Saturday, March 1, 2014

Good Morning - 550


మీ జీవితాన ఎదురయ్యే వారిని నిందించకండి. 
మంచి వ్యక్తులు సంతోషాన్ని ఇస్తారు, 
చెడ్డ వ్యక్తులు అనుభవాన్ని ఇస్తారు. 
దుర్మార్గులు మంచి పాఠంని ఇస్తారు. 
ఆత్మీయులు చక్కని అనుభూతులు ఇస్తారు. 

అవును.. మన జీవిత గమనములో ఎందరెందరో ఎదురవుతుంటారు. కొందరు పలకరింపుల వద్దే ఆగిపోతారు. కొందరు స్నేహితులవుతారు.. మరికొందరు ఆత్మీయులు అవుతారు, ఇంకొంత మంది పరిచయస్థుల వద్దే ఆగిపోతారు.. ఇలా ఎందరెందరో ఎదురవుతారు. అల ఎదురయ్యే వారు మన జీవితాన్ని ఎలా ప్రభావం చేస్తారో అనేది మనకి తెలీకుండానే జరిగిపోతుంది. 

కొందరు ప్రేరణని ఇస్తారు.. మరికొందరి సహచర్యంలో సంతోషం కలుగుతుంది.. మరికొద్ది మంది వల్ల జీవితాన ఎడతెగని విసుగు లభిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని నేర్పిస్తూ, వారిదైన ముద్రని వేస్తూ వెళతారు. 

మంచి వ్యక్తులేమో మనకి అమితమైన సంతోషాన్ని ఇస్తుంటారు. వారి సహచర్యం వల్ల మనసు ఎంతగానో సంతోషముగా, హాయిగా ఉంటుంది. 

చెడ్డ వ్యక్తుల వల్ల మనకి మంచి అనుభవాలు ఏర్పడతాయి. దానివల్ల మనం జీవితాన్ని మరింత లోతుగా చక్కగా చూడగలుగుతాం. వారు చెడ్డ వ్యక్తులని మనకి అప్పటివరకూ గుర్తేరగం. 

దుర్మార్గులు మంచి మంచి పాఠంలని ఇస్తారు. మళ్ళీ వారి జోలికి గానీ, వారు ఇచ్చిన పాఠంకి దారితీసిన పరిస్థితులని ఇక ముందు ఎదురురాకుండా జాగ్రత్త పడటం మొదలేడుతాం. 

మన ఆత్మీయులు అన్నవారు మనకి చక్కని అనుభూతులని ఇస్తారు. వాటిని జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడల్లా, మనసుకి ఎంతో హాయినీ, మొహాన సంతోషం ప్రస్పుటమవుతుంది. 

ఇలా ప్రతి ఒక్కరూ.. వీరు ఫలాన అని కాకుండా అందరూ ఒక్కో అనుభవాన్ని కలుగచేస్తారు. ఆ అనుభవాలని ఎలా తీసుకోగాలుగుతాం అనే దాన్ని బట్టి, మనం వారితో మనకు ఎలాంటి బంధం, అనుభూతులు, జ్ఞాపకాలు ఏర్పడతాయో  దాన్ని బట్టి వారిని ఆయా విభాగాల క్రిందకి చేరుస్తూ ఉంటాం. మళ్ళీ ఆ కేటగిరికి భిన్నముగా ఏదైనా అనుభవాన్ని ఇస్తే - మరో విభాగానికి మారుస్తూ ఉంటాం. 

1 comment:

Anonymous said...

నైస్ పోస్ట్...

Related Posts with Thumbnails