఫాలోవర్స్ అంటే - వారి స్టేటస్ మెస్సేజెస్, ఫొటోస్, వీడియోస్... నచ్చి, ఇకనుండీ వారు చేసే పోస్ట్స్ అన్నీ తమకీ వెంటనే తమ హోం పేజీలో కనిపించేలా చేసుకోవడం అన్నమాట. అంటే వారు ఏదైనా పోస్ట్స్ చెయ్యగానే, మనకీ ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే - ఆ పోస్ట్ వద్దకి నేరుగా వెళతాం. ఇలా ఫాలోవర్ గా ఉంటే - వారు పబ్లిక్ ఆప్షన్ లో పెట్టే పోస్ట్స్ ని మాత్రమే మనం చూడగలం. ఫ్రెండ్స్, ప్రైవేట్, సెలెక్టెడ్ పర్సన్స్ ఆప్షన్స్ లలో పెట్టే పోస్ట్స్ కనిపించవు. ఒకరకముగా చెప్పాలీ అంటే - వారికి స్నేహితులం కాకున్నా, పబ్లిక్ ఆప్షన్ లో పెట్టే పోస్ట్స్ ని మాత్రమే మనం చూడగలుగుతాం. మనం వీటికి లైక్, కామెంట్, షేర్... చెయ్యొచ్చు.
ఫాలోవర్ లిస్టు చూస్తే - కొన్ని వందలూ, వేల మంది ఉంటారు. ఆహా..! ఎంత గొప్పవారు.. వీరికి ఫాలోవింగ్ బాగుంది అని అనుకుంటాం. నిజానికి అందులో నిజమైన ఫాలోవర్స్ చాలా తక్కువమంది. ఆ ఆప్షన్ తెలుసుకొని, ఫాలో అయ్యేవారు చాలా కొద్దిమందే. మరి ఆ సంఖ్యలు నిజం కాదంటారా ? అని అడిగితే - అందులో ఫ్రెండ్ రిక్వెస్ట్స్ ఎక్కువ. వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్స్ ని - అంగీకరించకుండా అలానే ప్రక్కన అట్టిపెడితే - అలా ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతుంది. అదీ సంగతి.
ఇప్పుడు మీరు పెట్టే ఫ్రెండ్ రిక్వెస్ట్ తను చూడాలంటే - ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతూ, అలాగే వారికి ఒక మెస్సేజ్ కూడా పెట్టాలి. ఈ మెసేజ్ ఆప్షన్ ( తెరచిఉంటే ) ఎనేబుల్ చేసి ఉంటే అలా పెట్టండి. లేకుంటే గుంపులో గోవిందలా ఉండిపోతారు.
Thursday, May 1, 2014
Subscribe to:
Posts (Atom)