Tuesday, June 18, 2013

Good Morning - 371


ఆత్మీయ బంధాలలో అధిక నష్టాన్ని కలిగించేవి - 
ఎదుటివారి పట్ల ఉదాసీనత, నిర్లక్ష్యం. 

అవును. మనం ఏర్పరుచున్న ఆత్మీయ అనుబంధాలు అంటే స్నేహమే గానీ, కుటుం బంధాలే గానీ, బంధువులతో గానీ, ఆఖరికి పరిచయస్థులతో ఏర్పడే ఏర్పడుతున్న బంధాలలో ( రిలేషన్ షిప్స్ - relationships )గానీ.. అవి యే తరహా బంధాలే గానీ, అవన్నీ బ్రేకప్ ఎప్పుడు అవుతాయీ అంటే - మనం ఎదుటివారి పట్ల చూపే నిర్లక్ష్యం, ఉదాసీనత ( పట్టించుకోకపోవటం ) ముఖ్యకారణాలు. ఇంకా కొన్ని కారణాలూ కూడా ఉంటాయి. 

ఎప్పుడైనా ఎదుటివారిని వారిని వారిలాగా చూడటం మానేస్తామో అప్పుడే ఇలాంటి భేదాభిప్రాయాలు వస్తుంటాయి. వారిని వారిలాగా గుర్తించండి. ఎదుటివారికి కనీస మర్యాద అంటూ ఇవ్వండి. వారి అభిప్రాయాల్ని గౌరవించడం చెయ్యండి. వారితో కలిసినప్పుడు వారి మీదే దృష్టిని పెట్టండి. వారు చెప్పే విషయాల్నిఆసక్తిగా వినండి. మధ్య మధ్య ఊ కొట్టండి. ఎదుటివారి స్థాయి, అంతస్థు, హోదా వారికి ఇచ్చే తీరులోనే ఇచ్చేలా మీరు మెలగండి. అప్పుడే మీ మీద ఒక మంచి సదభిప్రాయం వస్తుంది. వారూ మీకు ఒక గుర్తింపునీ, గౌరవాన్నీ.. ఇస్తారు. 

ఒకరకముగా ఇది ఎలా ఉంటుందీ అంటే ఇచ్చిపుచ్చుకోవటంలా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలీ అంటే (నిజమైన ) ఆత్మీయ బంధాలు అన్నీ అద్దంలా ఉంటాయి. వాటిల్లో మనం ఏమి చూపిస్తే, అవి వాటినే ప్రతిఫలిస్తాయి. ఒకసారి తేడా చూపిస్తే, ఏమీ అనరు. కానీ మెల్లమెల్లగా దూరం చేస్తారు. అప్పుడు మీకు మీ ఆత్మీయులు అనుకున్నవారు దూరం అవుతారు. దానివల్ల మీకు చాలా నష్టం జరుగుతుంది. 

ఆ నష్టం ఎలా అంటే - అంతవరకూ ఆ ఆత్మీయ బంధం ఏర్పడటానికి మీరు వెచ్చించిన సమయం, శ్రమ, డబ్బు... ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. మళ్ళీ క్రొత్తగా వేరేవారితో ఆత్మీయ బంధం అంటూ ఏర్పరుకోవాలని అనుకుంటే - మళ్ళీ ఇంత శ్రమ, డబ్బు, సమయం.. వెచ్చించాల్సిందే ! అంత కష్టం మళ్ళీ చెయ్యటానికి మీరు ఇష్టపడతారా ? అందుకే ఈ విషయాన్ని ఆత్మీయ బంధాలు ఉన్నవారందరూ బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. 




No comments:

Related Posts with Thumbnails