మనకి ఎంతో నచ్చిన వారితో స్నేహం ముగిసినప్పుడు,
మరో స్నేహబంధం మనతో కొనసాగుటకు ద్వారం
తెరచుకుంటుంది. కానీ, ఆ ద్వారం దిశగా చూడకుండా,
మూసిన ద్వారం దిశగానే చూస్తూ ఉండిపోతాం..
అవును.. మనకి నచ్చిన, మనసు వరకూ వచ్చిన స్నేహాలు ఏదైనా కారణాల వల్ల దూరమై పోయినప్పుడు - మన దైనందిక జీవితములో ఒకలాంటి స్తబ్దత ఏర్పడుతుంది. ఆకలి సరిగా ఉండదు.. మనల్ని మనం సరిగా పట్టించుకోం. ఏదో ఈ లోకాన ఉన్నామా.. అన్నట్లుగా ఉంటాం. అదే సమయాన అలాంటిదే మరో స్నేహబంధం మనతో కొనసాగుట కొరకు మరో స్నేహ ద్వారం తెరచుకుంటుంది. కానీ అప్పుడు మనమేమి చేస్తాం..? ఆ క్రొత్తగా తెరచుకున్న ద్వారం దిశగా చూడకుండా, మూసుక పోయిన ద్వారం దిశగానే చూస్తూ ఉండిపోతాం. ఈ క్రొత్త స్నేహాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం.
ఈ క్రొత్త స్నేహ బంధం తాలూకు వారు వీరిని అర్థం చేసుకొని, వారి స్నేహంతో పాతవారిని మరచిపోయేలా చేస్తే మరీ బాగుంటుంది. కానీ అలా చేసేవారు చాలా తక్కువ. మనం అలాంటి బాధాకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎవరైనా అలా చేస్తే బాగుండును అని ఎదురుచూస్తాం.. అదే మన స్నేహితులే అలా ఉన్నప్పుడు - వారిని ఆ విచారం నుండి బయటకు తీసుక రావటానికి అంతగా ప్రయత్నించం. నమ్మినా, నమ్మకున్నా అది నిజం.
No comments:
Post a Comment