ఎదగడానికి - ఎప్పటికీ అవకాశం ఉంటుంది.
హా! అవును.. ఎదగటం అనేది మా జీవితాన కావొచ్చు, ఆర్థిక విషయములోనే కావొచ్చు, స్నేహ బంధాల విషయాల్లోనే కాదు.. ఆఖరికి మెంటల్లీగా ఎదగటం కూడా కావొచ్చును. ఎదగటం అనే విషయానికి వస్తే - అప్పుడే అయిపోయిందని అనుకోవాల్సిన పని లేదు. ఎప్పటికీ ఆయా విషయాల్లో ఎదగటానికి ప్రస్పుటమైన అవకాశం ఉండి తీరుతుంది. ఇలా ఎదగటానికి కావాల్సిన విషయానికి వస్తే - ఎదగటానికి అమితమైన ఆసక్తితో పాటు, నేర్చుకోవాల్సిన విషయం మీద మిక్కిలి కుతూహలం ఉండి, దానివలన తనని తాను మార్చుకోగలి ఉండాలి. ఇలా మార్చుకోవటానికి - తమంతట తాముగా లేదా పుస్తకాలు, ఇంకొకరి జీవిత అనుభవాలు, జీవిత గమనంలో ఎదురయ్యే వారి వల్లో, కాలం నేర్పించే కఠోర సత్యాల వల్లనే కానీ.. ఎప్పటికప్పుడు నేర్చుకొనే అవకాశం ఉంటుంది. అలా నేర్చుకోనేవారికే - ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు..
No comments:
Post a Comment