Sunday, February 9, 2014

Good Morning - 543


జీవితమనే వృక్షానికి కాసే పండ్లు అధికారం, సంపదా అయితే - ఆత్మీయులూ, స్నేహితులూ ఆ వృక్షానికి వేర్లు, పండ్లు లేకపోయినా చెట్టు బ్రతుకుతుంది. కానీ వేర్లు లేకపోతే బ్రతకలేదు. 

అవును కదా..! మామూలుగా ఏ వృక్షానికైనా అది పళ్ళు, పూలు కాయకున్నా / పూయకున్నా నిక్షేపంలా బ్రతికేస్తూ ఉంటుంది. కానీ ఈ భూమ్మీద ఉన్న ప్రతి చెట్టూ వేర్లు లేకుండా మనుగడ సాగించలేదు. అలాగే మన జీవితాన - మన వద్ద సంపద, అధికారం ఎంత ఉన్నా, అవి ఉన్నని రోజులూ మన చుట్టూరా భజన చేస్తుంటారు. అవి ఏ రోజైతే మననుండి వెళ్ళిపోతాయో ఆ రోజున మన దగ్గర ఎవరూ ఉండరు. బ్రతకడం అదోమాదిరిగా అనిపిస్తుంది. అలాగే మన ఆత్మీయులు, స్నేహితులు మన వద్దలేకుంటే / మనల్ని వదిలి దూరముగా వెళ్ళిపోతే - మనసులో మనసు ఉండదు. ఏదోలా ఉంటుంది. బాధగా అనిపిస్తుంది. ఒక్కోసారి ఎందుకీ జీవితం ? ఎటైనా పారిపోవాలనిపిస్తుంది కూడా. అందుకే మన జీవితమనే చెట్టుకి - అధికారం, సంపదా పుష్పాలు, పళ్ళూ లాంటివి. కానీ చెట్టుకి మూలాధారం ఆత్మీయులు, స్నేహితులునూ.. 

No comments:

Related Posts with Thumbnails