Monday, March 31, 2014
Sunday, March 30, 2014
Quiz - ఈ బస్ రహదారి మీదుగా
ఈ బస్ రహదారి మీదుగా వెళుతుంది. అది A వైపుకి అని ఒకరు, B వైపుకి వెళుతున్నదాని ఇంకొకరు వాడులాడుకుంటున్నారు. మరి మీరేమంటారు..?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ఆ బస్ B సైడుకి వెళుతున్నది. ఎలా అంటే మీరు ఒకసారి ఆ బొమ్మని పరిశీలనగా చూడండి. ఆ బస్ డ్రైవర్ వద్ద ఒక డోర్ ఉన్నట్లు చూపబడింది. అదే ప్రయాణికులు ఎక్కే తలుపు మాత్రం అందులో లేదు. అంటే - ఆ బస్ ని మనం కుడి వైపు నుండి చూస్తున్నాం అన్నమాట.. ముందుకు వెళుతున్నది ని చెప్పాం కాబట్టి అది B సైడుకి వెళుతున్నది.
Friday, March 28, 2014
Good Morning - 552
మనకి విలువనివ్వని ప్రేమల కోసం విలువైన మన జీవితం దూరం చేసుకోకూడదు.
అవును. ప్రేమ ఒక గొప్పనైన, పవిత్రమమైన భావం. కానీ అదే మన జీవితం కాదు. మనం ఒకరిని ఏదో నచ్చి, ప్రేమిస్తాం. మోహిస్తాం.. స్నేహిస్తాం. కానీ ఏదో ఒక పాయింట్ వద్ద ఆ ప్రేమలో తేడాలొచ్చేస్తాయి. అప్పుడే ఇరువురి మధ్యలో అహాలు పెరిగిపోయి, నువ్వెంత అంటే నువ్వెంత అన్న స్థాయి వరకూ వస్తుంది. ఎవరి పట్టుదల వారికి ఉంటుంది. ఒక్క మెట్టూ కూడా దిగరు. నిజానికి ఆ పరిస్థితికి మూలమెక్కడో తెలిసినా, దిద్దుబాటు చర్యలు చెయ్యక బెట్టు చేస్తుంటాం. ఇదంతా వ్యర్థ ప్రయాస. దానివల్ల ఇరువురమూ అమూల్యమైన కాలాన్ని, జీవితాన్నీ వృధా చేసుకుంటున్నాం, పైగా ఇరువురం ఇబ్బంది పడుతున్నాం అని ఆలోచించరు. పైగా ఎదుటివారిని తూలనాడుతుంటారు.
అదిగో.. సరిగ్గా అదే సమయాన ఎదుటివారు వేరేగా ఆలోచిస్తారు. ఇదంతా అవసరమా.. అది స్నేహమే కానీ, ప్రేమే కానీ, మరేదైనా కానీ.. మనకి కనీస విలువనివ్వని ఏదైనా మనకి అనవసరమే. ఆరాధించే స్థాయి లోని ప్రేమలొ మనకి అవతలివారు ఎలాంటి విలువనిస్తున్నారు అని ఆలోచించే శక్తి ఉండదు. కొనచూపు చాలు అనేంతగా సంతోషపడుతారు. కానీ ఇక్కడ మరో విషయం గుర్తు పెట్టుకోవాలి.
మనకి ఏమాత్రం విలువ ఇవ్వని ప్రేమల కోసం - అంతకన్నా విలువైన జీవితాన్ని మనం దూరం చేసుకోకూడదు. మన జీవితం బాగుంటేనే కదా అవన్నీ. లేకుంటే ఏమీ లేదు. మన జీవితం బాగుంటే అన్నీ వాటంతట అవే వెతుక్కుంటూ కూడా రావొచ్చును. పట్టించుకొని, విఫలమైన ప్రేమల వల్ల ఆత్మహత్యలు చేసుకొనే పిరికిసన్నాసుల కోసం ఒక్క కన్నీటి చుక్క కాదు కదా.. కనీసం హయ్యో.. అని జాలి కూడా చూపాల్సిన అవసరం లేదు.
Wednesday, March 26, 2014
పాటలు టైపు చేసేటపుడు | / గీతలు ఎలా ?
[తెలుగుబ్లా గు:22246] పాటలు టైపు చేసేటపుడు
చరణం తరువాత మళ్ళీ పాటని కొద్దిగా లైను చివరలో ఒక అక్షరం వ్రాసి అక్షరం మొదట్లో చివరన రెండు గీతలను అమర్చడానికి నాకు రావటం లేదు. దయచేసి తెలుపగలరు.
సినిమా పాటలు బ్లాగుల్లో గానీ, మరేచోట వ్రాస్తున్నప్పుడు - పల్లవి, చరణాల చివర మళ్ళీ పల్లవి మొదలవుతుంది. ఇలా మళ్ళీ పల్లవి మొదలవుతుంది అని సూచనగా వాటి చివరన - పల్లవిలోని మొదటి పదాన్ని - అక్కడ వ్రాస్తారు. దీన్ని తేలికగా గుర్తించేందుకై ఆ పద భాగాన్ని ఇటు రెండు, అటు రెండు - వంగిన గీతలు లేదా నిలువు గీతల చూపిస్తారు. అంటే అక్కడ ఆ పల్లవి మళ్ళీ మొదలవుతుంది అనే సూచనగా. ఈ గీతలు / లేదా | గా ఉంటాయి. ఉదాహరణకు : అత్తారింటికి దారేది సినిమాలోని పాట " నిను చూడగానే చిట్టి గుండె గట్టిగానే.. " అనే పాటనే ఉదాహరణగా తీసుకొంటే - చివరలో
// నిను చూడగానే //
|| నిను చూడగానే ||
అని వ్రాస్తారు. అలా చూడగానే మనకి ఓహో.. మళ్ళీ పల్లవి ఇక్కడ మొదలవుతుంది అని గ్రహించేస్తాం. మామూలుగా చేతి ద్వారా తేలికగానే వ్రాయవచ్చును. కానీ కంప్యూటర్లో టైపింగ్ చేసేటప్పుడు - మొదట్లో ఎలా వీటిని వ్రాస్తారు ? అన్న మీమాంస మొదలవుతుంది. నిజానికి ఇది చా__లా చిన్న సమస్య. కీ బోర్డులో ఏమేమి కీలు / సంజ్ఞలు ఉన్నాయో ఒక్కసారి పరిశీలనగా చూస్తే అన్నీ తెలిసిపోతాయి.
కంప్యూటర్ కీ బోర్డులో ఈ గుర్తులను / | సూచించేందుకై ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. సాధారణముగా వీటిని కుడివైపున / కుడిచేతి వ్రేళ్ళ క్రిందకు వచ్చే కీలలో మీరు వీటిని తేలికగా గుర్తించవచ్చును. ఎలా అంటే - Enter కీ చుట్టూ ఈ మీటలను తేలికగా కనుగొనగలం. ఈ క్రింది ఫోటోలో మీరు గమనించవచ్చును.
చాలా కీ బోర్డుల్లో ఈ రెండు సంజ్ఞలు ఇతర సంజ్ఞలతో కలిసి ఉంటాయి. కీ అమరికలను బట్టి షిఫ్ట్ ( Shift ) కీ వాడి ఉపయోగించాల్సి ఉంటుంది.
1 గుర్తు వద్ద చూపించిన | సంజ్ఞని ఆంగ్లములో పైప్ ( Pipe ) అంటారు. ఇది నిలువు గీత ఆకారములో ఉంటుంది. దీన్ని కీ బోర్డ్ అమరికను బట్టి షిఫ్ట్ కీ వాడి, నొక్కాల్సి ఉంటుంది. ఇది చాలా కీ బోర్డుల్లో ఉండకపోవచ్చును. కారణం ఎక్కువగా ఉపయోగములో లేకపోవడం వల్లనేమో కావొచ్చును.
2 గుర్తు వద్ద చూపిన / సంజ్ఞని ఆంగ్లములో స్లాష్ ( Slash ) అంటారు. ఇది కాస్త వాలుగా ఉండే గీత. కుడివైపుకి వాలి ఉంటుంది. సాధారణముగా షిఫ్ట్ కీ వాడకుండానే నేరుగా వాడుకోవచ్చును. ఇది కీ బోర్డులో రెండు చోట్ల ఉంటుంది.
ఒకటేమో ఎంటర్ బటన్ వద్ద,
రెండోది : నంబర్ కీల వద్ద.
నంబర్ కీల వద్ద దీన్ని అంకెలను భాగించటానికి (Divide) ఎక్కువగా వాడుతుంటారు.
పై రెండింటినీ అలా వాడుకోవచ్చును.
Tuesday, March 25, 2014
Quiz
ఈ క్రింది బొమ్మలో ? వద్ద ఎంత సంఖ్య రావాలో చెప్పండి చూద్దాం..
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
పైనున్న పటం లోని సమస్యకి సమాధానం 3
ఎలా అంటే - ఎడమ క్రింద మూలన 19 ఉంది.
దాని మీద ఐ మూలగా 9 మరియు 10 ఉన్నాయి.
వీటి మొత్తం 19.
వీటి మీద కాకుండా మరో ఐ మూలగా 4, 2, 1, 6 ఉన్నాయి.
వీటి మొత్తం 13.
వచ్చిన అంకెల సగటు (19 + 13 = 32 / 2 ) = 16
ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఐ మూలలో 6, 7 ఉన్నాయి.
వీటి మొత్తం 13.
కావాల్సిన సంఖ్య 16
16 - 13 = 3
Monday, March 24, 2014
Friday, March 21, 2014
Quiz
జవాబు ఎంతో చెప్పండి.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
లోపలి వృత్తం లోని రెండు గళ్ళలోని అంకెల మొత్తం ని వాటి కెదురుగా ఉన్న వృత్తం లో వస్తుంది.
ఉదాహరణకు బయట వృత్తం లోని 8 ని తీసుకొంటే - ఆ వృత్తం కి ఉన్న లోపల సరళ రేఖ గుండా చూస్తే ఆవతలి వైపున 1, 7 ఉన్నాయి. వీటి మొత్తం అంతే కదా.. (8). అలాగే ప్రశ్నలోని సమస్యని చూస్తే - ? మార్కు ఉన్న గడి కెదురుగా 9, 8 ఉన్నాయి. వీటి మొత్తం విలువ 17 కదా.. అదే ఇక్కడ జవాబు.
Thursday, March 20, 2014
Quiz
ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి చూద్దాం..
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు ఇదిగో..:
ఎలా అంటే :
మొదటి డబ్బా ( నాలుగు చదరాలు ఉన్నది ) అది మొత్తం ఐదు చదరాలుగా ఉంది. ఎలా అంటే - ఆ నాలుగు చతురస్రాలను కలిపే చుట్టూరా ఉన్న డబ్బా గీతతో ఐదో చదరం కనిపిస్తుంది.
ఇప్పుడు అదే పద్ధతిలో ఆలోచిస్తే - రెండో బొమ్మలో 14 చదరాలు ఉన్నాయి. ఎలా అంటే - ఆ రెండో బొమ్మలో ఉన్న తేలికగా కనిపించే చదరాలను లెక్కిస్తే, 9 కనిపిస్తాయి. వాటి చుట్టూరా ఉన్న డబ్బాతో 10 వ చదరం అవుతుంది.
ఇప్పుడు పైన వరుసలోని మొదట రెండు చదరాలు, మధ్య వరుసలోని ఎడమ, మధ్య చదరాలు - ఈ నాలుగింటిని కలిపే డబ్బా లైన్ 11 వ చదరం అవుతుంది. ఈ క్రింద పటంలో నారింజ రంగులో చూపెట్టబడింది.
ఇప్పుడు 12 వ చదరం.
అలాగే 13 వ చదరం.
అలాగే 14 వ చదరం.
ఇప్పుడు ఎన్ని చదరాలు ఉన్నాయో అదే అక్కడ జవాబు ( 14 ) అయ్యింది.
Wednesday, March 19, 2014
Tuesday, March 18, 2014
Good Morning - 551
మనకి ఎంతో నచ్చిన వారితో స్నేహం ముగిసినప్పుడు,
మరో స్నేహబంధం మనతో కొనసాగుటకు ద్వారం
తెరచుకుంటుంది. కానీ, ఆ ద్వారం దిశగా చూడకుండా,
మూసిన ద్వారం దిశగానే చూస్తూ ఉండిపోతాం..
అవును.. మనకి నచ్చిన, మనసు వరకూ వచ్చిన స్నేహాలు ఏదైనా కారణాల వల్ల దూరమై పోయినప్పుడు - మన దైనందిక జీవితములో ఒకలాంటి స్తబ్దత ఏర్పడుతుంది. ఆకలి సరిగా ఉండదు.. మనల్ని మనం సరిగా పట్టించుకోం. ఏదో ఈ లోకాన ఉన్నామా.. అన్నట్లుగా ఉంటాం. అదే సమయాన అలాంటిదే మరో స్నేహబంధం మనతో కొనసాగుట కొరకు మరో స్నేహ ద్వారం తెరచుకుంటుంది. కానీ అప్పుడు మనమేమి చేస్తాం..? ఆ క్రొత్తగా తెరచుకున్న ద్వారం దిశగా చూడకుండా, మూసుక పోయిన ద్వారం దిశగానే చూస్తూ ఉండిపోతాం. ఈ క్రొత్త స్నేహాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం.
ఈ క్రొత్త స్నేహ బంధం తాలూకు వారు వీరిని అర్థం చేసుకొని, వారి స్నేహంతో పాతవారిని మరచిపోయేలా చేస్తే మరీ బాగుంటుంది. కానీ అలా చేసేవారు చాలా తక్కువ. మనం అలాంటి బాధాకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎవరైనా అలా చేస్తే బాగుండును అని ఎదురుచూస్తాం.. అదే మన స్నేహితులే అలా ఉన్నప్పుడు - వారిని ఆ విచారం నుండి బయటకు తీసుక రావటానికి అంతగా ప్రయత్నించం. నమ్మినా, నమ్మకున్నా అది నిజం.
Monday, March 17, 2014
Sunday, March 16, 2014
Quiz
ఈ ప్రశ్నకి సమాధానం ఎంతో చెప్పుకోండి చూద్దాం..
? గుర్తు వద్ద ఎంత వస్తుందో చెప్పండి.
మధ్యలో ఉన్న 2 అనే సంఖ్య ఉన్న వృత్తం వదిలితే, మొదట గడి అంటే ఎడమ పై మూలన ఉన్న దానిలో 6, 2, 24 మధ్యలో 2 ఉన్నాయి. ఇక్కడ వీటి మధ్య లింక్ ఏమిటంటే
6 x 2 x 2
12 x 2 = 24 అన్నమాట.
అలాగే కుడి పై మూలాన చూస్తే 5, 3, 30 & 2 ఉన్నాయి. వీటి మధ్య కూడా అదే సంబంధం.
5 x 3 x 2
15 x 2 = 30
క్రింద ఎడమ దిగువ మూలన 7, 8, 2 & 112 ఉన్నాయి. వీటి మధ్యన కూడా అదే లింకు.
7 x 8 x 2
56 x 2 = 112
అలాగే కనుక్కోవలసిన మూల ఉన్న అంకెలన్నీ అదే వరుసలో చూస్తే - 8, 9, 2, ? ఉన్నాయి.
అదే క్రమ పద్ధతిని వాడితే
8 x 9 x 2
72 x 2 = 144 Ans. అవుతుంది.
Friday, March 14, 2014
Wednesday, March 12, 2014
Sunday, March 9, 2014
Friday, March 7, 2014
Thursday, March 6, 2014
Saturday, March 1, 2014
Good Morning - 550
మీ జీవితాన ఎదురయ్యే వారిని నిందించకండి.
మంచి వ్యక్తులు సంతోషాన్ని ఇస్తారు,
చెడ్డ వ్యక్తులు అనుభవాన్ని ఇస్తారు.
దుర్మార్గులు మంచి పాఠంని ఇస్తారు.
ఆత్మీయులు చక్కని అనుభూతులు ఇస్తారు.
అవును.. మన జీవిత గమనములో ఎందరెందరో ఎదురవుతుంటారు. కొందరు పలకరింపుల వద్దే ఆగిపోతారు. కొందరు స్నేహితులవుతారు.. మరికొందరు ఆత్మీయులు అవుతారు, ఇంకొంత మంది పరిచయస్థుల వద్దే ఆగిపోతారు.. ఇలా ఎందరెందరో ఎదురవుతారు. అల ఎదురయ్యే వారు మన జీవితాన్ని ఎలా ప్రభావం చేస్తారో అనేది మనకి తెలీకుండానే జరిగిపోతుంది.
కొందరు ప్రేరణని ఇస్తారు.. మరికొందరి సహచర్యంలో సంతోషం కలుగుతుంది.. మరికొద్ది మంది వల్ల జీవితాన ఎడతెగని విసుగు లభిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని నేర్పిస్తూ, వారిదైన ముద్రని వేస్తూ వెళతారు.
మంచి వ్యక్తులేమో మనకి అమితమైన సంతోషాన్ని ఇస్తుంటారు. వారి సహచర్యం వల్ల మనసు ఎంతగానో సంతోషముగా, హాయిగా ఉంటుంది.
చెడ్డ వ్యక్తుల వల్ల మనకి మంచి అనుభవాలు ఏర్పడతాయి. దానివల్ల మనం జీవితాన్ని మరింత లోతుగా చక్కగా చూడగలుగుతాం. వారు చెడ్డ వ్యక్తులని మనకి అప్పటివరకూ గుర్తేరగం.
దుర్మార్గులు మంచి మంచి పాఠంలని ఇస్తారు. మళ్ళీ వారి జోలికి గానీ, వారు ఇచ్చిన పాఠంకి దారితీసిన పరిస్థితులని ఇక ముందు ఎదురురాకుండా జాగ్రత్త పడటం మొదలేడుతాం.
మన ఆత్మీయులు అన్నవారు మనకి చక్కని అనుభూతులని ఇస్తారు. వాటిని జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడల్లా, మనసుకి ఎంతో హాయినీ, మొహాన సంతోషం ప్రస్పుటమవుతుంది.
ఇలా ప్రతి ఒక్కరూ.. వీరు ఫలాన అని కాకుండా అందరూ ఒక్కో అనుభవాన్ని కలుగచేస్తారు. ఆ అనుభవాలని ఎలా తీసుకోగాలుగుతాం అనే దాన్ని బట్టి, మనం వారితో మనకు ఎలాంటి బంధం, అనుభూతులు, జ్ఞాపకాలు ఏర్పడతాయో దాన్ని బట్టి వారిని ఆయా విభాగాల క్రిందకి చేరుస్తూ ఉంటాం. మళ్ళీ ఆ కేటగిరికి భిన్నముగా ఏదైనా అనుభవాన్ని ఇస్తే - మరో విభాగానికి మారుస్తూ ఉంటాం.
Subscribe to:
Posts (Atom)