Wednesday, June 12, 2013

Soul mate friend - 3

(ప్రాణ) స్నేహితుడు ఎలా ఉండాలీ అంటే :  

మీతో జరిగిన పరిచయాన్ని, స్నేహముగా మార్చుటకి తన వంతు ప్రయత్నం కూడా ఉండాలి. 




స్నేహములో నమ్మకం అతి ప్రధానమైనది. ఎప్పుడైతే మిమ్మల్ని మోసగాడు, చంచల మనస్కుడు, చెడు నడవడిక ఉన్నవాడు, పనీపాట లేనివాడు.. అని అవతలివారు ఎప్పుడైతే అనుమానించటం మొదలు పెడతారో అప్పుడు ఆ స్నేహానికి కాసింత దూరముగా జరగటం అన్నివిధాలా శ్రేయస్కరం. ఇక్కడ మీలో అవతలివాళ్ళు పేర్కొన్న ఆ లక్షణాలు అస్సలుకే ఉండకూడదు. అలా లేని నాడు, అయినా మీపై అలా చెడు ప్రచారం వచ్చి ఉంటే - ఇక ఆ స్నేహానికి నీళ్ళు వదులుకోవాల్సిందే.. 

మీ ఇద్దరి మనస్సులూ కలిసాయి. ఇద్దరి అభిరుచులూ, వేవ్ లెంత్ లూ కలిసాక ఆత్మీయనేస్తంగా  మారిపోవచ్చును. మీ స్నేహితునికి, మీకూ సవాలక్ష ఉంటాయి. ఆ సమయములో - ఈ ప్రపంచములో అన్ని స్నేహాల్లో జరిగినట్లే, మీ చుట్టూ ఉన్న సమాజం మీ స్నేహానికి పరీక్ష పెడుతుంది. అదేమిటంటే - ఇతరులు మీలో ఒకరిమీద ఒకరికి అపోహలు కలిగిస్తారు. అవి నమ్మదగినట్లుగా, నిజమే, మన చాటుగా ఇలా, ఇంతగా జరిగిందా? అనుకొనేలా ఉంటాయి అవి. ఒక్కోసారి అవి యదార్థమే అన్నట్లు అగుపిస్తాయి కూడా.! అలాంటి సమయాల్లోనే మీ స్నేహం ఎంత సరియైనది అని తేలిపోతుంది. చాలా స్నేహాల్లో ఇక్కడే దెబ్బతింటాయి. 

లా మీ ఇరువురి మధ్య తగువులు కలిగించేవారు ఎవరో ముక్కు మొహం తెలీనివారై ఉండరు. మీ ఇరువురితో చనువుగా ఉంటూ, అప్పటివరకూ మీ ఇద్దరి అభిమానాన్నీ సంపాదించుకున్న వారే ఎక్కువగా ఉంటారు. అంతగా దగ్గరివారే అలా చెప్పాక - మొదట్లో మనసు నమ్మదు. ఏదో ఒక బలహీన క్షణాన, మనసు ఊయలలూగుతుంది. వీళ్ళు చెప్పేది నిజమేమో.. నా కళ్ళు, మనసు నన్ను మోసం చేసాయేమో అన్న అనుమానం మొదలవుతుంది. సరిగ్గా చెప్పాలంటే ఉక్కు లాంటి దృడమైన మీ స్నేహబంధం - వేడయినప్పుడే ఇనుము వంగుతుంది - అన్న చందాన ఆ చెప్పేవారి మాటలు వినడాన్న, చెప్పింది నమ్మడానికీ, సిద్దముగా ఉంటారు. ఇక మీ స్నేహబంధానికి బీటలు మొదలయినట్లే. 

మధ్యలోని వాళ్ళు చెప్పిన మాటలని - అదేంటోగానీ గుడ్డిగా నమ్మేస్తారు. అప్పటివరకూ ప్రాణంగా భావించిన స్నేహితుడిని విశ్వసించరు. మాట్లాడుకున్న మాటలూ, చేసుకున్న బాసలూ, పంచుకున్న అనుభూతులూ.. ఒకటేమిటీ? అన్నీ హుష్! అప్పటిదాకా కోకిల కూజితాల్లా వినిపించిన స్నేహితుని పిలుపు - గార్ధభ ( గాడిద ) స్వరాలుగా వినిపిస్తాయి. ఎన్నడూ రాని విసుగు ఇక ప్రతి నిమిషమూ వస్తూనే ఉంటుంది. ఇక అంతగా వచ్చిందంటే ఇక స్నేహం మనలేదు..

లాంటి సందర్భాల్లో - అలాంటి అనుమానం మొదలయినప్పుడే - ఆ ఇద్దరు స్నేహితులు మాత్రమే కలిసి మాట్లాడుకుంటే ఎప్పటిలాగే ఆ స్నేహం కొనసాగటానికి అవకాశం ఉంటుంది. ఆ కలుసుకొని మాట్లాడుకోవటం కూడా ఎవరికీ తెలీకుండా ( అక్కడికి వచ్చి, ప్రభావితం చెయ్యకుండా ఉండేలా ) చోటు చూసుకొని, వచ్చిన అపార్థాలకి వివరణలు ఇచ్చి, పుచ్చుకోవడం చాలా మంచి పద్ధతి. ఇక్కడ వచ్చిన అపోహలు, అపార్థాలు ఎలా వచ్చాయో చర్చించాలి గానీ ఎవరు చెప్పారో, ఎప్పుడు, ఎక్కడ చెప్పారో మాట్లాడుకుంటే ఇక అసలు సమాధానాలు రాకపోవచ్చును. ఆ విషయాలు చివరిలో మాట్లాడుకోవడం మంచి పద్ధతి. 

చ్చిన అనుమానాల్ని ఒకేసారి కుమ్మరించినట్లు, ఉక్కిరిబిక్కిరి చేసినట్లు అడగక, ఒక్కో వాక్య ప్రశ్నలా అడగండి. అదీ మీ మొహాన ప్రశాంతముగా ఉంటూ, మాటలు మృదువుగా, నెమ్మదిగా, అనునయిస్తున్నట్లుగా ఉండాలి గానీ, కోపముతో, తిడుతూ, నిందాకర మాటలతో, అసహ్యకరభాష మాట్లాడుతూ - మీ అనుమానాలు తీర్చుకోవాలి అనుకుంటే మొదటగా దెబ్బ తినేది మీరే. ఎందుకంటే - అవతలివారికి మీ గురించి బయటవారికి చెప్పుకోవటానికి ఒక అవకాశం ఇస్తున్నట్లే.. " మామధ్య ఏర్పడ్డ అపోహలకి సమాధానాలు ఇవ్వడానికి నేను మామూలుగానే వెళితే ఇలా చేశాడు.." అనేలా చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వకండి. ఆతరవాత ఇక మీరు ఈ జన్మలో కలుసుకోకపోవచ్చును. 

మీ మధ్యలోకి ఇంకోకరిని రానివ్వకండి. వస్తే - వెనకటి సామెతలా - ముగ్గురు కలిస్తే ముడివడదు.. అన్న చందాన వారి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. మీ వాదనే సరియైనది అని అహం తో తనని కన్వియన్స్ చేస్తారు. నిజానికి ఇక్కడ మీరు మాట్లాడాల్సింది అపోహలు ఏర్పడ్డ మీ మిత్రునితో. కానీ, అలాచేస్తే - పొరబాట్లని సరిదిద్దుకుందాము అని వచ్చిన మిత్రుడు ఈ పరిణామంతో ఇంకా దూరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ గొడవ కాకుండా వారిని అక్కడ ఉండటానికి మీరిద్దరూ ఒప్పుకుంటే, మధ్యలో కల్పించుకోకుండా ఉండేలా, పోట్లాడుకోకుండా ఉండేలా చూడుమనేలా - ముందే చెప్పండి. 

మధ్యవర్తి అంటే ఇరువురికీ గౌరవం ఉన్నవారై ఉండాలి. తను మైండ్ మెచ్యూర్ అయిన వ్యక్తి అయిఉండాలి. అలాగే ఇంకో ప్రధాన అర్హత ఏమిటంటే - మీరిద్దరూ మాట్లాడుకున్నవి బయట ఎక్కడా చెప్పనివారై ఉండి, తనలోనే ఆ విషయాలని అక్కడే సమాధి చేసేవారై ఉంటే మరీ మంచిది. అలాగే తప్పోప్పులని నిజాయితీగా, నిర్భీతిగా, అలా ఎందుకో విశ్లేషిస్తూ చెప్పగలిగే మధ్యవర్తి దొరికితే - మీ ఇద్దరి అదృష్టమే అనుకోవాలి. అవసరమైతే (ఒంటరిగా ఉన్నప్పుడు ) మిమ్మల్ని తిట్టి, బుద్ధి చెప్పేలా ఉండాలి. అలా వారు గనుక ఉంటే - అప్పుడు మీకు నచ్చకున్నా, తరవాత మాత్రం మీరు మరింత ఆనందముగా ఉంటారు. 

ధ్యవర్తి ఉన్నాడు, అంతా తనే చూసుకుంటాడు అని వదిలేయ్యకండి. మీరూ ఆక్టివ్ పాత్ర పోషించండి. ఎందుకంటే ఇక్కడ సమస్య మీది. లాభం వచ్చినా, నష్టం వచ్చినా ఏదైనా అంతా మీరే అనుభవించాల్సి ఉంటుంది. మధ్యలోని వారు వారి పాత్రని సరిగ్గా పోషించకుంటే - మీకే దెబ్బ. అందుకే మీరే అన్నీ చూసుకోవడం మంచిది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సంఘటన తరవాత విశ్లేషిస్తే - మీరు అక్కడ సరియైన పద్ధతులల్లోనే, అన్నివిధాలా ప్రయత్నించారు అనేలా ఉండాలి. స్నేహంని బాగుచేసుకోవటానికి అన్నిరకాలుగా ప్రయత్నించారు అన్న అభిప్రాయముతో - మిగిలిన జీవితములో ప్రశాంతముగా ఉండగలరు. లేకుంటే తీరని వ్యధనే. ఇలా అభిప్రాయం ఏర్పడాలి అంటే మీరు చాలా ఎదగాల్సి ఉంటుంది. 

( మరికొంత తరవాతి టపాలో.. )

No comments:

Related Posts with Thumbnails