మనకి విలువనివ్వని ప్రేమల కోసం విలువైన మన జీవితం దూరం చేసుకోకూడదు.
అవును. ప్రేమ ఒక గొప్పనైన, పవిత్రమమైన భావం. కానీ అదే మన జీవితం కాదు. మనం ఒకరిని ఏదో నచ్చి, ప్రేమిస్తాం. మోహిస్తాం.. స్నేహిస్తాం. కానీ ఏదో ఒక పాయింట్ వద్ద ఆ ప్రేమలో తేడాలొచ్చేస్తాయి. అప్పుడే ఇరువురి మధ్యలో అహాలు పెరిగిపోయి, నువ్వెంత అంటే నువ్వెంత అన్న స్థాయి వరకూ వస్తుంది. ఎవరి పట్టుదల వారికి ఉంటుంది. ఒక్క మెట్టూ కూడా దిగరు. నిజానికి ఆ పరిస్థితికి మూలమెక్కడో తెలిసినా, దిద్దుబాటు చర్యలు చెయ్యక బెట్టు చేస్తుంటాం. ఇదంతా వ్యర్థ ప్రయాస. దానివల్ల ఇరువురమూ అమూల్యమైన కాలాన్ని, జీవితాన్నీ వృధా చేసుకుంటున్నాం, పైగా ఇరువురం ఇబ్బంది పడుతున్నాం అని ఆలోచించరు. పైగా ఎదుటివారిని తూలనాడుతుంటారు.
అదిగో.. సరిగ్గా అదే సమయాన ఎదుటివారు వేరేగా ఆలోచిస్తారు. ఇదంతా అవసరమా.. అది స్నేహమే కానీ, ప్రేమే కానీ, మరేదైనా కానీ.. మనకి కనీస విలువనివ్వని ఏదైనా మనకి అనవసరమే. ఆరాధించే స్థాయి లోని ప్రేమలొ మనకి అవతలివారు ఎలాంటి విలువనిస్తున్నారు అని ఆలోచించే శక్తి ఉండదు. కొనచూపు చాలు అనేంతగా సంతోషపడుతారు. కానీ ఇక్కడ మరో విషయం గుర్తు పెట్టుకోవాలి.
మనకి ఏమాత్రం విలువ ఇవ్వని ప్రేమల కోసం - అంతకన్నా విలువైన జీవితాన్ని మనం దూరం చేసుకోకూడదు. మన జీవితం బాగుంటేనే కదా అవన్నీ. లేకుంటే ఏమీ లేదు. మన జీవితం బాగుంటే అన్నీ వాటంతట అవే వెతుక్కుంటూ కూడా రావొచ్చును. పట్టించుకొని, విఫలమైన ప్రేమల వల్ల ఆత్మహత్యలు చేసుకొనే పిరికిసన్నాసుల కోసం ఒక్క కన్నీటి చుక్క కాదు కదా.. కనీసం హయ్యో.. అని జాలి కూడా చూపాల్సిన అవసరం లేదు.
No comments:
Post a Comment