Bhadrakali Temple, Warangal - 2 తరవాయి భాగం. ( ఫొటోలు పెద్దగా కనిపించుటకు ఒక ఫోటో మీద డబుల్ క్లిక్ చేసి, ముందుకీ, వెనక్కి చూసేందుకు < > కీ లని వాడండి )
ఆ ఆది శంకరాచార్య విగ్రహాల ప్రక్కనే ఇలా శివుడి ప్రతిమ ఉంటుంది. నీటి కొలను మధ్యలో పెట్టారు. కానీ నేను వెళ్ళినప్పుడు అందులో నీరు లేదు.. రాత్రి పూట బాగా అందముగా కనిపించేలా లైటింగ్ ఏర్పాటు చేసినట్లున్నారు.
ఆ ధ్యాన ముద్రలో ఉన్న శివుడి విగ్రహం దగ్గరగా చూడండి.
శివుడి విగ్రహానికీ, రాధాకృష్ణుల మందిరానికీ మధ్య - ఇలా మొక్క కుండీ కనిపిస్తుంది. ఇది చెట్టు కాండం తొలచి అందులో మొక్కలని నాటారేమో అన్నట్లుగా కనిపిస్తున్నది కదూ.. !! కానీ కాదు.. కృతిమంగా సిమెంట్ తో చేసినది అది. కానీ నిజముగా ఉన్నట్లు అగుపిస్తున్నది కదూ. కానీ అందులో మొక్కలు ఏమీ లేవు. ప్రక్కనే చెరువు ఉన్నా, సిబ్బంది ఉన్నా - నిర్లక్ష్యం ఇలా.
రాధాకృష్ణుల ఆలయం ప్రక్కనే ఉన్న రావి చెట్టు. అక్కడ నీడ నిచ్చే చెట్టు, మరియు కూర్చోవటానికి కాసింత గట్టుగా ఉన్న స్థలమూ అదే.
ఆ చెట్టు మొదలులో ఏర్పాటు చేసిన గద్దె. ఇది చెట్టు కాండము ఆకారములో తయారుచేసి, నిజముగా అనిపించేలా రంగులు వేశారు. చూస్తుంటే నిజమైన కాండం అనేలా ఉంది కదూ..
ఆ చెట్టు వెనకాల ఉన్న కొండ బండరాయి మీద ఈ దృశ్యం కనిపిస్తుంది. ఆ బండరాయి పగుల్లో మొలచిన చెట్టు ఎలా పెరిగిందో చూడండి. అలాగే ఆ చెట్టుకి ఆధారాన్ని ఇవ్వటానికి ఆ చెట్టు వేర్లు ఎలా పారుకపోయాయో గమనించండి. అవన్నీ బయటకి కనిపించటం విశేషం.
ఆ చెట్టుకి ప్రక్కగా, రాధాకృష్ణుల ఆలయానికి ప్రక్కగా ఇలా కృతిమం గా ఒక కొలను ఏర్పాటు చేశారు. అందులో రెండు భాగాలుగా విడదీసి, తామరపూలు, కలువపూలని ఏర్పాటు చేశారు. బయట ఉన్న గోడని నునుపైన రాళ్ళతో అలంకరించారు.
ప్రక్కనే గోడ అవతల వెదురు ని నాటారు. దాని కొమ్మలు ఇలా ఆ పూల మీదకి వంగి, ముచ్చట్లు పెడుతుంటాయి.
తామర పూలు.
ప్రక్కన రాధాకృష్ణుల ఆలయాన్నీ చూడవచ్చును.
ఆ కొలను దగ్గరికి రాకుండా ఇలా చెట్ల కాండము, వెదురు బొంగులతో బారికేడ్ ఏర్పాటు చేశారు. కానీ అవన్నీ కృతిమంగా తయారుచేసినవి. దగ్గరికి వచ్చి, పరిశీలిస్తే గానీ, అవి నిజమా కాదా అని తెలుసుకోలేం..
ఆ కొలను ప్రక్కగా గోడ, చెట్లు ఉంటాయి. వీటి వెనకాలే శివ పార్వతుల విగ్రహాలు ఉన్నాయి. ఈ గోడ వారగా త్రాగటానికి మంచినీరు ఫ్రీజరు ఉంది. ( అది ఫోటో తీయటం మరిచాను.)
కొలను లోని కలువపూలు. ఇవి రాత్రిపూటే వికసిస్తాయి అతారు కానీ, పగటిపూట కూడా వికసిస్తాయి. ఇదే సాక్ష్యం.
కలువ పూలు.
ఆ దారి వెంట ఆలయానికి కుడివైపుగా వెళ్ళితే - ఇలా కొండలు కనిపిస్తాయి.
ఇలా కొన్ని వసతి గృహాలు నిర్మాణం లో ఉన్నాయి.
భద్రకాళి ఆలయం. కుడివైపున కనిపిస్తున్నది అమ్మవారి ఆలయం. ఎడమవైపున కనిపిస్తున్నది ఆలయం లోనికి వెళ్ళటానికి ఏర్పరిచిన ద్వార గోపురం.
భద్రకాళి అమ్మవారి ఆలయం (వెనక వైపు నుండి.)
భద్రకాళి అమ్మవారి ఆలయం (వెనక వైపు నుండి.)
ఆలయం పైన ప్రాకారములో అమ్మవారి విగ్రహం.
No comments:
Post a Comment