Thursday, February 27, 2014

Good Morning - 549


పిల్లలు మనం చెప్పేది వినరు..
మనం చేసేది వింటారు. 

అవును.. మనం చెప్పేది ఏమిటో, మాట్లాడేది ఏదో అర్థం చేసుకోరు. కాని మన చేతలను, ప్రవర్తనని చక్కగా వింటారు. ఇక్కడ వింటారు బదులు చూస్తారు అనేది సరియైనది మీకనిపించవచ్చును. అదీ నిజమే. కానీ చూడటం కాదు.. మనమేమి చేస్తున్నామో, ఏమి చేశామో ఇతరుల ద్వారా విన్నపుడు మనల్ని అప్పుడే సరిగ్గా అర్థం చేసుకుంటారు. వారి ముంది చెడుగా, అశ్లీలముగా మాట్లాడినా, చెడుగా ప్రవర్తించినా వారికి సరిగా అర్థం కాదు.. కానీ ఇతరుల ద్వారా అది ఏమిటో బాగా తెలుసుకుంటారు..

No comments:

Related Posts with Thumbnails