Bhadrakali Temple, Warangal - 3 తరవాయి భాగం. ( ఫొటోస్ పెద్దగా కనిపించేందుకై మొదటి ఫోటో మీద క్లిక్ చేసి, ఆతరవాత < > కీలను వాడండి. అలా చేస్తే ఫోటోలు ఇంకా బాగా నచ్చుతాయి. )
శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం వెనుక భాగం. మనకు మొదట్లో ఇలాగే కనిపిస్తుంది. అంటే ఆలయ వెనుక భాగాన నుండి ముందుకు వెళ్లి, అక్కడి నుండి గుడి లోకి ప్రవేశిస్తాం అన్నమాట.
ఆలయం నుండి బయకు వచ్చే దారి అన్నమాట. దర్శనం అయ్యాక ఇలా బయటకు రావోచ్చును.
ఆలయం లోకి ప్రవేశించటానికి ఇందులోంచే ప్రవేశం. అందరూ ఈ ద్వారం నుండే ప్రవేశిస్తారు.
ఆ ద్వారం గుండా లోనికి ఇలా ప్రవేశిస్తాం. ఎండ తగలకుండా భక్తులకి ఇలా దారిలో నీడ కలిగించారు. ఇలా చెయ్యటం మంచి ఆలోచన. ఎదురుగా తెల్లగా కనిపిస్తున్న గోపురం - శ్రీ వినాయక స్వామీ వారి ఆలయం. చిన్నగా ఉన్నా లోపలున్న మూర్తి విగ్రహం చాలా బాగుంటుంది. అటు ప్రక్కగా - ప్రసాదాల కౌంటర్ ఉంటుంది. అందులో పులిహోర, లడ్డు ఇస్తారు. ఏవైనా ఐదు రూపాయలకు ఒక ప్యాకెట్.
ప్రవేశ ద్వారం నుండి ఇలా లోపలి వెళ్ళగానే, కుడివైపున ఇలా కనిపించేదే అమ్మవారి ఆలయం.
అలా ఆ దారిలో నడుస్తుంటే - కుడివైపున మీకు - శ్రీ ఆదిశంకరాచార్యుల మందిరం కనిపిస్తుంది.
ఆ ప్రక్కనే ఇలా ఆలయ చరిత్ర ఉన్న బోర్డ్ కనిపిస్తుంది. ఇందులో ఆలయ చరిత్ర క్లుప్తముగా ఉంటుంది. అదయ్యాక కుడివైపుకి తిరిగితే ఆలయం వస్తుంది. (ఆలయ ముఖద్వారం ఫోటో తీయటం మరిచా ). అందులోంచి లోపలి వెళ్ళాలి.
ఇది ధ్వజస్తంభ వరండా.. ఇక్కడ ఇత్తడి తొడుగు వేసిన ధ్వజ స్థంభం ఉంటుంది.
ఇక్కడ భక్తులు మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి దీపాలు వెలిగిస్తారు. ఆ ప్రక్కనే ఒకరు ఆ దీపాలని అమ్ముతారు. రూ. 30 కి 11 మట్టి ప్రమిదల నెయ్యి దీపాలు ఒక స్టీల్ ప్లేట్ లో పెట్టి ఇస్తారు. ఆ పదకొండు దీపాలని ఆ ధ్వజ స్థంభం ముందున్న గట్టు మీద పెట్టి, వెలిగిస్తారు. ఈ ఆలయవరండాలోనే అమ్మవారి గర్భగుడి చుట్టూరా, అందులో ఈ ధ్వజ స్థంభాన్ని కలుపుకొని ప్రదక్షిణాలు చేస్తారు.
ధ్వజస్తంభం ముందు అమ్మవారి వాహనం అయిన సింహం ప్రతిమ ఉంటుంది. అలాగే ఇందాక చెప్పిన నెయ్యి దీపాలు వెలుగుతున్నవీ చూడొచ్చును.
ఆలయ ప్రవేశానికి ఎడమవైపున - ఆంజనేయ స్వామి వారి మందిరం ఉంటుంది. దాని ముందున ఇలా ముగ్గులతో పటం వేసి, పూజచేశారు.
హనుమాన్ మందిరం ప్రక్కనే ఉన్న చార్ట్ లో - ఇలా ప్రతి హిందువు ఆచరించాల్సిన 25 సూత్రాలు ఇందులో ఉంటాయి.
అదయ్యాక ముందుకు వస్తే, బయటకి వచ్చే దారిలో శివాలయం ఉంటుంది. ఆ శివాలయానికి ఓ ప్రక్కగా ఇలా నవగ్రహాల గట్టు ఉంటుంది.
నవగ్రహ పూజ చేసుకున్నాక ఎదురుగా ఉన్న గేటు ద్వారా బయటకి రావోచ్చును. లేదా ఆలయ ప్రవేశం అయిన ద్వారం గుండా బయటకి రావోచ్చును. నేను మాత్రం వచ్చిన దారి గుండా బయటకి వచ్చేశాను.
ఆలయ ముఖ ద్వారం వద్ద - కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుంది. భక్తులు తెచ్చిన కొబ్బరికాయలని ఇక్కడే కొడతారు. కొట్టగా వచ్చిన కొబ్బరి నీటిని ఒక పాత్రలోకి తీస్తారు. ఫోటోలోని తెల్ల బకెట్ లో ఉన్నది కొబ్బరి నీరు. ఆ ప్రక్కనే ఉన్న 200 మి.లీ. (?) బాటిల్ కొబ్బరినీరు ని రూ. 10 కి అమ్మారు. అలా ఆ చిన్న బాటిల్ నీరు త్రాగాను. ముందే ఎండాకాలం కదా అని పెద్ద బాటిల్ ని అడిగితే - ఒక లీటర్ బాటిల్ రూ. 30 చెప్పారు. నాకైతే బంపర్ ఆఫర్ లా కనిపించింది. ఒక బాటిల్ తీసుకొని కడుపారా కొబ్బరి నీటిని త్రాగాను.
ఈ కొబ్బరి నీరు అమ్మే స్థలానికి ఎదురుగా యాగ స్థలం ఉంటుంది. మేము చూస్తున్నప్పుడు ఒక యాగం అక్కడ జరుగుతున్నది.
ఆ యాగ స్థలానికి ఆనుకొనే ఈ - పవిత్ర పరిక్రమ ఉంటుంది. ఇది ఇనుప పైపుల మధ్యగా - ఒక నిర్దుష్ట ఆకారములో దారి ఉంటుంది. అందులోనుంచి నడిస్తే ఒక క్రమ పద్దతిలో ఒక ప్రదక్షిణ చేసినవారిమి అవుతాం. ఇది ఉచిత ప్రవేశం. మధ్యలో అమ్మవారికి సమర్పించే గాజులు - మధ్యలో ఉన్న స్టాండ్ కి వేస్తారు.
ఇదే పవిత్ర పరిక్రమ మార్గం. మార్గ మద్యాన అమ్మవారి గాజుల స్టాండ్ కూడా చూడొచ్చును.
పరిక్రమ మార్గానికి ఆనుకొనే ఉన్న భద్రకాళి చెరువు.
భద్రకాళి ఉద్యానవనము, చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్లేందుకై దారి. లోనికి వెళ్ళాలీ అంటే రూ. 5 టికెట్ తీసుకోవాలి. సమయాభావం వల్ల లోనికి వెళ్ళలేకపోయాం.
ఈ ఉద్యానవన గేటు కి ఎదురుగా ఇలా శ్రీ నాగేంద్ర స్వామి వారి ఆలయం కనిపిస్తుంది. ఇందులో ప్రధానమైనది పాము పుట్ట.
లోపల ఇలా ఉంటుంది.
అలా అన్ని దర్శించుకున్నాక - బయటకి వస్తే అప్పుడప్పుడు కోతులు కనిపిస్తాయి. భక్తులు కొట్టే కొబ్బరి చిప్పల కోసం ఇలా వస్తుంటాయి. కాసింత జాగ్రత్తగా ఉండాలి వాటితో.
ఆలయ దర్శనం, పరిసర ప్రదేశాల దర్శనం మీకు అయిపోయింది. మీకు అమ్మ ఆశీస్సులు తప్పకుంటాయి.
శుభం భూయాత్.
No comments:
Post a Comment